మొదటి బ్రెయిన్ సర్జరీ చేసింది భారతీయులేనా ?
మొదటి బ్రెయిన్ సర్జరీ చేసింది భారతీయులేనా ?
-లక్ష్మీ రమణ
బ్రెయిన్ సర్జరీ అన్ని సర్జరిలకంటే చాల క్లిష్టమైన సర్జరీ. ఒక్క నర్వ్ తేడావచ్చినా , అతను పిచ్చివాడైనా అయిపోతాడు. లేక ప్రాణం కూడా పోయే సందర్భం కూడా ఉండొచ్చు . అయితే ఇప్పటివరకు మనం మొట్టమొదటి బ్రెయిన్ సర్జరీ చేసింది విదేశీయులు అని పుస్తకాల్లోచదువుకున్నాం . కానీ ప్రపంచంలో మొట్టమొదటి బ్రెయిన్ సర్జరీ చేసింది మన భారతీయులే అంటున్నాయి దాదాపు 4500 సంవత్సరాల క్రితం నాటివిగా భావిస్తున్న అవశేషాలు . పూర్తి వివరాలని తెలుసుకుందామా !
ఈ ప్రపంచానికి శస్త్రచికిత్స విధానాన్ని పరిచయం చేసింది భారతీయులే. అది మన నలందా విశ్వవిద్యాలయాన్ని తగులబెట్టిన ఖిల్జీ మహాశయునికీ, వందల ఏళ్ళ తరబడి పరిపాలించి, మన సంస్కృతిని భ్రస్టు పట్టించిన బ్రిటీషు దొరవారికీ బాగా తెలుసు . ఈ క్రమంలో తగలబెట్టబడిన , తరలించుకుపోయిన విజ్ఞానం సాక్షిగా, ఆనాటి తాళపత్రాల సాక్షిగా , మన చరిత్ర మరుగున పడిపోయింది. కనీసం ఆ మరుగున పడిపోయిన మన చరిత్రను చెప్పే చిన్న ప్రయత్నం ఇప్పటికైనా జరుగుతున్నందుకు మనం కొద్దిగా సంతోషించొచ్చు .
మన పురాతన భారతీయులు సుమారు 4500 ఏళ్ళ క్రితమే మొట్టమొదటి బ్రెయిన్ సర్జరీ చేసినట్టు కాశ్మీర్ లోయలో దొరికిన కొన్ని పుర్రెల ఆదరంగా నిరుపితమయింది. దొరికిన మానవ పుర్రెలకు రంద్రాలు ఉండడం వల్ల అనుమానం వచ్చి వాటిని టెస్ట్ చేస్తే సుమారు అవి 4500 ఏళ్ళ క్రితం నాటివని రుజువు అయ్యింది. వాటి పై భాగంలో ఉన్న రంద్రాలను పరిశీలిస్తే అవి బ్రెయిన్ సర్జరీ కోసం చేసినవి అని రూఢిగా తెలియవస్తోంది . దీనిబట్టి ప్రపంచంలో మొట్టమొదటి బ్రెయిన్ సర్జరీ చేసింది మన భారతియులు అని ప్రపంచానికి తెలిసింది. సుశ్రుతుడు కూడా మొట్టమొదట సర్జరీ చేశారని , ఆయుర్వేదంతో సర్జరీ చేయడమే కాకుండా ద్రాక్షారసాన్ని వాడి , ఎనస్తీషియా అని చెప్పుకునే మత్తు నిచ్చి సర్జరీ చేసే విభాగానికి కూడా పునాదులు వేశారని , ఇదివరకే చెప్పుకున్నాం కదా !
హరప్ప – భారతదేశమే బ్రెయిన్ సర్జరీ మొదట చేసింది అనేదానికి సాక్ష్యం:
మెదడు శస్త్రచికిత్స అనేది ఆధునిక ఆవిష్కరణ కాదు. శతాబ్దాల క్రితం ఆ సమయంలో వైద్యులు ట్రెపనేషన్ అనే బ్రెయిన్ సర్జరీ పద్ధతిని అభ్యసించారు. హరప్ప నుండి మొట్టమొదటి మెదడు శస్త్రచికిత్స యొక్క సాక్ష్యం ఇది కనీసం 4300 సంవత్సరాల క్రితం జరిగిందని రుజువు చెయ్యబడింది.
ట్రెపనేషన్ – ఒక బ్రెయిన్ సర్జరీ విధానం:
ట్రెపానిషన్‌ను ట్రెపానింగ్, ట్రెఫినేషన్, ట్రెఫినింగ్ లేదా బర్-హోల్ చేయడం అని కూడా పిలుస్తారు. ఇది ఒక రకమైన శస్త్రచికిత్స . దీనిలో మానవ పుర్రెలోకి ఒక రంధ్రం చేసి దాని ద్వారా శాస్త్ర చికిత్స చేస్తారు . ఈ మెదడు శస్త్రచికిత్స విధానం అనస్థీషియా లేదా లాన్సెట్లను ఉపయోగించకుండా జరుపుతారు . కత్తులని , బ్లేడ్ లని శస్త్రచికిత్సలకు ఉపయోగిస్తారు . కానీ ఈ విధానంలో ఇది పుర్రెకు రంధ్రం వేయడానికి చేతితో పనిచేసే డ్రిల్లర్లు & ఇతర సాధనాలతో చేసినట్టుగా తెలుస్తుంది.
మొదటి బ్రెయిన్ సర్జరీ సాక్ష్యం ఇదీ !
మెదడు శస్త్రచికిత్స కి సంబంధించి ఈ ఆధారం ప్రకారంగా , బాధితుడు తన ఇబ్బంది నుండి బయటపడ్డాడు. ఆ తర్వాత తలలలో ఆ శాస్త్ర చికిత్స కోసం చేసిన రంధ్రంతో జీవించాడని కూడా తెలియవస్తోంది .
భోజ రాజు జీవితాన్ని వివరించే భోజా ప్రబంధం అనే వచనంలో 11 వ శతాబ్దంలో బ్రెయిన్ సర్జరీ గురించి మరొక సూచన ఉంది. భోజ రాజు మధ్యయుగ భారతదేశానికి చెందిన ఒక రాజు. ఆయన 11 వ శతాబ్దం ఆరంభం నుండి క్రీ.శ 1055 మధ్య భారతదేశంలోని మాల్వా రాజ్యాన్ని పరిపాలించాడు. అతను పరమారా రాజవంశానికి చెందినవాడు. కానీ ఆయన తీవ్రమైన తలనొప్పితో బాధపడేవాడు.
ఉజ్జయినికి చెందిన ఇద్దరు బ్రాహ్మణ సర్జన్లు అతనికి అపస్మారక స్థితి కలిగించడానికి “మోహా చుర్నా” అనే మత్తుమందు ఉపయోగించి శస్త్రచికిత్స చేశారు. వారు రాజు యొక్క తలలోని క్రినియల్ ఎముకను తెరిచారు. అలా తెరిచిన తల భాగంలో ఉన్న కణితిని తొలగించి, తరువాత రాజుగారికి తిరిగి స్పృహ రావడానికి “సంజీవని” అనే మరొక పొడిని ఉపయోగించారు. భోజా ఈ శస్త్రచికిత్స నుండి చాలా బాగా కోలుకున్నారు . అప్పుడు ఆ రాజు కొన్ని ఏళ్ళ పాటు రాజ్యాన్ని పరిపాలించాడు.
భారత ఉపఖండంలో కాంస్య యుగంలోనే ఈ ప్రపంచానికి ఎటువంటి టెక్నాలజీ గురించి తెలియకముందే మన భారతీయులు ఎన్నో అసాధ్యాలను సుసాధ్యం చేసి చూపెట్టారు. మన పూర్వికులు ఆయుర్వేద శస్త్రచికిత్సా పద్ధతులు ప్రాచీన భారతదేశంలో కూడా అనుసరించబడ్డాయి. అవే ఇప్పుడు రుజువు అవుతుంది.