పాతసినిమాల్లోలాగా మాయమైపోయే శక్తి వస్తే ఎలా ఉంటుంది!
పాతసినిమాల్లోలాగా మాయమైపోయే శక్తి వస్తే ఎలా ఉంటుంది!
-సేకరణ
పాతసినిమాల్లోలాగా మాయమైపోయే శక్తి వస్తే ఎలా ఉంటుంది ? పూర్వం ఒకాయన పాతాళంలోకి వెళ్లి తన కమండలంలో పట్టేటన్ని మూలికలు తీసుకొచ్చి , గ్రామంలో మూలికా వైద్యం చేసేవారట . అలా మనం కూడా పాతాళానికి వెళ్లి రాగలిగితే ఎలా ఉంటుంది ? అసలు ఇలాంటివన్నీ సాధ్యమయ్యేవేనా? అంటే, టిబెట్ లోని బౌద్ధ సాధకులు సాధ్యమే అంటారు . దానికి మార్గం ఏంటి ?
తంత్ర శాస్త్రంలో అరుణతారా అనే తాంత్రిక దేవతను పోలిన కురుకుల్లా అనే దేవత టిబెట్, చైనా దేశంలలో పూజలు అందుకుంటోంది. ఈమె ఎనిమిది చేతులతో ఉంటుంది. ఈమెకు ఉడ్డియాన కురుకల్లా అని ఇంకో పేరు కూడా ఉంది . ఈవిడ ప్రసాదించే శక్తుల గురించి వారు చాలా గొప్పగా చెబుతారు . మన్మథుని లాగానే పూలబాణాన్ని ఎక్కుపెట్టి ఉండే ఈ దేవత జ్ఞానప్రదాయని అని చెబుతారు .
సాధకుని సంకల్పాన్ని అనుసరించే కదా ఏ దేవతైనా వారాలనిస్తుంది. కానీ ఈవిడని ఉపాసన చేస్తే, వశీకరణతో పాటు రకరకాల సిద్ధులు సంప్రాప్తిస్తాయట . సౌందర్యానికి, శృంగారానికి, ప్రేమకు ఆదిదేవతగా పాశ్చాత్యులు పేర్కొనే ‘అప్రోడైట్’ అనే దేవతలా కురుకుల్లా కూడా శృంగారానికి ఆదిదేవతగా ఉంటుంది అని టిబెట్ తాంత్రికులు చెబుతారు. ఆ కారణంగా కొన్ని పేయింటింగ్స్ లో ఈమె అద్భుతమైన ఒంపుసొంపులతో ఉండే 16 సంవత్సరాల ఓ అందమైన యువతిలా చిత్రించబడి ఉంటుంది. ఈమె హస్తాలలో మన్మధుని ఆయుధాలైన పుష్పబాణము, ధనుస్సు కూడా ఉంటాయి. లిఖితపూర్వకంగా ఉండిన ఆర్య కురుకుల్లాకల్ప అనే పుస్తకము లో పేర్కొనబడిన అనేక రకాల తాంత్రిక విద్యలలో ఈ కురుకుల్లా సాధన కూడా ఒకటిగా ఉంది. ఈ కురుకుల్లా సిద్ధిని పొందిన వారికి ఎనిమిది సిద్దులు లభిస్తాయి అని ప్రాచిన తాంత్రిక గ్రంథాలు పేర్కొంటున్నాయి. అవేంటంటే ,
ఖడ్గసిద్ది :- ఈ సిద్ధిని పొందిన వ్యక్తి ఏవిధమైన ఆయుదాల ద్వారా గాయపడరు .
అంజన సిద్ది :- ఈ విధమైన సిద్ధిని పొందిన వ్యక్తి ప్రత్యేకమైన లేపనాన్ని తయారు చేసుకుని ఆ లేపనం ( తైలం ) తమ కంటికి లేదా చేతులకు పూసుకొని ప్రేతాత్మలతో , నాగ దేవతలతో , కొన్ని రకాల ప్రకృతి శక్తులను చూడగలరు .
పాదలెపన సిద్ది :- ఈ విధమైన సిద్ది సాధకుడు ఒక ప్రత్యేక లేపనం సహాయంతో వాయువేగంతో నేలపై ఎంత దూరం అయిన పరుగేత్తగల సిద్ధి .
అంతర్థాన సిద్ధి :- ఈ విధమైన సిద్ది పొందిన వ్యక్తి తాను కోరుకున్న సమయం లో ఎవరికి కనిపించకుండా అదృశ్యం కాగల సిద్ది ఇది ... కొన్ని రకాల వనమూలికల సహాయంతో ... కొన్ని రకాల ప్రయోగాలు చేయడం ద్వారా.
రసాయన సిద్ధి :- ఈ విధమైన సిద్ది పొందిన వ్యక్తి కొన్ని రకాల వనమూలికల సహాయంతో , ప్రయోగాల ద్వారా దాన్ని స్వీకరించి ఎన్నో సంవత్సరాల కాలం పాటు ఎటువంటి అనారోగ్యాలు లేకుండా ఆరోగ్యం గా జీవించగల సిద్ధి.
ఖేచర సిద్ది :- ఈ సిద్ది పొందిన వ్యక్తి గాలిలో తేలడం మరి కొరిన చోటికి గాలిలో ప్రయాణం చెయడం వంటిది ..
భూచర సిద్ది :- ఈ విధమైన సిద్ది పొందిన వ్యక్తి భూమి లోకి , కొండల్లోకి, చొచ్చుకొని పోగలరు .
పాతాళ సిద్ది :- ఈ విధమైన సిద్ది పొందిన వ్యక్తి పాతాళంలో ఉన్న భూత ప్రేత క్షుద్ర శక్తులను తన అదుపులో ఉంచుకోగల సిద్ది ఇది .
ఈ విధంగా ఈ కురుకుల్లా దేవిని ఉపాసన చేయడం ద్వారా సాధకుడికి పై తెలిపిన సిద్ధులను ప్రసాదిస్తుంది అని తంత్ర శాస్త్ర గ్రంథాలు చెబుతున్నాయి. లలితా సహస్ర నామములల్లో కూడా కురుకుల్లా పేరు ఉంది . సహస్ర నామాలలో ఒకటి అయిన కుమారీ అనే పేరు కూడా ఈ కురుకుల్లాకే చెందుతుంది అని అంటారు.
ఇవన్నీ, పాతాళభైరవి సినిమాలో మాంత్రికుడు చూపించిన మాటల్లా అనిపించొచ్చు , కానీ ఆ విధమైన ఒక విజ్ఞానం , సాధనద్వారా సాధించొచ్చని చెప్పే గ్రంధాలు, సాధకులూ కూడా ఉన్నారని ఈ ప్రాంతాల వాసులు విశ్వసిస్తుంటారు .
నోట్ :- ఇది కేవలం ఓ అవగాహన కోసం మాత్రమే పోస్ట్ చెయ్యబడింది.