మర్మకళ - పరుశురాముని కరుణ !
మర్మకళ - పరుశురాముని కరుణ !
-లక్ష్మీ రమణ
భారత దేశానికీ విజ్ఞానానికి విడదీయరాని సంబంధం ఉంది. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది సత్యం. ఇది భారతీయ ఆధ్యాత్మిక సంపదలో దాగిఉంది. వేదాలు, ఉపనిషత్తులు, వాటిని రచించిన మహర్షులూ ఏ శాస్త్రవేత్తకి తీసిపోనివారు . అసలు ఆ పోలిక కూడా సరైనదికాదు. అంతకు మించి ఏదైనా చెప్పగలిగితే బాగుంటుంది. వీటిల్లో యుద్ధకళలు కూడా ఉన్నాయి. విశ్వామిత్రుడు రాములవారి బోధించినది అణ్వాస్త్రాల ప్రయోగం కాదా ? అదేవిధంగా పరుశురాముడు బోధించినట్టుగా చెబుతున్న మరో యుద్ధ కళ మర్మకళ.
విమానం అనే పదం రైట్ బ్రదర్స్ విమానాన్ని నిర్మించే ముందరే, ఈ దేశంలో ఉంది. ఖగోళం గురించి , విశ్వ సృష్టిని గురించి ఇతర ప్రపంచం ఆలోచించే లోపలే భారతదేశం గ్రహాల గతులు మానవ జీవితాన్ని ప్రభావితం చేస్తాయని ఒక శాస్త్రాన్ని ప్రపంచం ముందర పెట్టింది . గణితంలో సున్నా గొప్పదనాన్ని పరిచయం చేసింది. ఇలా ఒకటికాదు, రెండుకాదు, ఎన్నో ప్రత్యేకతలూ వైజ్ఞానిక ఆవిష్కరణలో భారతీయుల సాంతం. అటువంటి వాటిల్లో యుద్ధ కళలు కూడా ఒకటి. అందులోనూ దక్షిణ భారతంలో ఇప్పటికీ వినియోగంలో యన్న మర్మకళ లేదా వర్మకళ లేదా కళరిపయట్టు ప్రధమ స్థానంలో నిలుస్తుంది . దీనికి ఆద్యుడు స్వయంగా శివుడే !
కళరిపయట్టు అభ్యసించేవారు కూడా ఆ శివుని మాదిరిగానే , గోచీతో పంచ కట్టి, జుట్టు పెంచి శిగ చుట్టి కనిపిస్తారు . మలయాళంలో కళరి అంటే పాఠశాల లేదా వ్యాయామశాల అని అర్థం. పయట్టు అంటే యుద్ధం, వ్యాయామం, లేదా కఠిన శ్రమతో కూడిన పని అర్థం. కళరిపయట్టు అనే పదం ఈ రెండు పదాల కలయిక వల్ల ఉద్భవించింది. ఇది యాగవిద్యతో అనుసంధానమైనది. నాడీ విజ్ఞానాన్నిఆధారంగా చేసుకుని ఉన్నది. ప్రాణం అంటే, మనం తీసుకునే శ్వాసేకదా ! ఆ శ్వాస ప్రాణ , అపాన వ్యాన, ఉదయాన, సమాన మనే ఐదు వాయువులుగా మారి శరీరం లోని వివిధ క్రియలని పూర్తి చేస్తుంటుంది. అలా శరీరమంతా వాయువు 72వేల నాడులని ఆధారంగా చేసుకొని ప్రసరిస్తుంది. ఇలా తిరిగే సమయంలో మనం ప్రాణాన్ని కొన్ని ప్రత్యేక స్థానాల వద్ద (మర్మ స్థానం ) ఒత్తిడికి గురిచేయడం ద్వారా దాడికి పాల్పడిన వ్యక్తులని శాశ్వతంగా కోమాలో ఉండేవిధంగా చేయొచ్చు. అంటే ఒత్తి చేతులతోటే , శతువుపైనా విజయాన్ని సాధించవచ్చన్నమాట .
మర్మ స్థానాలుగా చెప్పబడే చోట్లా యుద్ధవిద్యా నైపుణ్యాన్ని వాడి, ఒక ప్రత్యేక పద్ధతిలో ఈ యోధులు కొట్టే దెబ్బలు చాలా తీవ్రమైన సమస్యలని కలిగిస్తాయి. అవయవాలు చచ్చుబడిపోవడం , కోమా లోకి వెళ్లిపోవడం , ఆపై మరణించడం ఈ మూడు రకాల అవస్థలు శత్రువుకి కలుగుతాయి . ఈ ఫలితం అనేది ఆ యోధులు ఏ మర్మస్థానంలో కొట్టాడు అనే దానిమీద ఆధారపడి ఉంటుంది. ఇలాంటి దెబ్బలకి బలైన వ్యక్తిని బ్రతికించడం దాదాపు అసాధ్యం అని ఇప్పటి డాక్టర్లుకూడా చెబుతుంటారంటే, వాటి ప్రభావాన్ని అంచనా వేయొచ్చు.
ఆయువుపట్టుమీద కొట్టడం అనే మాట, ఇలాంటి యుద్ధకళని చూసే పుట్టిందని చెప్పొచ్చు. మనిషిని పూర్తిగా నరకానికి దగ్గరగా తీసుకెళ్లి , మృత్యువుని పరిచయం చేస్తుంది ఈ కల. ఇప్పటికీ కేరళ, తమిళనాడు , శ్రీలంక, మలేషియాలలో ఈ భారతీయ కళ మన్ననలు అందుకుంటూ ప్రదర్శించబడుతోంది . కేరళీయులు సింహభాగం ఇప్పటికీ దీన్ని ప్రదర్శిస్తున్నారు .
కుంగ్ ఫూ , జూడో , కరాటెల లాంటి యుద్ధవిద్యే కళరిపయట్టు కూడా! చెప్పాలంటే, భారతీయ ఆధ్యాత్మిక, మంత్రం, తంత్ర శాస్త్రాల ఆధారంగా నిర్మితమైన గొప్ప కళ . దీన్ని నేర్చుకోవడం, ప్రదర్శించడం అంత సులువైన విషయం కాదు .