పాతాళం అంటే నేటి అమెరికానేనా ?
పాతాళం అంటే నేటి అమెరికానేనా ?
సేకరణ: లక్ష్మి రమణ
ఎన్నో అనుమానాలు సందేహాలూ ఈ విషయంలో ఉన్నప్పటికీ , అప్పటి మునులు , ఋషులు వర్ణించిన భౌగోళిక పరిస్థితులు, ఇప్పటి ధర్మవేత్తలు , మేధావులూ వేస్తున్న అంచనాలూ పాతాళం అంటే, అమెరికానే అనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఆ విశేషాలని సేకరించి మీకోసం అందిస్తున్నాం అవధరించండి .
పాతాళం అంటే నేటి అమెరికా అని దయానంద సరస్వతీ గారు మొదలైన అనేక మంది పండితుల అభిప్రాయం. భూగోళంలో భారతదేశానికి సరిగ్గా అవతల వైపున అమెరికా ఖండం ఉంది. భారత దేశంలో నిల్చున్నవారి పాదాల క్రింద ఉన్నది. కావున దానికి పాతాళంగా వ్యవహరించారు.