Online Puja Services

ఇంటి పై గుడినీడ పడితే ఏమవుతుంది !

3.144.40.78

ఇంటి పై గుడినీడ పడితే ఏమవుతుంది !
సేకరణ : లక్ష్మి రమణ 

నిలువెత్తున జ్వలించే అగ్నికి దగ్గరలో నిలబడగలమా ? ఆ అగ్ని వేడిని మనం తట్టుకోగలమా ? అది సాధ్యమయ్యే పని కాదు .  ఆలయం దగ్గరలో నివాసం ఉండకపోవడం కూడా అలాంటిదే. 

దేవాలయం ఒక పవిత్రమైన స్థలం అయినా శాస్త్ర బద్దంగా స్థాపించిన ఒక శక్తి కేంద్రకం. 
ఆలయాలలో హోమం, యాగాదులు ఎల్లవేళలా జరుగుతుంటాయి. 
అందువల్ల ఆలయం ఉన్న చోట అలాగే గుడినీడ ఇంటిపై పడేచోట ఇల్లు కట్టుకోకూడదు అంటుంటారు. 
 
మరి పూజారులు ఉంటారు కదా! అనే సందేహం రావడం సహజమే . వారు పూజ చేయడానికి అర్హులు అలాగే వారు చాలా పవిత్రంగా ఉంటారు. దానికి సంబంధించిన మాత్రయిక్త విధుల్ని వారు నిత్యం ఆచరిస్తుంటారు . 

అసలు గుడికి ఎంత దూరం లో ఉండాలి ? ఏ గుడి నీడ పడితే ఎలా ఉంటుంది ? అంటే, 
వాస్తు ప్రకారం గుడికి కొన్ని వైపులు మాత్రం ఉండకూడదట. దేవాలయానికి ఇంటికి ఉండవలసిన దూరం గర్భ గుడిలోని మూల విరాట్టు విగ్రహం నుండి కొలవాలట.

ఎంత దూరం లో ఉండాలి ?

శివాలయాలకు, వైష్ణవ ఆలయాలకు, అలాగే శక్తి ఆలయాలకు 200 అడుగుల దూరం లోపు ఇల్లులను నిర్మించుకోకూడదు. ముందు చెప్పినట్టుగా ఇంటికి గుడికి దూరాన్ని గర్భ గుడిలోని మూల విరాట్టు విగ్రహం నుండే పరిగణలోకి తీసుకోవాలంట. అంతేకాదు ఇక్కడ చెప్పబడిన ఆలయాలకు దగ్గరలో నివసించడం వల్ల ఆ ఇంట్లో వారిని దారిద్య్రం వెంటాడుతుందట. డబ్బు నిలవదట.

ఎటువైపు ఇల్లు ఉండకూడదు?

వాస్తు శాస్త్రం ప్రకారం శివాలయాలకు వెనుక వైపు ఇల్లు ఉండవచ్చు, వైష్ణవ ఆలయాలకు ముందు ఉండవచ్చు అని శాస్త్రం చెబుతుంది. గుడికి ఆనుకొని ఏ ఇల్లు ఉండకూడదు. అలా కాకుండా రివర్స్ లో ఉంటే కనుక ఆ కుటుంబంలో వివాదాలు, కలహాలు ఎక్కువగా కలిగే ప్రమాదం ఉంటుందట.

ఏ ఆలయం దాగ్గర ఉంటె, ఏ ఫలితం కలుగుతుంది ?

శివాలయానికి దగ్గరలో:
శివాలయానికి దగ్గరలో ఇల్లు ఉంటే మాత్రం శత్రువుల భయం ఎక్కువగా ఉంటుందట.

వైష్ణవాలయానికి దగ్గరలో:
వైష్ణవాలయానికి దగ్గరలో కనుక ఇల్లు ఉండినట్లయితే ఆ ఇంటినుండి అమ్మవారు విడిచి స్వామివారి సన్నిదిలోకి వెళ్ళిపోతారంట. ఆ ఇంటిలో కూడా లక్ష్మీదేవి నిలవదట. డబ్బు సమస్య ఎల్లవేళలా పీడిస్తుంది అంట. 

శక్తి ఆలయానికి దగ్గరలో:
శక్తి ఆలయానికి ఆనుకుని ఇల్లు ఉంటే కనుక ఆ ఇంట్లోని వారు ఎవ్వరూ వృద్ది చెందరు. అంతేకాదు ఏ కార్యక్రమంలోని పురోగతి ఉండరట. ఏ కార్యక్రమ్మాన్ని చేపట్టినా ఫలితం శూన్యం.

వినాయకుని ఆలయానికి దగ్గరలో:
ఇంటికి 200 అడుగుల లోపు ఉత్తరాన, వాయువ్యంలో వినాయకుని ఆలయం ఉన్నవారికి ధన నష్టం, అవమానాలు జరుగుతాయట. వృధా ఖర్చులు పెడతారట.

 మీరు ఒకవేళ ఇప్పటికీ ఆలయాల నీడపడే చోట మీ ఇల్లు ఉంటే కనుక వెంటనే వాస్తు శాస్త్రజ్ఞుడిని సంప్రదించండి.

Quote of the day

Even if you are a minority of one, the truth is the truth…

__________Mahatma Gandhi