Online Puja Services

తల పై అక్షింతలు ఎందుకు వేస్తారు?

3.144.11.239

తల పై అక్షింతలు ఎందుకు వేస్తారు?

అక్షింతలు అంటే మనకందరికీ తెలుసు.. బియ్యం లో పసుపు కలిపి ఏ పండగ వచ్చినా, ఏదైనా శుభకార్యాలు జరిగినా, మన పెద్దల కాళ్ళకి నమస్కరిస్తే, వారు మన తల పై అక్షింతలు వేసి            ఆశీర్వదిస్తారు. అయితే అసలు ఆశీర్వదించడానికి బియ్య0నే ఎందుకు ఉపయోగిస్తారు, 
పెద్దల కాళ్ళ కు ఎందుకు నమస్కరిస్తాం? అనే వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. 

అక్షింతలు అంటే క్షతం కానివి అని అర్ధం. అంటే రోకలి పోటుకు విరగనివి అని, శ్రేష్ఠమైన బియ్యం అన్నమాట. అలాంటి బియ్యానికి పసుపు మరియు నెయ్యి కలిపి అక్షతలు(అక్షింతలు) తయారు చేస్తారు. మనం పూజించే నవగ్రహాల్లో ఒక్కో గ్రహానికి ఒక్కో ధాన్యాన్ని దాన వస్తువుగా పేర్కొంటారు. ఆ రకంగా నవగ్రహాలలో చంద్రుడికి ప్రీతి కరమైన దానవస్తువు బియ్యం. చంద్రుడు మనస్సుకు అధినాయకుడు. అంటే చంద్రుడి శక్తి ప్రభావం మనిషి మనసు, బుద్ధి, గుణము, వ్యసనము వీటన్నిటి పై ఎక్కువగా ఉంటుంది. అందుకే ఆ చంద్రుడికి సంకేతమైన బియ్యం కూడా మనిషి మన స్సుపై ప్రభావం చూపుతుందని, మనోధర్మాన్ని నియంత్రిస్తాయి అని గట్టిగా విశ్వసించేవారు మన పూర్వీకులు. అందుకే అక్షింతలను తల పై వేసి ఆశిర్వదిస్తారు.. 

సైంటిఫిక్ గా చెప్పాలంటే బియ్యానికి విద్యుత్శ క్తిని నిగ్రహించే తత్వం ఉంది. దేహం ఓ విద్యుత్‌ కేంద్రం. విద్యుత్‌ సరఫరాల్లో హెచ్చుతగ్గులు సాధారణం కదా, ఈ వ్యత్యాసాలు మనిషి మనస్సు మీద, ఆరోగ్యం మీద ప్రభావాన్ని చూపుతాయి. మన పై అక్షింతలు వేసి ఆశీర్వదించే సమయంలో, వారి దేహంలోని విద్యుత్తులో కొంత భాగం ఈ అక్షతలను తాకి ఆశీస్సులు ఇచ్చే వాళ్ల నుంచి, పుచ్చుకొనే వాళ్లకి కొంత విద్యుత్‌ బదిలీ అవుతుంది. 

మనిషి దేహంలో విద్యుత్‌ కేంద్రాలు ఇరవై నాలుగు ఉంటాయి, వాటిలో ప్రధానమైనది శిరస్సు. ఇది విద్యుదుత్పత్తి కేంద్రమే కాదు, విద్యుత్‌ ప్రసార కేంద్రం కూడా. తలపై అక్షింతలు వేయడం ద్వారా వాటిలోని విద్యుత్‌ను గ్రహించి దేహానికి ప్రసారం చేస్తుంది శిరస్సు. ఈ కారణంగా అక్షింతల  ద్వార పెద్దలలో ఉండే సాత్విక గుణం పిల్లలకు లభిస్తుంది. 

ఇక పసుపు క్రిమి సంహరకం, ఆశీస్సులు ఇచ్చే వారికీ ఎటువంటి చర్మ వ్యాదులు లాంటివి ఉన్నా అవి ఆశీస్సులు పుచ్చుకొనేవారికి రాకుండా ఉంటాయి.. పెద్దలు మనకు అక్షతలు వేసి శిరస్సును తాకి ఆశీర్వదించడంలోని ఆంతర్యం, పర మార్థం ఇదే! 

ఆధ్యాత్మికంగా చెప్పాలంటే జీవుడికి సంకేతం బియ్యమేనట.. ‘అన్నాద్భవన్తి భూతాని’ అని భగవద్గీతలో మూడవ అధ్యాయంలో చెప్పబడింది. జీవులు అన్నం చేత పుడతారట. ఈ అన్నం తయారీకి మనం ఉపయోగించే ధాన్యం బియ్యం. భగవంతునిపై అక్షతలు వేసి నమస్కరించడం అంటే, జీవుడు ఈ అన్నంలో పుట్టీ, తిరగి ఈ జీవుడిని భగవంతుడిలోకి చేర్చడమేనట. 

ఇక పెద్దల దగ్గర ఆశిర్వదం తీసుకోనేపుడు పాదాల కెందుకు నమస్కరిస్తాం అంటే మన శరీరం లో తల ఉత్తర ధృవం అయితే పాదాలు దక్షిణ ధృవం.. వ్యతిరేక ధృవాలే ఆకర్షించుకుంటాయి అని మనకు తెలుసు కదా, అప్పుడే శక్తి విడుదల అవుతుంది. అలానే మనం పెద్దల దగ్గర ఆశీర్వాదం తీసుకోనేపుడు మన తలను వారి పాదాలకు తాకించి ఆశీర్వాదం తీసుకుంటాం. అప్పుడు వారి పాదాలలోని దక్షిణ ధృవం మన తల లో గల ఉత్తర ధృవంతో ఆకర్షితమై శక్తిని వెలువరుస్తుంది.. అందుకే మన హిందు సంప్రదాయం లో పెద్దల కాళ్ళకు  నమస్కరిస్తాం. కానీ ఇప్పుడు పెద్దల దగ్గర ఆశీర్వాదం తీసుకోవడం అంటే, ఒకరి కాళ్ళ మీద మనం పడటం ఏంటి అనే అహం ఎక్కువ అయిపోయింది. ఒకటి గుర్తుపెట్టుకోండి, మన పెద్దలు మనకన్నా చాలా విషయాలలో అనుభవజ్ఞులు కాబ ట్టి  అలాంటి వారి అనుభవాల నుండి మనం చాలా నేర్చుకోవచ్చు. వారి ముందు అహం చూపించడం లో అర్థం లేదు.. మనం బాగుండాలి అని మనసారా దివించే వారి నుండి దీవెనలు అందుకోవడానికి మనకి అహం అడ్డు రాకుండా ఉండాలి

- సిరివెళ్ల నాగరాజస్వామి 

Quote of the day

Even if you are a minority of one, the truth is the truth…

__________Mahatma Gandhi