Online Puja Services

మంత్రాలకు చింతకాయలు రాల్తాయో లేదో తెలీదు కానీ

3.145.99.178

మంత్రాలకు చింతకాయలు రాల్తాయో లేదో తెలీదు కానీ చినుకులు మాత్ర్రం ఖచ్చితంగా రాల్తాయి .  
-లక్ష్మీ రమణ 

మంత్రాలకి చింతకాయలు రాల్తాయో లేదో తెలీదుగానీ, ఆకాశములో మేఘాలు మాత్రం కరుణిస్తాయి . పుడమితల్లిని తమ చల్లని నీతిముత్యాలతో అభిషేకిస్తాయి . సస్యాలకి జల స్తన్యమిచ్చి జీవులని పోషిస్తాయి . అసలు ఇదంతా ఎలా జరుగుతుంది ?

 మన విశ్వంలో వర్షానికి  ముఖ్యంగా రెండు శక్తి వ్యవస్థలు (energy systems) అవసరం అవుతాయి . 
    

1.శబ్ద_తరంగాలు 
2.ఉష్ణ_తరంగాలు 

మంత్రాలు ద్వారా శబ్ద తరంగాన్ని , అగ్ని ద్వారా ఉష్ణ తరంగాన్ని ప్రేరేపించడం వరుణయాగం చేయడం ద్వారా సాధ్యమవుతుంది అంటున్నారు పండితులు . దీనివల్ల వరుణుడు కరుణించి వర్షాన్ని అనుగ్రహిస్తాడని, దానికి శాస్త్రీయమైన కారణాలు ఇవీ అని చెబుతున్నారు .  

 యఙ్ఞాలలో సమిధలు, ఆవు నెయ్యి, ఆవు పాలు, గోధుమలు, సోమ (ఒక రకం మొక్క) లని వాడతారు. వాటి ప్రాముఖ్యత యిపుడు చూద్దాం.
 ఆవు నెయ్యి అగ్ని లో వేసినపుడు ఒక లీటరు నెయ్యి కి ఒక టన్ను  ప్రాణవాయువు (ఆక్సిజన్) ఉత్పత్తి జరుగుతుంది . 

ఆవు పాలు 100 డిగ్రీలకు ఆహుతి అయ్యాక ఎథిలిన్ ఆక్సైడ్ (ethelene oxide) వెలువడుతుంది . ఇది  సూక్ష్మ క్రిములను నాశనం చేస్తుంది. ICU లలో sterilization కి ఈ gasని వినియోగిస్తారంటే, ఇది ఏవిధమైన క్రిమిసంహారాన్ని చేస్తుంది అనేది ఆలోచించాల్సిన విషయం .  కొత్త ఇంట్లో పాలు పొంగించడం అనే సంప్రదాయం వెనుకున్న కారణాల్లో ఇది ఒకటి. 

ఆవు పాలు, నెయ్యి కలసినపుడు ప్రొపెలెన్ ఆక్సైడ్ (propelene oxide) వెలువడుతుంది . కృత్రిమ వర్షానికి ఈ వాయువే కారణం.

 సోమ అనే మొక్క శాస్త్రీయ నామం ( scientific name)  ASCLEPIUS ACIDA. ఈ మొక్క downstream water quality అంటే భూమి లో వున్న నీటి శాతాన్ని, నాణ్యతను పెంచుతుంది. 

ఈ మొక్క ని యజ్ఞంలో వాడటం వల్ల cloud seeding అంటే వర్షపాతం ను పెరిగేలా చేసి cloud condensing మేఘాలను సంక్షేపనం చేసి వర్షం వచ్చేలా చేస్తుంది. ఇది ఆస్తమా వంటి వ్యాధులను తగ్గిస్తుంది. 

ఆవు పిడకలు రేడియేషన్ ని గ్రహిస్తాయి (radiation absorber. )

ఇక  గంధం, నెయ్యి తదితరాలన్నింటితో కలిసిన యజ్ఞంలో hydro carbons ని oxidise చేసి formic acid, acetic acid అనే క్రిమినాశిని వాయువులు ఏర్పడతాయి. 
     
శాస్తీయత లేదని కొట్టిపడేసే విజ్ఞానవంతులు ముందుగా ఇటువంటి విషయాలని పరిశోధించి తెలుసుకుంటే బాగుంటుంది . సృష్టిలో ఉన్నవాటిని వినియోగించి , అవి అలా ఎందుకున్నాయి తెలుసుకోగలమేతప్పవాటిని సృష్టించడం తెలియని మానవులమే కదా అందరం . వాటిని సృష్టి చేసిన వాడి సాంకేతికత మన సాంకేతికత కంటే ఎంతో ఉన్నతమైనది అని ఈ ఒక్క విషయం తోటి అర్థమవుతూనే ఉంది కదా . ఉదాహరణకి ఎన్ని థియరీలపైన పరిశోధనలు చేసినా అది ఈ సృష్టి ఇలా పుట్టింది అని ఇతమిద్దంగా చెప్పలేకపోయింది . కానీ సృష్టి అనేది ఆ పరిశోధనకు ముందే ఉంది కదా !  ఎన్నో గొప్పవైన సాంకేతికతకి అందని అద్భుతాల్ని కలిగిన మన హైందవ సంస్కృతిని, ఒక గొప్ప జీవన విధానాన్ని , మన సనాతన ధర్మాన్ని రక్షించుకుందాం . కాపాడుకుందాం . 

శుభం .

Quote of the day

Even if you are a minority of one, the truth is the truth…

__________Mahatma Gandhi