ఒంటరితనం
ఆ తండ్రి పరమాత్మ ఈ భూప్రపంచం మీద తన బిడ్డ అయినా మనిషి ఒంటరిగా జీవించలేడు అని బంధాలను సృష్టిస్తే.ఈ మనిషి అదే బంధాలను తెంచుకుంటూ ఒకటిగా జీవించాలని చూస్తూ
మళ్ళి ఒంటరి అవుతున్నాడు ఎందుకంటారు?
అలా ఆలోచించండి.
నేను ఆలోచిస్తే నాకు అనిపించింది ఏంటంటే
మన ఆలోచన విధానమే దానికీ కారణం అనిపించింది.ఎలా అంటారా? ఉన్నది గుర్తించక లేని దాని కోసం పరుగులు పెడుతూ ఆ పరుగులో తగిలిన దెబ్బలతో
అయినా గాయలతో బంధల్లో నమ్మకం పోయి
బంధం అంటే ఎక్కడ మళ్ల గాయం అవుతుందోనని పదే పదే ఆలోచిస్తూ జీవితం మీద విరక్తితో ఒంటరి వాళ్ళం అయిపోతున్నాం అనిపించింది.
ఈ పరిస్థితి మంచిదంటారా ?
ఆధ్యాత్మికతతో సాధన చేసేవారికి అయితే
ఒంటరి అవ్వటం మంచిదే.ఆ సాధన లేనివారికి
పిచ్చి పిచ్చి ఆలోచనలతో బంధలకు దూరం అయి ఒంటరి అవ్వటం మంచిది కాదేమో ఆలోచిచండి.
అసలు ఆనందమైనా దుఃఖమైనా మన ఆలోచన విధానంలోనే ఉంది. ఇక్కడ ఎన్నాళ్లు ఉంటాము ఎవరికి ఎరుక ? రాత రాసిన
ఆ పరమాత్ముకే ఎరుక. ఒక రోజులో 1440 నిమిషాలు ఉంటాయ్ అంటే ఒక రోజు మన జీవితంలోకి సంతోషాన్ని తీసుకురావడానికి 1440 అవకాశాలు అందిస్తున్నాడు ఈశ్వరుడు.
ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకుందాం.
లేదా అసలు మనం ఎందుకు వచ్చాం?
ఈ భూమిమీదకు అని తెలుసుకోవాలి అనుకుంటే. దేహములో ప్రాణమున్నంత వరకే ఈ జీవితము.
ఏదైనా సాధన చేయవలెనంటే ఈ దేహము
ఉన్నంత వరకే. బంధుమిత్రులు, సిరి సంపదలంటూ సమయమంతా వాటి కొరకే వెచ్చిస్తే మానవ జీవితమును వ్యర్థం చేసుకున్నట్లే.
ప్రాణముతో కూడిన దేహములో దైవత్వము తాండవించుటకు అవకాశం ఉంటుంది.
కనుకనే ప్రాణముతో కూడిన దేహమును
శివం గా పిలుస్తారు.
ప్రాణము పోయిన దేహము శవము అవుతుంది.
దేహము శవము అయిన తరువాత చేసేదేమీ లేదు.
గత జన్మలు ఎన్ని గడచిపోయాయో ఎరుగము.
ఎన్ని అవమానములు, కష్టనష్టములు
పడినామో తెలియదు.
మున్ముందు అయినా ఇటువంటివి పునరావృతం కాకుండా మరో జన్మ రాకుండా చూసుకొనుటకు
ఈ జన్మ ఓ మంచి అవకాశం.
మన జీవితంలో రెండు తేదీలు ముఖ్యం
అవి మన సమాధిపై రాసే జనన మరణ తేదీలు.
ఆ రెండు తేదీల మధ్య జీవితన్ని మాత్రమే చూస్తారు పరమాత్మ అయినా మనుషులు అయినా.
ఇంకా మన ఇష్టం ఆ రెండు తేదీల మధ్య జీవితాన్ని సచ్ఛింతనలతోనూ, సదాలోచనలతోనూ, సరైన సాధనలతో సద్వినియోగ పరచుకుంటామో లేదా వ్యర్థ ఆలోచనలు,వ్యర్థ చేష్టలతో వృథా పరచుకుంటామో మనమే నిర్ణయించుకోవాలి.
శివయ్య అందరిని చల్లగా చూడు తండ్రి
- బి. సునీత