Online Puja Services

భారతీయ కోడలు

3.147.48.161

భారతీయ కోడలు

 కూతురా కోడలా ఎవరు ప్రధానం...??? అనే ప్రశ్నకు కోడలే అని సమాధానం చెపుతుంది భారతీయ ధర్మం...!!!

ఎందుకో తెలుసా...!!!

 చీర మార్చుకున్నంత సులవుగా ఇంటి పేరును మార్చుకోగలిగే అసాధారణ త్యాగశీలి కోడలు...!!

 కన్న వారు ఎంతటి ఉన్నతులైనా తన అభ్యున్నతిని అత్తవారింట్లో వెతుక్కునే గుణశీలి కోడలు...!

తండ్రికి పంచభక్ష్యాలు పెట్ట గలిగే స్తోమత ఉన్నా భర్త పెట్టే పచ్చడి మెతుకుల్లోనే కమ్మటి రుచిని వెతుక్కోగల భాగ్యశీలి కోడలు...!

తాను మెట్టినింటి పట్టపు రాణి. అయినా సరే ఒక దాసిలా అందరికీ సేవ చేసి అలసి పోయి మంచానికి ఒరిగి కష్టాన్ని మరచి మరునాడు ఉదయమే గృహ సేవకు సిద్ధమయ్యే శ్రమజీవి కోడలు...!

కుడి కాలు పెట్టి కోడలు తన ఇంటి లోకి రాగానే, అమ్మ కోసం బెంగ పెట్టుకున్న పసి వాడిలా ఎగిరి గంతులేస్తాడు ఆ కోడలి మామ గారు. ఎందుకో తెలుసా రేపట్నుంచి అందరికీ అన్నం పెట్టే అమ్మే కదా! కోడలు...!

కొడుకు పెళ్ళి కోసం వేసిన పందిరి ఆకులపై కూర్చున్న పితృదేవతల కోసం నాంది శ్రాద్ధం పెట్టి, మన వంశాన్ని ఉద్ధరించగలిగే సమర్థురాలైన గొప్ప కోడలిని ఎంచుకున్నాను అని గర్వంతో చెపుతాడు మామయ్య. ఎందు కంటే కోడలే అత్తింటికి అసలు కాంతి...!

పెళ్లి అయ్యాక ఏడుస్తున్న పెళ్లి కూతురిని చూసి ఇప్పుడు నీకెవరు దిక్కు అని ఎవరయినా అడిగితే, చేయి పట్టుకున్న భర్త పేరును కూడా చెప్పక నా అయ్య అనకుండా మా అయ్య..! అంటూ సమాధానమిస్తుంది. ఇది విన్న పెళ్ళి కొడుకు తండ్రికి మావయ్యా అని పిలిచినట్లనిపించి, ఎవడ్రా నా కోడలిని ఏడిపిస్తున్నది అని గర్జిస్తాడు. ఇక అప్పట్నుంచి కోడలిని బిడ్డలా కాపాడతాడు మామయ్య...!

ఏ ఇంట కొడలిని తక్కువ చేసి కూతురిని గొప్పగా కీర్తిస్తారో ఆ ఇంటి గృహలక్ష్మి చిన్న బుచ్చుకుని వెళ్ళి పోతుంది, ఎందుకో తెలుసా...? కోడలే గృహలక్ష్మి...!
    
   
చివరిగా ఒకమాట... పితృదేవతలు మరణించిన తరువాత... కొడుకు పెట్టె పిండాలకన్నా... కోడలు పెట్టే దీపానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. అది... కోడలి గొప్పతనం...

- వాట్సాప్ సేకరణ 

Quote of the day

No one saves us but ourselves. No one can and no one may. We ourselves must walk the path.…

__________Gautam Buddha