జ్ఞానోదయం
జ్ఞానోదయం
మేఘాలు పనిగట్టుకొని వర్షిస్తున్న వానాకాలంలో
బావులు నిండకుండా ఉండలేవు
నదులు ప్రవహించకుండా ఆగలేవు
ప్రపంచం నుండి విషయాలు
చిత్తము నుండి జ్ఞపకాలు
పనిగట్టుకొని బుద్ధికి చేరుతూ ఉంటే
మనసు విషయాలతో నిండకుండా ఎలా ఉంటుంది ?
విషయాలతో నిండిన మనస్సులో
ప్రపంచం ఉంటుందే గాని పరమాత్మ ఎలా ఉంటాడు ?
పరమాత్మ లేని మనస్సులో
ప్రపంచమేం ఉంది ? కొత్తదన మేముంది ?
నూతనత్వ -- మేముంటుంది ?
1 పాత ప్రపంచము
2 ప్రపంచమును గూర్చిన
చింతతో నిండిన మనస్సు
3 అట్టి మనస్సును కలిగి ఒకనాడు
కాయలాగా రాలిపోయే కాయము
నీవు మరోలాగ ఉండటము
మరొకరికి సంబంధించి ఉండటము
సుఖించడానికి ఏవో కావాలనుకోవడము
సుఖపడటానికి ఏవో పోవాలనుకోవడము
చేసిన -- ఆలోచనలే చేయడము
చూసిన రుచులే చూడటము
వీటి మధ్య ఆనందాన్ని
కొనాలని ఉబలాట పడటము
ఇలా ఉంది పాత జీవితం
పాతను పాతిపెట్టకుండనే
క్రొత్త వచ్చేసిందని గంతులేస్తే
అలసిపోవడం జరుగుతుందే గాని
ఆనందించడం జరగదు
నీవు నీవుగా శోభించడమే క్రొత్త
ఇదే బ్రతుకులో క్రొత్తదనం
క్రొత్త సంవత్సరాలు
ఎన్నో * వచ్చాయి * పోయాయి * కాని
క్రొత్తదనం మనలో * రాలేదు * పాతదనం పోలేదు *
మనం మనంగా శోభించాలి
ఇదే క్రొత్తదనం
ఇది కొనేది కాదు - కనుగొనేది
మనల్ని ఎవరూ బంధించకుండా
మనం ఎవరికీ సంబధించకుండా
మనం మనంగా ఉండగలిగితే
వైభవాన్ని బయట కొనే ప్రయత్నాన్ని ఆపి
మనలో మనం కనుగొని ఆనందిస్తాం
అందుకే నిన్నటి కోసం బాధ పడకుండా
నిన్నటి కోసం ఆశ పడకుండా
నేటికోసం శ్రమ పడు
క్రొత్త దనం కోసం
ప్రయత్నమారంభించు
ఇది దైవ నిర్ణయ మని భావించు
Jai sri ram జై శ్రీరామ్
Jai sri hanuman జై శ్రీ హనుమాన్
om nama shivaya ఓం నమః శివాయ
- రాజు సానం ..... S,Raju ....