Online Puja Services

తెలుగు భాష గొప్పదనం

3.144.86.38

తెలుగు   

తెలుగు మాతృభాషగా గలిగినవారు, తెలుగు అభిమానులు, తెలుగును గురించి తెలుసుకోవాలని అనుకొనేవారికోసం తెలుగుకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన  విషయాలు.

1. క్రీస్తు పూర్వం 400 సంవత్సరాలు నుండి తెలుగు వాడుకలో ఉన్నది.

2. అంతర్జాతీయ అక్షర సంఘం 2012 లో తెలుగును ప్రపంచంలోని రెండవ ఉత్తమ అద్భుత లిపిగా ఎంపిక చేసింది. కొరియన్ భాష మొదటి స్థానంలో నిలిచింది.

3. తెలుగు భాషను మాట్లాడటం వలన మన శరీరంలోని 72000 నాడులు ఉద్దీపనం చెందుతాయని, ఇది అన్ని భాషాలకన్నా చాలా ఎక్కువ అని సైన్సు నిరూపించింది.

4. శ్రీలంక లోని శ్రీలంక జిప్సీ తెగవారు అందరూ తెలుగు మాట్లాడతారు.

5. మయన్మార్ లో అనేక చోట్ల తెలుగు వాడుకలో ఉన్నది. గూగుల్ లో అనేక వివరాలు పొందుపరిచారు.

6. 16వ శతాబ్దంలో నికోలో డి కొంటి అనే ఒక ఇటాలియన్ భాషావేత్త తెలుగు భాషలో పదాలు అచ్చులుతో అంతమవుతాయి, ఇటాలియన్ భాషలోలాగ, అందుచే తెలుగును తూర్పు ఇటాలియన్ భాషగా అభివర్ణించారు.

7. భారత్ లో 7.5 కోట్ల మంది మాట్లాడే తెలుగు 3వ స్థానంలో ఉన్నది. ప్రపంచంలో 15వ స్థానంలో అత్యధికంగా జనులు మాట్లాడే భాషగా ప్రసిద్ధిగాంచినది.

8. తెలుగు త్రిలింగ అనే పదం నుండి పుట్టింది. మూడు లింగముల ప్రదేశము. హిందూ సిద్ధాంత ప్రకారం- కోస్తాలోని భీమేశ్వరం, తెలంగాణలోని కాళేశ్వరం, రాయలసీమ లోని శ్రీశైలం లోని మూడు చోట్ల శివుడు లింగరూపంలో ఆవిర్భవించి ఉండటంతో త్రిలింగదేశం అని వచ్చింది. ఇక్కడి భాష  త్రిలింగ భాష తెలుగు అయింది.

9. తూర్పు ప్రపంచభాషలలో హ్రస్వాంత శబ్దంతో ప్రతీ పదం అంతమయ్యే భాష తెలుగు భాష ఒక్కటే.

10. తెలుగు భాషలో లెక్కలేనన్ని నుడికారములు, సామెతలు ఉన్నాయి.

11. తెలుగును పూర్వం తెనుంగు అని, తెలుంగు అనీ అనేవారు.

12. రవీంద్రనాథ్ ఠాగూర్ మాటల్లో, తెలుగు భారతీయ భాషలో కెల్లా మధురమైన భాష.

13. సుమారు 200 సంవత్సరాల క్రితం సుమారు 400 మంది తెలుగు వారు తోటపని వారుగా మార్షియస్ వెళ్లగా, ప్రస్తుత అక్కడి ప్రధాని ఆ సంతతి వారే అయ్యారు.

14.ఏ భాషలోనూ లేనివిధంగా తెలుగులో 40 శ్లోకాలు తో రామాయణం పలుకగా, అవే శ్లోకాలు వెనకనుండి చదివితే మహాభారతం అవుతుంది.

15. శ్రీకాకుళం లోని దేవాలయాన్ని శ్రీకృష్ణదేవరాయలు సందర్శించి స్వామిని సేవిస్తూ, అక్కడే ఆముక్తమాల్యద అనే సాహిత్య గ్రంధాన్ని అక్కడి ప్రభువు ఆంధ్ర విష్ణువు ఆదేశానుసారం రచించి, "దేశభాషలందు తెలుగు  లెస్స " అని ప్రవచించి అక్కడ తెలుగు ను అధికార భాషగా చేసి ఉత్తర్వులను ఇచ్చారు.

16. ఒకే అక్షరంతో వ్రాసే ఏకాక్షర పద్యములు తెలుగులోనే ఉన్నాయి. 

మహా ఋషులు కొనియాడిన భాష తెలుగు భాష.

తెలుగు వాడివి అయినందుకు ఆనందించు. ( గర్వం మంచిది కాదు ).

సర్వే జనాః సుఖినోభవంతు.

-సేకరణ 

Quote of the day

I slept and dreamt that life was joy. I awoke and saw that life was service. I acted and behold, service was joy.…

__________Rabindranath Tagore