Online Puja Services

కలకత్తా కె శ్రీవిద్య, సోదరుడు మోహన్ కణ్ణన్‌తో కలిసి రూపొందిచిన భజన

18.222.182.249

కలకత్తా కె శ్రీవిద్య, సోదరుడు మోహన్ కణ్ణన్‌తో కలిసి రూపొందిచిన భజన,

గోవింద నందనందన

- ఇది తాళ్లపాక అన్నమాచార్య సాహిత్యంతో హృదయాన్ని హత్తుకునే భక్తి భజన

హైదరాబాద్: - రక్షాబంధన్ సందర్భంగా ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసురాలు, కలకత్తా కె శ్రీవిద్య తన సోదరుడు, సంగీత స్వరకర్త & గాయకుడు మోహన్ కన్నన్ (అగ్నీ)తో కలిసి వారి తాజా  గోవింద నందనందన అనే భజనను అందించారు. శ్రీవిద్య పాడిన గోవింద నందనందనుడు భజన శ్రీకృష్ణుని ఆవాహన చేస్తుంది. ఇది గోపిక కన్నుల ద్వారా భగవంతుని గురించి మాట్లాడుతుంది మరియు శ్రీకృష్ణుడు బాల్యం మరియు యవ్వనంలో ఎలా ఉండేవాడో ఒక ఉల్లాసభరితమైన భజన ద్వారా తెలుపుతుంది. శ్రీవిద్య తాళ్లపాక అన్నమాచార్య సాహిత్యం ద్వారా గోవింద నందనందనతో మొదటిసారిగా తన స్వరకర్త భూమికను నిర్వహించింది.

కలకత్తా కె శ్రీవిద్యగా పిలువబడే శ్రీవిద్య అత్యంత ప్రశంసలు పొందిన కర్ణాటక సంగీత విద్వాంసురాలు, గాత్రం మరియు వయోలిన్ రెండింటిలోనూ ఈమె  నిష్ణాతులు. ఆమె తన తల్లి మరియు గురువు శ్రీమతి వసంత కన్నన్ నుండి సంగీతం నేర్చుకుంది. వసంత కన్నన్, ప్రపంచ ప్రఖ్యాత కర్నాటక వయోలిన్ విద్వాంసురాలు.

ఈ భజన శ్రావ్యతతో, శాస్త్రీయంగా ఉండటమే కాక నూతన తరం శబ్దాలను కూడా  అడ్డంకులు లేని పద్ధతిలో మిళితం చేస్తుంది. శ్రీవిద్య కంపోజిషన్‌ చేస్తూ, గాత్రంలో ప్రధాన భాగాన్ని అందించగా, ఆమె సోదరుడు మోహన్ ఒక స్వరం పాడారు, ఇది పాటపై సాంప్రదాయేతర సంగీత విభాగాన్ని అందించింది. ఇందులో తబలా ప్రధాన భూమిక పోషించింది.  

కోల్‌కతాలోని శ్రీ గురువాయూరప్పన్ ఆలయంలో ఇది శ్రీవిద్య శ్రీకృష్ణునికి పాడే నిర్మలమైన దృశ్యాలతో ఆత్మను హత్తుకునే భక్తి గీతం. ఈ మ్యూజిక్ వీడియో సహజమైన శ్రీ గురువాయూరప్పన్ ఆలయం యొక్క అందాన్ని ప్రదర్శిస్తుంది.

సంగీత స్వరకర్త మరియు గాయకురాలు శ్రీవిద్య గోవింద నందనందన భజనకు కు జీవం పోయడం గురించి మాట్లాడుతూ, “ఇది భజనలో చాలా సరదాగా ఉంటుంది మరియు ఇది చాలా ప్రత్యేకమైనది. గోవింద నందనందన భజన అనేది నాకు కేవలం పాట మాత్రమే కాదు, దానిని కంపోజ్ చేయడం, పాడడం, షూటింగ్ చేయడం నా ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ముందుకు తీసుకెళ్లడంలో నాకు సహాయపడింది మరియు ఈ పాట కోసం నాతో పనిచేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు".

వీడియో మరియు పాట గురించి శ్రీవిద్య సోదరుడు మోహన్ కన్నన్ మాట్లాడుతూ, “కోల్‌కతాలోని ఈ ఆలయం కేవలం ఒకే గదిగా ఉన్నపటి నుండి, మా కుటుంబం మొత్తం దానితో అనుబంధం కలిగి ఉంది. శ్రీవిద్య ఎల్లప్పుడూ ఈ ఆలయం మరియు శ్రీకృష్ణుని పట్ల ప్రత్యేక ప్రేమను మరియు గౌరవాన్ని కలిగి ఉంది మరియు ఆమె చెన్నై నుండి కోల్‌కతాను సందర్శించిన ప్రతిసారీ, ఎంత తక్కువ సమయం గడిపినప్పటికీ, శ్రీకృష్ణుని ఆశీర్వాదాన్ని పొందడం ఆమెకు తప్పనిసరి. ఇది జరగడానికి తన వంతుగా కృషి చేసిన శ్రీ వెంకట్రమణన్ మహదేవన్‌కు మనం కృతజ్ఞతలు చెప్పాలి. ఆడియో ముందు, ఆదిత్య పుష్కర్ణ భజన యొక్క సారాంశాన్ని లేదా కూర్పు యొక్క శాస్త్రీయ స్వభావాన్ని వదలకుండా ఆధునిక శబ్దాలను అందంగా మిళితం చేయడంలో ఖచ్చితంగా అద్భుతమైన పనిని చేసారు.

7 సంవత్సరాల వయస్సు నుండి, మోహన్ మరియు శ్రీవిద్య భారతదేశం అంతటా అనేక కర్నాటిక్ క్లాసికల్ కచేరీలలో ప్రదర్శించారు, శ్రీవిద్య పాడటం లేదా వయోలిన్ వాయించడం మరియు మోహన్ మృదంగం వాయించడం చేస్తుంటాడు. వారి మొదటి వాణిజ్య స్టూడియో సహకారం 2011లో జాతీయ అవార్డు గెలుచుకున్న మరాఠీ చిత్రం “శాల” కోసం సదా అనే పాటను కంపోజ్ చేసి పాడింది. సదా 2012లో వీడియో మ్యూజిక్ అవార్డును కూడా గెలుచుకున్నారు. వారు తమ తల్లి వసంత కణ్ణన్ కద్యుత గంటి రాగంలో స్వరపరిచిన థిల్లానాకు కూడా సహకరించారు.

Quote of the day

The weak can never forgive. Forgiveness is the attribute of the strong.…

__________Mahatma Gandhi