Online Puja Services

నారాయణీయం పారాయణ

3.142.171.100

భౌతికమైన, మానసికమైన రోగాలనుండీ విముక్తిని ప్రసాదించే నారాయణీయం పారాయణ
లక్ష్మీ రమణ  

గురువాయూరప్పని  కేరళలో మనం వెంకన్నని దర్శించుకున్నట్టు దర్శించుకుంటారు . గురువు అయిన బృహస్పతి , వాయుదేవుడు ఇక్కడ తండ్రి (అప్ప) స్వరూపుడైన స్వామిని ప్రతిష్ఠ చేశారు కనుక ఈయన్ని గురువాయూరప్ప (గురు+వాయూర్ +అప్ప ) అంటారట . అది సరే, ఈయన్ని ఆశ్రయించిన వారికి సుదీర్ఘమైన వ్యాధులన్నీ కూడా తొలగిపోతాయి . అలాంటి గాధలు జనమేజయుని నుండీ, మేల్పత్తూర్ నారాయణ భట్టతిరి వరకూ ఎన్నో ఉన్నాయి . కధలెన్నున్నా నారాయణీయం లోని కమనీయతే వేరు ! అది ఆ గురువాయూరప్ప స్వయంగా అనుగ్రహించిన దృశ్య కావ్యం కదా మరి !
  

తత్తేప్రత్యగ్రధారాధర లలితకళాయావలీ కేళికారo
లావణ్యసైకసారo సుకృతిజనదృశాo పూర్ణపుణ్యావతారమ్! 
 లక్ష్మీ నిశ్శంక లీలానిలయ నమమృతస్యందసందోహమంత: 
సించత్సంచింతకానాo వపురనకులయేమారుతాగారనాథ !!6!! 

అని నారాయణీయం లోని ఒక శ్లోకం . దాని తాత్పర్యాన్ని చూడండి . 

గురువాయుపురనాథా! నీ రూపం నవవర్షభరితమేఘాలను, సుందరమైన నీలికలువల గుచ్ఛాలను ధిక్కరిస్తున్నది. సౌందర్యానికి ప్రతిరూపమైన నీ లావణ్యం సుకృత జనులకు వారి పుణ్యకర్మల మూర్తీభవరూపములాగా గోచరిస్తుంది. లక్ష్మీదేవి ఆనందంగా నిస్సంకోచంగా విహరించే నిలయం . హృదయాంతరాళంలో నిన్ను నిలుపుకున్న భక్తులకు ఆనందామృత ప్రవాహ స్తోత్రం. అటువంటి నీ రూపాన్ని నిరంతరం  ధ్యానించెదను. 

ఈ నారాయాయనీయం అనే రచన వాల్మీకి మహర్షికి రాసిన భాగవతానికి సంక్షిప్తమైన రచన. భాగవతంలోని ప్రధానమైన ఘట్టాలని తిరిగి సంస్కృతభాషలోనే సంక్షిప్తంగా , మధురాతి మధురంగా రచించడం మేల్పత్తూర్ నారాయణ భట్టతిరికె చెల్లింది. ఇప్పటికీ ఈ గ్రంధాన్ని ఆ గురువాయూరప్ప సన్నిధిలో పారాయణ చేస్తారు. అలా చేయడం వలన ఆ గురువాయూర్ అనుగ్రహం సిద్ధిస్తుందని, ఎంతటి భౌతిక రోగాలైనా మానసిక రోగాలైనా ఈ పారాయణ ఇట్టే కరిగించేస్తుంది అన్న నమ్మకం మలయాళ, తమిళ వారిలోనే కాకుండా తెలుగు వారిలో కూడా ఎప్పటినుంచో ఉంది . 

గురువాయూరు దేవస్థానంలో ప్రతి ఏటా నారాయణీయం జయంతి నాడు నారాయణీయ సప్తాహం చేసే ఆచారం కొనసాగుతోంది. సౌందర్యరాశి గురువాయురప్ప దివ్య సన్నిధిలో ఆలకించడం అనిర్వచనీయమైన అనుభవమే . శ్రీమన్నారాయణుని కథ కనుక, వ్రాసినది నారాయణ భట్టతిరి కనుక ఈ గ్రంథమునకు  నారాయణీయం అన్న నామము రెండు విధములా సార్థకమయింది.  వెయ్యి అంకెను కలిగి ఉండడం లోని విశిష్టత విషయంలో విష్ణుసహస్రనామ స్తోత్రంతో పోలిక యాధృచ్చికమే కావచ్చు. అంతేకాక సంస్కృత గ్రంథాలలో అంతటి విశిష్టస్థానాన్ని అందుకుంది. విషయ విశిష్టతతో బాటు అద్భుతమైన రచనా శైలి దీని ప్రత్యేకత. ఈ గ్రంధాన్ని గురించి భక్తుల్లో ఉన్న అనన్య విశ్వాసానికి  వెనుక స్వయంగా ఆ నారాయణ భట్టతిరి వారి ఉదంతం ఉంది మరి. ఆ కథనే మనం ఇప్పుడు చెప్పుకుందాం . 

 మేల్పత్తూర్ నారాయణ భట్టతిరి వారు నంబూద్రి వంశ బ్రాహ్మణుడు. ఆయిన 1560 లో జన్మించారు.అనన్య సామాన్య అకుఠింతటదీక్షతో 16 సం లకే వేదవిద్యలు, ధర్మ శాస్త్రాలను ఆయిన గురువైన శ్రీ పిషరడీ గారివద్ద అభ్యసించారు. వీరు గురువు గారికి గురుదక్షణగా తనసంపూర్ణ అరోగ్యాన్ని సమర్పించి వారి దీర్ఘకాల వ్యాధీయిన వాత రొగాన్ని(క్షయవ్యాధిని)  తాను స్వీకరించారు. ఆ విధమైన బదిలీ చేయమని ఆ గురువాయూరప్పని వేడుకున్నారట. ఆయన కృపవల్ల అది సాధ్యమై,  గురువు గారికి ఉపశమనము లభించింది. భట్టతిరి గారికి గురువు యొక్క సంపూర్ణ అనుగ్రహము దక్కింది . 

 కాని, భట్టతిరి గారికి వాతరోగం భరించడం చాలా దుర్భరంగా మారింది. దుర్భరమైన పరిస్థితులనుండి గట్టెక్కించేవాడు ఆ రంగడే అని , ఆయన తప్ప వేరే మార్గమే లేదని తలచి గురువాయూరప్పని ఆశ్రయించారు . ఆయన్ని ప్రస్తుతిస్తూ భాగవత రచనా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ రచనల్లో భావనా పరమైన బాధలన్నీ కూడా ఆ కృష్ణస్వామే స్వయంగా వ్యక్తమై తీర్చేవారని చెబుతారు . 

 ఒక్కోసారి ఈ రచనలు చేస్తున్నప్పుడు,  భట్టతిరీ గారి ఎదురుగా కూర్చిని ఆ  కృష్ణుడు స్వయముగా వినేవారట . మధ్య మధ్యలో అంగీకార సూచికముగా తల, చేతుల  కదలికతో తన అంగీకారాన్ని తేలిపేవారట . అలాగే,  ఒకసారి  నరసింహావతారాన్ని వ్రాసే ముందు అవతార అవిర్భావమున్నీ, ఆ స్వామీ స్వరూపాన్ని ఎలా వర్ణించాలో అర్థంగాక, తికమక పడుతుంటే, ఎదురుగావున్న రాతి స్థంభము ఫెళ ఫెళా విరిగిపోతూ,  అందులో నుండీ మహాఉగ్రస్వరూపుడైన ఆ నారసింహుడు ఉద్యుక్తుడవుతూ దర్శనం ఇచ్చారని , అప్పుడాయన ఆ రూప వర్ణన చేశారని ఒక కథ .  అలాగే సీత హనుమకు చూడామణి అనుగ్రహించే ఘట్టములో ఒక పదము వ్రాస్తే,  భావపరిపూర్ణత రాక మధనపడుతుంటే సరి అయిన ప్రత్యామ్నాయాన్ని కృష్ణుడు చూపించాడని ఇలా నారాయణీయం రచనకి సంబంధించిన అనేక ఉదంతాలని కేరళీయులు కథలు కథలుగా చెబుతారు . అంతే  భక్తితో గురువాయూరప్పని కొలుచుకుంటారు .  

ఇలా నారాయణీయం రచన 100 రోజుల పాటు కొనసాగిందట . ఇందులోని ప్రతి అధ్యాయం చివరన భట్టతిరి గారు , నాకీ వ్యాధి నుండీ విముక్తిని ప్రసాదించమని వేడుకుంటూ ఉంటారు . ఇలా నారాయణీయము పూర్తి అయ్యే సమయానికి భట్టతీరి గారి ఆరొగ్యము కుదుట పడి సంపూర్ణారొగ్యం చేకూరినది.

ఆయిన చివరి శ్లొకముగా ఇలా వ్రాస్తారు.   "కృష్ణా! బుద్ధికి గాని, ఇంద్రియాలకు గాని కనిపించనది నీ అవ్యక్త రూపము. అది సామాన్యులకు ఉహకు కూడా అందదు. కనుక వారికి ఫలితము దుర్లభమే. కానీ ఈ గురువాయూర్ లో నీ ప్రత్యక్ష తేజ స్వరూపము అపూర్వము. అతి మనొహరము. ఈ శుద్ధ సత్వాన్ని అశ్రయించి పునః పునః ప్రమాణాలు అర్పణ చేస్తున్నాను నన్ను అనుగ్రహించు”  అని.  ఈ మాటలు ఆయన  పలుకగానే , ఉత్తర క్షణములో పరమాత్మ ఎట్టేదుట సాక్షాత్కరించారట.

  

Quote of the day

The weak can never forgive. Forgiveness is the attribute of the strong.…

__________Mahatma Gandhi