ఏ రాశి వారికి ఏ గ్రహము అధిపతిగా ఉంటారు ?

ఏ రాశి వారికి ఏ గ్రహము అధిపతిగా ఉంటారు ?
- లక్ష్మి రమణ
కాలము ఆధారంగా భూత భవిష్యత్ వర్తమాన కాలాన్ని గురించి చెప్పగలిగిన భారతీయ శాస్త్రం జ్యోతిష్యం. జ్యోతిష్యం నక్షత్రాలు , గ్రహాలూ, రాశులు వాటి గమనం ఆధారంగా లెక్కలు కడతారు . ఇందులో శాస్త్రీయత లేదు అనుకోవడం చాలా మూర్ఘత్వం . దీని శాస్త్రీయతని తెలుసుకోవడానికి , ఇప్పటి శ్రాత్రీయత అనుకునే శాస్త్రాలు మరింత ఎదగాల్సిన అవసరం ఉంటుంది అనడంలో సందేహం లేదు . కానీ దీన్ని వ్యాపారంగా మలుచుకున్నవారి చేతుల్లో, అధర్మాత్మునికి దొరికిన పెన్నిధిలా ఈ శాస్త్ర వైభవం పైన మచ్చలు ఏర్పడ్డాయి.
సకల జీవులు 27 నక్షత్ర కాలంలో జన్మిస్తారు . ఆ నక్షత్రాలు పన్నెండు రాశుల్లో విభజనమై ఉంటాయి. ఆ పన్నెండురాసులకీ మళ్ళీ నవగ్రహాలు అధిపతులుగా ఉంటాయి . జనన కాలం ఆధారంగా నక్షత్రాలు , వాటికి అనుగుణమైన రాశి ఆధారంగా వ్యక్తుల జాతకాలు, వాటిపైన గ్రహాల ప్రభావాలూ ఉంటాయి . అయితే సాధారణంగా నక్షత్రాలూ వాటికి సంబంధించిన రాశులు ఏమిటి అనేది చాలా మందికి అవగాహన ఉంటుంది. కానీ ఏఏరాశులకి , నవగ్రహాలలో ఎవరు అధిపతి అనేది తెలిసి ఉండదు . ఆ సమాచారాన్ని ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం .
12 - రాశులు
మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం.
9 - గ్రహాలు
రవి, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, శని, రాహువు.
కేతువు
వీటిల్లో ఏరాశికి ఏ గ్రహం అధిపతి అనేది చూద్దాం :
సింహస్యాధిపతి సూర్యః | కర్కటస్య నిశాకరః |
మేషవృశ్చికయోర్భౌమః | కన్యామిథునయోర్బుధః |
ధనుర్మీనద్వయోర్మంత్రీ | తులావృషభోయోర్భృగుః |
మకరస్యచ కుంభౌచ నాయక స్సూర్యనందనః ||
తాత్పర్యము:
సూర్యుడు సింహరాశికధిపతి | చంద్రుడు కర్కాటకరాశికధిపతి | కుజుడు మేష, వృశ్చిక రాశులకధిపతి | బుధుడు కన్యా, మిథున రాసులకధిపతి | గురువు ధనస్సు, మీన రాసులకధిపతి | శుక్రుడు తుల, వృషభ రాసులకధిపతి | శని మకర, కుంభ రాసులకధిపతి ||
జ్యోతిష్య శాస్త్ర పండితులు మరింత వివరంగా వివరిస్తారు . కానీ, మనకీ ఇప్పటికి ఈ సమాచారం సరిపోతుంది. దీనిని మీ జన్మ కుండలిని అనుసరించి వివరంగా తెలుసుకోవడానికి హితోక్తి వర్చువల్ పూజారి సర్వీసుని వినియోగించుకోవచ్చు .
శుభం .