Online Puja Services

పండగ మార్కెట్

3.17.12.229

#జైసింహ_ఉవాచ : 

"ఎంత?" అంటాం... "ఇంత!" అని వ్యాపారి చెబుతాడు...
"అంతైతే కుదరదు... ఇంతకివ్వు!" అని మళ్లీ మనమంటాం!
"అంత రేటుకి నాకే పడలేదు... మీకేలా ఇస్తాను?" అంటాడు వ్యాపారి!
చివరకు, ఎంతోకొంతకి బేరం తెగుద్ది... సీన్ కట్ చేస్తే...

మనకి ధనధాన్యాలు ఇస్తాడని భావించే దేవుడు...
అంతోఇంతో ధనం చెల్లించుకోగా, మనింటికి చేరుకుంటాడు!

మనం కొన్నది దేవుడ్ని కాదు... దేవుడి విగ్రహాన్ని మాత్రమే!
అది నాక్కూడా తెలుసు!

కానీ, హిందువుల ప్రతీ పండగలోనూ ప్రస్తుతం 'మార్కెట్' జొరబడిపోయింది!
సంక్రాంతి మొదలు దీపావళి దాకా అన్ని సంబరాలకి డబ్బులే మూలం!
డబ్బు లేకుంటే పండగ చేసుకోలేని దుస్థితి!
అసలు ఈ మొత్తం 'ఆర్భాటపు' హడావిడిలో 'భక్తి' ఏది? విశ్వాసం ఏది? 

మన మతం 'మార్కెట్'లో సరుకుగా మారిపోయింది!
హిందువుల పండగలొస్తే, జాతర్లొస్తే, పుష్కరాలొస్తే, కుంభమేళాలు వస్తే...
సర్కారు వారికి విచ్చలవిడిగా డబ్బులొస్తాయి!
హిందువుల పుణ్య క్షేత్రాల హుండీల వల్లే 'సెక్యులర్' పాలకులకి కాసులొస్తాయి!
అయినా... వందలు, వేల, లక్షల కోట్లు ఆదాయం తెచ్చి పెట్టే హిందువులంటేనే...
మైనార్టీల్ని మురిపిస్తూ మైమరిచిపోయే మహిషాసుర పాలకులకు ఎక్కడలేని కసి!

కారణం ఏంటి? 
తప్పంతా హిందువుల్లోనే ఉంది!

'వాళ్ల'కు ఆదివారం ప్రేయర్ అంటే ప్రాణం! 
'వీళ్ల'కు శుక్రవారం ప్రార్థనంటే విపరీత విశ్వాసం!
మరి మనకు?

పండగంటే 'సరదా'! దేవుడంటే 'కోరికలు తీర్చే యంత్రం'!
పూజలంటే 'ఆచారాలు, సంప్రదాయాలు, మూఢనమ్మకాల' గందరగోళం!

ఇంతే తప్ప... 'ఆ ఇద్దరిలా'....
మనం 'నమ్మిన దైవం' కోసం 'నిజాయితీ'గా తపనపడుతున్నామా?
'వాళ్లు' కరెక్ట్... 'మనం' తప్పు అని చెప్పటం 'నా' ఉద్దేశం కాదు...
కానీ, 'వాళ్ల' నుంచీ 'మనం' నేర్చుకోవాల్సింది 'కొంత' ఉంది!

ఇప్పటికైనా హిందువులు తమ పండగల్లోంచి 'మార్కెట్' ను తగ్గించాలి!
డబ్బులు వెదజల్లినంత మాత్రాన దైవానుగ్రహం కలగదు!
దేవుడి ముందు నైవేద్యాలు కొలువుదీర్చినంత మాత్రాన 'భవిష్యత్' మారిపోదు!

'వారు' రెండు వైపుల నుంచీ...
మనల్ని అంతం చేయటానికి ప్రయత్నిస్తున్నారని గ్రహించాలి!

దేవుడితో 'కోరికలు' తీర్చమని 'బేరాలాడటం' మానేసి...
సనాతన దైవంతో ధర్మం సాక్షిగా తీక్షణమైన అనుబంధం ఏర్పరుచుకోవాలి!

నాలుగు ఆకులు విగ్రహం మీద వేసేసి 'మమ' అనటం కాకుండా...
ధర్మ రక్షణ కోసం 'మేము కూడా' అనాలి!

ఊరికే 'నినాదాల' కోసం, 'వివాదాల' కోసం కాదు...
అనాది భరతభూమిని సనాతనంతో మరోసారి సమున్నతం చేయటానికి! 

#జై_బోలో_గణేశ్_మహారాజ్_కీ_జై

Quote of the day

There are only two mistakes one can make along the road to truth; not going all the way, and not starting.…

__________Gautam Buddha