పురోహితుడికిచ్చే దక్షిణ తాంబూలం
మన ఇంటి శుభం కోరే పౌరోహితుడు విషియంలో మనం ఎక్కడ ఉన్నామో తెలియజేసే కొన్న నిజాలు.
1. బియ్యం.
పౌరోహితుడుకి ఇచ్చేదే కదా అని తక్కువ రకం కొనడం.
2. చిల్లర నాణేలు.
మండపారాధన కోసం , పౌరోహితుడు తీసుకొనే చిల్లర కదా అని వెతికి వెతికి తీసుకొస్తాం.
3. ధోవతి, ఉత్తరీయం.
పౌరోహితుడు కోసం కొనే ధోవతి, ఉత్తరీయం అయితే చేతి రుమాలు కన్నా ఎక్కువ , కండువాకి తక్కువ కొంటాము. పైగా వాటికి షాపులో పెట్టుడు బట్టలు అని అడిగి కొంటాం.
4. స్వయంపాకం అంటే మరీ చిన్న చూపు.
కనీసం కుటుంబం నలుగురూ వండుకుని తినే సామాన్లు ఇవ్వట్లేదు.
5. దక్షిణ తాంబూలం.
మనకి ఉన్నంతలో ఎంత ఘనంగా ఇస్తే, అతని కుటుంభం అంత అనందంగా ఉంటుంది.
ఇది చూడండి.
మనం మన వృత్తిలో సంపాదించే సంపాదన కోసం మన భార్య, పిల్లలు, నిత్యావసరాల కోసం ఎలాగ ఎదురు చూస్తారో, మరి పౌరోహితుడు భార్య పిల్లలు కూడా అలాగే చూస్తారు కదా. అలాంటప్పుడు మనం ఇచ్చేదే అతను ఇంటికి తీసుకొని వెళ్తాడు కదా.
అందుకే మనం మారితే మన ఇంటి శుభం కోరుతూ, మనల్ని ఆశీర్వదించే
పౌరోహితుడు కుటుంభం కూడా బావుంటుంది.
చిన్న ఆలోచన, పెద్ద మార్పు.
సమస్త లోకా సుఖినోభవంతు.
- మాధవాచార్య