మోదీ కాదు (కర్మ) యోగి!
#జైసింహ_ఉవాచ :
మోదీ కాదు (కర్మ) యోగి!
ఒక పరీక్షిత్తు, ఒక విక్రమాదిత్యుడు, ఒక చంద్రగుప్తుడు, ఒక శాతవాహనుడు, ఒక పుష్యమిత్ర శుంగుడు, ఒక ఛత్రపతి శివాజీ, ఒక నరేంద్ర దామోదర్ దాస్ మోదీ!
.............................. .............................
మోదీ అనగానే అందరూ ఓ గుజరాతీ అనో, హిందూత్వవాది అనో, ఆరెస్సెస్ స్వయం సేవక్ అనో, రాజకీయ నాయకుడనో, ముఖ్యమంత్రనో, ప్రధాని అనో... ఇలా తమకు తోచింది భావిస్తుంటారు! ఆయనంటే పడని వారు ఇంకా బోలెడు విధాలుగా భ్రమించి భయపడుతుంటారు! కానీ, నిజంగా మోదీ ఎవరు?
మోదీ ఒక కర్మ యోగి! తన కోసం తాను సన్యాసిగా మారి పరివ్రాజకుడైపోదామనుకున్న అవధూత... ఇవాళ్ల మన కోసం... కర్మ యోగిగా మారి నిత్యం కష్టపడుతోన్న దైవం పంపిన దూత! ఆయన ఇళ్లు వదిలి వెళ్లిపోయాడు. భార్యని పట్టించుకోలేదు. ఇలాంటి మాటలే మీడియా వాగుతుంది కానీ... ఇంటి నుంచి బయలుదేరిన ఆ సత్యాన్వేషి తరువాత ఏం చేశాడు? ఇది తెలిసి కూడా చెప్పదు!
మీడియా చెప్పని మోదీ పరివ్రాజక జీవితం ఏంటంటే... ఇల్లు వదిలి బయలుదేరిన నరేంద్రుడు దేశమంతా తిరిగాడు. ఆరెస్సెస్ ప్రచారక్ గా కాదు. కేవలం ఒక సత్యాన్ని అన్వేషించే సనాతన ఆత్మ స్వరూపిగా! అలా తిరిగి తిరిగి ఆయన చివరకు మోక్షం కోరే అందరూ చేరే కేంద్రానికే చేరాడు! హిమాలయాలకు!
హిమాలయాల్లో అనేక పుణ్యక్షేత్రాలు దర్శించిన మోదీ మానస సరోవరం కూడా సందర్శించారు. మౌంట్ ఎవరెస్ట్ పర్వతం అధిరోహించి ( పర్వత శిఖరాగ్రం అధిరోహించలేదు. ) తిరిగొచ్చారు. స్వరాష్ట్రంలోని రాజ్ కోట్ కు వచ్చాక రామకృష్ణ మఠం చేరుకుని అక్కడి స్వామీజీ... ఆత్మస్థానందజీ మహారాజ్ ను ఆశ్రయించారు. తనకు సన్యాస దీక్ష ప్రసాదించమని అభ్యర్థిచారు. కానీ, అక్కడే విచిత్రం జరిగింది! రామకృష్ణ మఠం స్వామీజీ నరేంద్రుడికి సన్యాసం ఇవ్వలేదు! ఆయన తన స్వంత మోక్షం కోసం కాక జాతి విముక్తి కోసం కృషి చేయాల్సి వుందని నచ్చజెప్పి తిరిగి పంపారు! ఆ రోజు నుంచీ మోదీ యోగికి బదులు కర్మ యోగి అయ్యారు! సన్యాసి కాని సన్యాసి అయ్యారు!
ఇల్లు వదలటం, హిమాలయ యాత్ర, స్వామీజీని ఆశ్రయించటం... వీటి తరువాత అప్పుడు మొదలైంది ఆరెస్సెస్ స్వయం సేవక్ శకం! ఆరెస్సెస్ ఆఫీసులో గది శుభ్రం చేయటం, టీ పెట్టడం లాంటి చిరు పనులతో మొదలైన మోదీ జీవితం ప్రచారక్ గా ఉజ్వలమైంది! ఆయన మీద ఎన్నో బాధ్యతలు పెట్టిన సంఘ్ ని ఆయన ఏనాడూ నిరాశపరచలేదు! అడుగడుగునా తన సత్తాతో ఆశ్చర్యపరిచారు! అందుకే, ఆరెస్సెస్ మోదీ అనే తమ అణ్వయుధాన్ని బీజేపికి బహూకరించింది. పార్టీ కార్యకలాపాల్లో తలమునకలైన మోదీ ఏమేం చేశారో అంతా బహిరంగమే! ఇవాళ్ల గుజరాత్ బీజేపీ సర్వ విధాలా అజేయంగా వుండటానికి ఆయన పాత్ర కూడా కీలకం! అందుకే, గుజరాత్ సీఎం పీఠం ఆయనను అనివార్యంగా వరించేసింది!
మోదీ... ముఖ్యమంత్రి నుంచీ ప్రధాని ఎలా అయ్యాడో... ఇంకా చాలా మందికి తెలిసిన ప్రస్థానం! అసలు ఒక్క రోజు, ఒక్క గంట కూడా ప్రతిపక్షంలో వుండకుండా రాష్ట్రాన్ని, దేశాన్ని ఏలటం... కేవలం రాజకీయ చాతుర్యమేనా? కానేకాదు... మోదీ వెనుక ఆధ్యాత్మిక శక్తే... ఆయనను , మిగతా మరుగుజ్జు స్వార్థ రాజకీయ నేతల్ని వేరు చేసేది!
ఒక పరీక్షిత్తు, ఒక విక్రమాదిత్యుడు, ఒక చంద్రగుప్తుడు, ఒక శాతవాహనుడు, ఒక పుష్యమిత్ర శుంగుడు, ఒక ఛత్రపతి శివాజీ, ఒక నరేంద్ర దామోదర్ దాస్ మోదీ! -
- Jai Simha Uvaacha