Online Puja Services

మిషన్ మంగళ్” చూడాలా వద్దా?

18.222.113.135
“మిషన్ మంగళ్” చూడాలా వద్దా అనేది ఈ వ్యాసం చదివాక నిర్ణయించుకోండి
 
మిషన్ మంగళ్” సినిమాకి సంబంధించి ఎవ్వరూ మాట్లాడటానికి ఇష్టపడని కొన్ని అతి ముఖ్యమైన విషయాలు
 
అంగారక గ్రహానికి మొదటి ప్రయత్నంలోనే చేరుకున్న మొదటి దేశం భారతదేశం. అది కూడా అతి తక్కువ ఖర్చుతో మన ఇస్రో శాస్త్రవేత్తలు చెయ్యగలగడం మరింత గొప్ప విషయం. మన దేశం సాధించిన ఈ అద్భుతానికి సినీ రూపమే మిషన్ మంగళ్ సినిమా. చాలా మంది ఇప్పటికే ఈ సినిమాని విమర్శించారు కానీ, అసలు విషయాన్ని అందరూ వదిలేశారు అనిపించింది. నేను ఇప్పుడు ఆ పని చెయ్యబోతున్నాను. 
 
ఈ సినిమాలో 7 ముఖ్య పాత్రలు మరికొన్ని చిన్న పాత్రలు ఉన్నాయి. ఈ పాత్రల స్వభావాలు తెలుసుకుంటే మనకి ఈ సినిమా మీద పూర్తి అవగాహన వస్తుంది. 
 
1. రాకేశ్ ధావన్ (అక్షయ్ కుమార్)ప్రధాన శాస్త్రవేత్త. ఇతని ఆద్వార్యంలోనే మిగిలిన శాస్త్రవేత్తలు పని చేస్తారు. ఇతను మేధావి, దేశభక్తుడు, నాస్తికుడు. పూజలు చేసే, జాతకాలని నమ్మే ‘మూర్ఖులను’ చూసి రెండు మూడు సార్లు జాలిపడతాడు. “మేధావులు దేవుడిని నమ్మరు” అనే సిద్ధాంతాన్ని సినిమాలు ఎప్పటినుండో ప్రచారం చేస్తున్నాయి. ఇది కూడా అలాంటిదే. అయితే నిజమైన శాస్త్రవేత్తలు మాత్రం, తిరుమలలో వెంకటేశ్వరుడిని దర్శించుకోకుండా, మంచి ముహూర్తం చూడకుండా రాకెట్ ని ప్రాయోగించరు. అటు దేవుడి గురించి కానీ, ఇటు శాస్త్ర, సాంకేతిక అంశాల మీద కానీ ఎటువంటి అవగాహనా లేని మూర్ఖులే ఈ పిచ్చి వాగుడు వాగుతుంటారు. 
 
2. తారా షిండే (విద్యా బాలన్)ఇంట్లో అన్ని గదులలో ఉన్న దేవుడి చిత్ర పటాలకు హారతి ఇస్తూ, ఇట్లో వారికి కావాల్సినవి సమకూరుస్తూ ఆవిడ మనకి మొదట కనబడతారు. మేధస్సు, అంకిత బావంతో పాటు, కించిత్ అమాయకత్వం, భోళా తనం కూడా ఈవిడ పాత్రలో మనకి కనిపిస్తాయి. అక్షయ్ కుమార్ తరువాత ప్రధాన పాత్ర ఈవిడడే. చాలా మేధావి. ఒక విధంగా చూస్తే అక్షయ్ కుమార్ కన్నా విద్యాబాలన్ పాత్రే ప్రధానమైనది. ఇది వృత్తి రిత్యా ఆవిడ పాత్ర. అద్భుతమైన పాత్ర, అందులో సందేహం లేదు
 
ఈవిడ కుటుంబాన్ని కూడా మనం కొంత విశ్లేషించాలి. కుటుంబంలో మొత్తం ఐదుగురు ఉంటారు. విద్యాబాలన్, ఆవిడ భర్త, కూతురు, కొడుకు, మావ గారు. కూతురు చదువుకునే యుక్తవయస్సులో ఉన్న అమ్మాయి. ఇంటికి రాత్రిళ్ళు ఆలస్యంగా వస్తూ ఉంటుంది. కొడుకు AR. రెహ్మాన్ లా గొప్ప సంగీత కళాకారుడు కావాలి అని ప్రయత్నిస్తుంటాడు. కురాన్ చదువుతుంటాడు, నమాజ్ చేస్తుంటాడు, గడ్డం మాత్రమె పెంచుతుంటాడు. ఇక విద్యాబాలన్ గారి భర్త, కుటుంబలో అందరికంటే పనికిమాలిన వ్యక్తి. ఈ మూర్ఖుడు వయసులో ఉన్న ఆడపిల్లని చీకటి పడకుండా ఇంటికి రమ్మంటాడు, ఎప్పుడైనా అర్ధరాత్రి వరకూ కూతురు ఇంటికి రాకపోతే కంగారు పడతాడు, కోపం కూడా తెచ్చుకుంటాడు, కొడుకు కురాన్ చదువుతుంటే తప్పు అంటాడు, భార్యని ఇంటికి సంబంధించిన వ్యవహారాలు కూడా పట్టించుకోమంటాడు. 
 
ఒకరోజు విద్యాబాలన్ గారు తన కార్యాలయం నుండి ఆలస్యంగా ఇంటికి వస్తారు. భర్త చాలా కోపంగా ఉంటాడు. కారణం, అర్ధరాత్రి అయినా కూతురు ఇంటికి రాకపోవడం, తానూ ఎన్ని సార్లు ఫోన్ చేసినా సమాధానం ఇవ్వకపోవడం. విద్యాబాలన్ గారు వెంటనే కూతురి స్నేహితురాలికి ఫోన్ చేసి ఎదో మాట్లాడుతుంది. వెంటనే ఇద్దరూ కలిసి ఒక పబ్ కి వెళ్తారు. అక్కడ కూతురు గారు స్నేహితులతో డాన్స్ చేస్తూ ఉంటారు. అప్పుడు విద్యాబాలన్ గారు ఒక గ్లాస్ మద్యం తీసుకుని, భర్తకి మరో గ్లాస్ ఇస్తుంది. కొంత సేపటి తరువాత, కూతురి స్నేహితులు, కూతురికి తాగడానికి మద్యం ఇస్తారు. ఆ అమ్మాయి వద్దు అంటుంది. అయితే తల్లి, తండ్రులను చూసి వద్దంటుందా లేక తనకి అలవాటు లేదా అనేది నాకు స్పష్టంగా అర్ధం కాలేదు. అది చూసిన విద్యాబాలన్ గారు అక్కడికి వెళ్లి, తాను తాగడమే కాక, ఎందుకూ పనికిరాని వెధవ అయిన తన భర్తతో కూడా తాగిస్తుంది. ఈ సినిమా ప్రకారం, ఈ మొత్తం విషయంలో తప్పు ఎవరిదో తెలుసా? భర్తది. కారణం? ఆయన తనదగ్గర కూతురి స్నేహితురాళ్ళ ఫోన్ నెంబర్ తనదగ్గర పెట్టుకోకపోవడం. 
 
కొడుకు విషయంలో కూడా తండ్రి అనే ఈ వెర్రి వాడు ఇలా ప్రవర్తిస్తాడు. కురాన్ చదువుతుంటే వద్దంటాడు, నమాజ్ చేస్తే వద్దంటాడు. అయినా కొడుకేమైనా వింటాడా పాడా, ఎదో వీడు అలా పిచ్చి వాగుడు వాగుతుంటాడు. కొడుకే కాదు ఇంట్లో ఎవ్వరూ ఈ పిచ్చి వాడి మాటలు పట్టించుకోరు, గౌరవం కూడా ఉండదు. పిల్లలు నచ్చింది చెయ్యడాన్ని ఆయన అడ్డుకోడానికి ప్రయత్నించడమే ఆయన నేరం అని విద్యాబాలన్ గారు ఒక సందర్భంలో చెప్తారు. 
 
విశ్లేషణ: స్వయంకృషి అని చిరజీవి గారి సినిమా ఒకటి ఉంది. ఆ సినిమాలో కొన్ని పరిస్థితుల వలన వేరే వ్యక్తి కొడుకు చిరజీవి గారి వద్ద పెరుగుతాడు. తండ్రి దుర్మార్గుడు, జైల్లో ఉంటాడు. తన దగ్గర పెరుగుతున్న పిల్లవాడిని ఆయన సొంత కొడుకులానే చూసుకుంటారు, చాలా క్రమశిక్షణగా పెంచుతారు. కొంత కాలానికి ఆ పిల్లవాడి తండ్రి జైలు నుండి బయటకి వచ్చి, ఆ పిల్లవాడితో పరిచయం పెంచుకుని, తానె వాడి తండ్రిని అని చెప్పి, వాడికి రోజూ చాక్లెట్లు, బిస్కట్లు, ఐస్ క్రీంలు తినిపిస్తూ సినిమాలు చూపిస్తూ ఉంటాడు. పిల్లవాడికి సహజంగానే తన తండ్రి మీద ఇష్టం పెరుగుతుంది. చివరికి పిల్లవాడు అసలు విషయం తెలుసుకుంటాడనుకోండి, అది వేరే విషయం. 
 
ఆయితే ఇది చిన్న పిల్లల విషయంలో మాత్రమె కాదు, యుక్త వయస్సులో ఉన్న వారికి కూడా వర్తిస్తుంది. చిన్న పిల్లలు చాక్లెట్లు, తినడం కంటే యుక్త వయస్సులో ఉన్న వారు మాదక ద్రవ్యాలకి, మద్యానికి, సిగరెట్లకి అలవాటు పడటం, ఎవరితో పడితే వారితో సంబంధాలు పెట్టుకోవడం మరింత ప్రమాదకరం. ప్రపంచ వ్యాప్తంగా కొన్ని కోట్ల మంది ఈ దుర్వ్యసనాల వలన నాశనం అయిపోతున్నారు. ఈ అలవాట్లు సాధారణంగా యుక్తవయస్సులోనే అలవాటవుతాయి. నాకు తెలిసి 25సం. ల వరకూ చెడు అలవాట్లు లేని వ్యక్తికి తరువాత అవి అలవాటు అవ్వడానికి అవకాశాలు చాలా తక్కువ. పిల్లలు ఆ వయస్సులో చెడు అలవాట్ల వైపు వెళ్ళకుండా ఆపేది ముఖ్యంగా తండ్రి, అలానే అధ్యాపకులు (టీచర్లు), బలమైన సమాజం/కుటుంబం. 
 
అందుకే సినిమాలు వీటన్నిటి మీదా దాడి చేస్తున్నాయి. తండ్రి పాత్ర ఎంత బలహీనం అయితే, పిల్లలకు తండ్రి పట్ల భయం అంత తగ్గుతుంది, చెడు అలవాట్లు అవ్వడానికి అంత అవకాశం కూడా అంత పెరుగుతుంది. అలానే టీచర్లు, పెద్ద వాళ్ళు. అందుకే సినిమాల ద్వారా తండ్రి మీద, గురువుల మీద, పెద్ద వాళ్ళ మీద గౌరవం తగ్గించే ప్రయత్నం జరుగుతోంది. ఈ సినిమానే తీసుకుంటే వయసులో ఉన్న కూతురుని త్వరగా ఇంటికి రమ్మనే తండ్రేమో వెధవ, కూతురుతో పాటు తాగే తల్లేమో మహానుభావురాలు. స్వయంకృషి ఉదాహరణలో పిల్లవాడికి చాక్లెట్లు తినిపించే తండ్రి నచ్చినట్లే, మిషన్ మంగళ్ లో పిల్లలకి విద్యాబాలన్ నచ్చుతుంది. అయితే స్వయంకృషిలో పిల్లవాడి తండ్రిని చెడ్డవాడిగా చూపితే ఇక్కడ మాత్రం అందుకు వ్యతిరేకంగా అదే లాంటి పాత్ర పోషించిన విద్యాబాలన్ ని గొప్ప దానిగా చూపించారు. ఆ పని కూడా, దేశం యావత్తూ గరించదగిన ఒక్క గొప్ప శాస్త్రవేత్త పాత్ర ద్వారా చేయించడం వలన దాని ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది. అదే సినిమా దర్శకుల గొప్ప తనం. ఎంత నీచమైన విషయాన్నైనా గొప్పగా చూపించగలరు, ఎంత గొప్ప విషయాన్నైనా నీచంగానూ చూపించగలరు. 
 
మద్యం అలవాటు వలన చాలా నష్టాలు ఉన్నాయి. ఆరోగ్యం పాడవ్వడం, ఆర్ధికంగా చితికిపోవడం, కుటుంబాలు నాశనం అవ్వడం వంటివి అందరికీ తెలిసినవే. వీటన్నిటికన్నా ముఖ్యంమైన నష్టం జాతి నిర్వీర్యం అవ్వడం. తాగుడు అలవాటు వలన ఎందఱో యువకులు ఎందుకూ పనికిరాకుండా పోతారు. అది దేశానికి నష్టం. కాబట్టి ఒక కుటుంబం సరిగ్గా ఉండాలి అంటే తల్లి, తండ్రి, తాత, నాయనమ్మ/అమ్మమ్మ అందరూ ఎవరి పాత్రలని వారు పోషించాలి. కానీ ఎవరి నిర్ణయాలు వారే తీసుకునే స్వేచాయుత వాతావరణంలో అది అసాధ్యం. 18 ఏళ్ళ పిల్లకి/పిల్లవాడికి అర్ధరాత్రి దాకా తాగి తిరగద్దు అంటే సహజంగానే కోపం వస్తుంది. 3వ తరగతి పిల్లవాడిని చాక్లెట్ తినద్దు అంటే మాత్రం రాదు? అయితే ఈ సినిమాల వలన అదే సరైనది అని ఒక కుతర్కం సమాజంలో వ్యాపిస్తుంది. అది చాలా ప్రమాదకరం. ఒక వయసు వచ్చిన తరువాత వాళ్ళు ఏమి చెయ్యాలి అనే పూర్తి స్వేచ్చ వ్యక్తులకు ఇచ్చెయ్యాలి అనేది మీ వాదన అయితే, అది కేవలం మద్యానికే ఎందుకు పరిమితం చెయ్యాలి? మాదక ద్రవ్యాలని కూడా చట్టబద్దం చేసి ఇదే మాట చెప్పచ్చు కద? చూస్తూ ఉండండి, కొంత కాలానికి ఆరోజులు కూడా వస్తాయి. ఈ సినిమాలోని విద్యాబాలన్ వంటి పాత్రాల వలన ఇద్దరికీ లాభం. ఒకటి మద్యం అమ్మే వ్యాపార సంస్థలు. రెండు మన దేశ శత్రువులకు. మన దేశంలో ఎంత మంది తాగుడుకు బానిసలు అయితే మన శత్రు దేశాలకి అంత మంచిది. 
 
3. ఏక్తా గాంధీ (Sonakshi Sinha): ఈవిడ గారు మొదట కనబడటమే, ఎవడితోనో పక్కలోనుండి లేస్తూ కనబడుతుంది. లేస్తూనే సిగరెట్ వెలిగిస్తుంది. ఆ తరువాత వాడు లేచి ఈవిడని 5000 అడుగుతాడు. “ఏంటీ ప్రతీసారి డబ్బులు, ఇదేమైనా నీ ఫీజా” అని సోనాక్షి అడుగుతుంది. అంత గొప్ప బంధం వాళ్ళది. మందు ఎలానూ బాగా అలవాటు చేసేశారు, ఇప్పుడు ఇక సిగరెట్ల మీద పడ్డట్లున్నారు. త్వరలోనే మన తెలుగు సినిమాలలో హీరోయిన్లు కూడా సిగరెట్లు తాగడం మొదలెడతారు చూస్తూ ఉండండి
 
విశ్లేషణ: ఒక గొప్ప శాస్త్రవేత్త అయిన వ్యక్తి పాత్రని ఎవడితో పడితే వాడితో పడుకోవడం, సిగేరెట్లు తాగడం, మందు తాగడం వంటివి చేస్తున్నట్లు చూపించడం వలన యువత మీద చాలా ప్రభావం ఉంటుంది. పైగా వీళ్ళు సిగరెట్లు తాగే పద్ధతి కానీ, మందు తాగే పద్ధతి కానీ చాలా అందంగా, స్టైల్ గా ఉంటుంది. అవి స్టైల్ గా అనిపించడం వల్లనే ఎక్కువ మంది వాటిని మొదలెడతారు. కొంతకాలం తరువాత వాటికి బానిస అవుతారు, అది వేరే సంగతి. ఈ పాత్ర లక్ష్యం కుటుంబాలని నాశనం చెయ్యడం, మద్యపానాన్ని, సిగరెట్లు తాగడాన్ని ప్రోత్సహించడం.  
 
4. కృతిక అగర్వాల్ (తాప్సీ): సినిమాలో అందరికన్నా ఉత్తమమైన పాత్ర ఈమెదే. భర్త సైన్యంలో ఉంటాడు. గాయపడి వస్తే ఉద్యోగాన్ని కూడా పక్కనబెట్టి అతనికి సేవలు చేస్తూ ఉంటుంది. నువ్వు చేసే ఉద్యోగం దేశ ఉన్నతికి సంబంధించినది అని భర్త నచ్చజేప్తే తిరిగి తన విధులలో చేరుతుంది
 
5. కీర్తి కుల్హరి (నేహా సిద్దికి): ఈవిడ ఒక ముస్లిం. కేవలం ఈ కారణం వలన ఈవిడకి ఇల్లెక్కడా దొరకదు. నిజానికి మిషన్ మంగళ్ లో ముస్లిం శాస్త్రవేత్తలు ఎవరూ లేకపోయినా ఒక ముస్లిం పాత్రని పెట్టడం నాకైతే అభ్యంతరకరం కాదు. అయితే ఆవిడకి ఎవరూ ఇల్లు ఇవ్వట్లేదు అని చూపించడం దురుద్దేశ పూరితమే. మన దేశంలో ఉండే ముస్లింలలో అభాద్రతాభావాన్ని పెంచడం ఈ పాత్ర లక్ష్యం
 
6. నిత్యా మీనన్ (వర్ష పిళ్ళై): ఈవిడకి ఏ కారణం వల్లనో పిల్లలు అప్పటికి పుట్టరు. ఈవిడ పాత్రని పరిచయం చెయ్యడమే, అత్తగారు ఈవిడని పిల్లలు పుట్టని కారణంగా దేప్పుతున్నట్లు చూపించారు. భర్తకి కూడా ఈ కారణం వల్లనే తల్లి అంటే ఒక విధమైన అసహ్యం. తరువాత నిత్యా మీనాన్ గర్భవతి అయినా, తన తల్లికి ఆ విషయం చెప్పను అంటాడు భర్త. 
 
ఫెమినిస్టుల ముఖ్య లక్ష్యాలలో ఒకటి అత్తగారిని దుర్మార్గురాలిగా సమాజంలో ముద్ర వెయ్యడం. ఇది చాలా సం. లుగా సాగుతోంది. సినిమాలది ఇందులో కీలకపాత్ర. అత్తగారు కూడా స్త్రీనే కదా అనవచ్చు. ఫెమినిస్టుల లక్ష్యం యుక్త వయస్సులో ఉన్న అమ్మాయిలు. వాళ్లనైతేనే త్వరగా ప్రభావితం చెయ్యవచ్చు. పెద్దవాళ్ళని ప్రభావితం చెయ్యడం అంత సులభం కాదు. నిత్యా మీనన్ పాత్ర లక్ష్యం ఇదే. 
 
7. పరమేశ్వర్ నాయుడు (షర్మాన్ జోషి): సినిమాలో ఇతనో కామెడీ పీస్. రోజూ గుడికి వెళ్తుంటాడు, పూజలు చేస్తుంటాడు, జాతకాలని నమ్ముతాడు, మరీ ముఖ్యంగా పెళ్లి అయ్యేవరకూ ఎవరితోనూ శారీరక సంబంధం పెట్టుకోను అంటుంటాడు. మళ్ళీ విచిత్రంగా ఇతను సోనాక్షి సిన్హా వెంటబడుతుంటాడు. ఆవిడ ఇతన్ని చాలా చులకనగా చూస్తూ ఉంటుంది. మిగిలిన పాత్రల ద్వారా నీచమైన విషయాలని గొప్పగా చూపితే, ఇతని పాత్ర ద్వారా గొప్ప విషయాలని నీచంగా చూపించారు.
 
చాలా మంది అంటున్నట్లు నా దృష్టిలో ఇది హిందూ వ్యతిరేక సినిమా మాత్రమే కాదు, ఫెమినిస్ట్ సినిమా. భారతీయ కుటుంబ వ్యవస్థని నాశనం చేసే సినిమా. తాగడం, తిరగడం, తల్లి తండ్రులను అవమానించడం గొప్ప అని చూపించే సినిమా. మన దేశం ఈ మాధ్యకాలంలో సాధించిన ఒక అద్భుతమైన సాంకేతిక విజయాన్ని ఆధారంగా చేసుకొని తీసిన సినిమా ఇంత నీచంగా ఉండటం చాలా బాధగా ఉంది.
 
ఈ సినిమాలలో భాగమైన శాస్త్రవేత్తల పాత్రలని ఇంత నీచంగా చిత్రీకరించాకపోయినా నిజానికి సినిమాకి వచ్చే నష్టం ఏమీ లేదు. టీవీలో సినిమా మధ్యలో వచ్చే వ్యాపార ప్రకటనలు లేకపోతే సినిమాకి ఏమైనా నష్టమా? లేదు కద. ఇది కూడా అలాంటిదే. ఎలా అయితే టీవీ సినిమాలలో వాణిజ్య పరకటనలు చూపినందుకు టీవీ వాడికి డబ్బులు వస్తాయో, బహుశా సినిమాలలో కుటుంబాలని నాశనం చేసే ఘట్టాలు, మద్యం, సిగేరెట్లు తాగడాన్ని ప్రోత్సహించే ఘట్టాలు, హిందూ ధర్మాన్ని చులకనగా చూపించే గట్టాలు పెట్టినందుకు కూడా అలానే నిర్మాతలకి, కొందరు నటులకి డబ్బులు వస్తాయి.         
 
ముగింపు: ఈ సినిమా కేవలం హిందూ ధర్మానికి వ్యతిరేకం అనుకుంటే పప్పులో కాలేసినట్లే. ఇది ఫెమినిజాన్ని, పాశ్చాత్య నాగరికతని ప్రోత్సహించే సినిమా. వాటి లక్ష్యం మనుషులను కేవల వినియోగదారుల స్థాయికి, అంటే సంపాదించి ఖర్చు పెట్టె యంత్రాల స్థాయికి దిగజార్చడం. ప్రపంచంలో ఉన్న సంపదనంతా కొందరు వ్యాపారస్తులు దోచుకోడానికి ఇది చట్టబద్ధమైన మార్గం. 
 
@వడియాల రంజిత్
(వాట్సాప్ సేకరణ )

Quote of the day

I slept and dreamt that life was joy. I awoke and saw that life was service. I acted and behold, service was joy.…

__________Rabindranath Tagore