కేవలం హిందువులే వారి టార్గెటా?
పెటా ఇండియా ఆర్గనైజేషన్ గురించి వినే ఉంటారు. ఇండియా యొక్క యానిమల్ రైట్స్ ఆర్గనైజేషన్. అంటే జంతువుల యొక్క రైట్స్ కోసం పోరాడే సంస్థ. ఈ సంస్థకి మానవత్వం ఎక్కువ! ఇంకా చెప్పాలంటే జంతుతత్వం ఎక్కువే. అదేనండి.. జంతువుల మీద ప్రేమ ఎక్కువ! జంతువులని తినకూడదు, వాటిని బాధించకూడదు, వాటి మీద ప్రయోగాలు చేయకూడదు, వినోదం కోసం వాడకూడదు. జంతువుల చర్మంతో వస్తువులు తయారుచేయకూడదు, చేసినవి ధరించకూడదు. ఇవి పెటా ఇండియా సంస్థ యొక్క నియమాలు.
అయితే.., పెటా కోడి పెట్టలా హిందువుల మీద మాత్రమే మీద ఎగిరెగిరి పడుతుందనే విమర్శ ఉంది. ఎందుకంటే హిందువులు మాత్రమే ఏనుగులను ఆలయాల్లో దేవుళ్ళ ఊరేగింపులకు వాడుతున్నారు. అలా చేస్తే ఏనుగులను హింసించినట్టే.. హిందువులు ఆవు పాలు ఎక్కువుగా తాగుతున్నారు, హిందువులు తమ పూజలలో ఆవు నెయ్యిని పవిత్ర భావంతో వాడుతున్నారు. ఇది కూడా హింస కిందే వస్తుందని పెటా అభిప్రాయం.
అందుకే పెటా హిందూ మతాన్ని టార్గెట్ చేస్తోంది. ఇది మేమంటోన్న మాట కాదు, బయట ప్రజల్లో వినిపిస్తోన్న టాక్!
ఈ దేశంలో హిందువులు మాత్రమే ఉన్నట్టు, వాళ్ళు మాత్రమే జంతువులను హింసిస్తున్నట్టు ఆ సంస్థ ప్రతిసారీ హిందువులనే ఎందుకు టార్గెట్ చేస్తోంది? హిందువుల మనోభావాలని మాత్రమే ఎందుకు దెబ్బ తీసే విధంగా ప్రయత్నాలు చేస్తోంది? హిందూ మతం మీదే ఎందుకు విషం చిమ్ముతుంది? జంతువులని హింసించడం చట్ట రీత్యా నేరమే. అయితే పాలు, నెయ్యి వంటి ఉత్పత్తులను వాడడం వల్ల ఆవు హింసకు గురవుతుందనడం కరెక్ట్ కాదన్న వాదన ప్రజల్లో వినిపిస్తోంది. అంతేకాదు ఆలయాల్లో, పండుగ సమయాల్లో ఏనుగుల మీద దేవుళ్ళని ఊరేగించడం అనేది హింస కానే కాదని అంటున్నారు. ఇది అనాధిగా వస్తున్న హిందువుల ఆచారం. మహాభారతం, రామాయణం వంటి హిందూ పురాణాల నుంచి ఈ గజారోహణ అనేది ఆనవాయితీగా వస్తున్న సాంప్రదాయం. ఎందరో హిందువుల విశ్వాసం. ఇక పశువులతో హిందువులకి ఉన్న అటాచ్ మెంట్ అనేది ఈనాటిది కాదు. తరతరాలుగా వస్తున్న వారసత్వం. ఆవుని హిందువులు గోమాతగా పూజిస్తారు. ఆ మాటకొస్తే, సృష్టి కర్త కంటే ఎక్కువగా సృష్టిని ప్రేమిస్తారు. సృష్టిలో ఉన్న ప్రతీ జీవిని ప్రేమిస్తారు. సృష్టి కర్త సృష్టిలో ఉన్న ప్రతీ జీవిలోనూ ఉంటాడు. అందుకే సృష్టిని ఆరాధిస్తారు. అదే శ్రీకృష్ణ పరమాత్మ నేర్పిన ధర్మం. పైగా కృష్ణ పరమాత్మ గోవులను కాచే గోపాలుడు. శ్రీకృష్ణుడిని పూజించే హిందువులెవరూ గోవుని హింసించే ప్రయత్నం చేయరు సరి కదా, అసలు హింసించాలి అనే ఆలోచనే రాదు. గోవుని చూస్తే జాలి వేస్తుందే తప్ప దాన్ని హింసించి పాలు పిండాలని, వ్యాపారం కోసం గోవుని బాధపెట్టాలని ఏ హిందువూ అనుకోడు. గోవునే కాదు, ప్రతీ జంతువుని హిందువులు ప్రేమిస్తారు.
కుక్కని కాలభైరవుడు అంటారు. అంటే శివుడిగా కొలుస్తారు. సింహం దుర్గా మాత వాహనం కాబట్టి గౌరవిస్తారు. ఏనుగు ఇంద్రుడి వాహనం, పైగా వినాయకుని రూపం. ఏనుగు అంటే హిందువులకి ఎంతో ప్రేమ ఉంటుంది. ఆఖరికి పందిని కూడా వరాహమూర్తి అవతారంగా కొలుస్తారు. ఇలాంటి ప్రతీ జంతువు హిందువులు ఆరాధించే దేవుళ్ళ వాహనాలుగా, ప్రతిరూపాలుగా ఉన్నాయి. అలాంటి జంతువులని హిందువులు ఎందుకు హింసిస్తారు?
దేవుళ్ళ ఊరేగింపులకు ఏనుగులను వాడడం తప్పే అయితే, ఆవు ఉత్పత్తులను వినియోగించడం తప్పే అయితే గోవధశాలల్లో కొన్ని లక్షల ఆవులు...మాంసం ముద్దలుగా మారుతున్నాయి. వేరే మతం పండుగ వస్తే ఆరోజు ఆవుల రక్తం ఏరులై పారుతుంది. ఏనుగులని ఊరేగింపులకు వాడడం హింసే అయితే, ఆవుల్ని పాల కోసం వాడుకోవడం నేరంమే అయితే… మరి పండగ పేరుతో జంతువులని చంపి తినడాన్ని ఏమంటారు?
తాజాగా గా ఓ ప్రముఖ ఆలయంలో దేవుని ఊరేగింపు కోసమని ఉంచిన ఏనుగులను, పెటా ఇండియా సంస్థ.. ఫారెస్ట్ అధికారులను ఫోర్స్ చేసి మరీ అక్కడి నుండి అడవికి తరలింపజేసింది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో ఉన్న గవర్నమెంట్ అఫీషియల్స్ ని ఫోర్స్ చేసి చట్టం పేరుతో ఆలయ నిర్వహకులను భయపెట్టించి ఏనుగులను దేవుని ఊరేగింపునకు లేకుండా చేసింది. అయితే దీన్ని హిందువులు తీవ్రంగా ఖండిస్తున్నారు. నిజంగా పెటాకి జంతువుల పట్ల అంత ప్రేమే ఉంటే ఎందుకు చికెన్, మటన్ విక్రయాలను ఆపలేకపోతుంది అని ప్రశ్నిస్తున్నారు. జంతువుల పట్ల అంత దయ ఉంటే, పండుగ పేరుతో ఆవు మాంసాన్ని తినే వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేకపోతుంది? అసలు ఇప్పటి వరకూ ఆ సంస్థ... ఎన్ని జంతువులను హింసకు గురి కాకుండా, చావకుండా కాపాడింది? జంతువులని ప్రేమించాలి అనే విషయాన్ని ఎంత మందికి తెలియజేసింది? అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. కోడి, మేక, గొర్రెలను చంపుకు తింటే లేని తప్పు.. దేవుని ఊరేగింపు కోసం ఏనుగుని వాడితే వచ్చిందా అని ప్రశ్నిస్తున్నారు. నిజానికి ఊరేగింపు కోసం కొన్ని రోజులు మాత్రమే ఏనుగును వాడతారు. కానీ ఆ ఏనుగుని ఏడాది పొడుగునా చంటి బిడ్డలా సాకుతారు. దానికి కావాల్సిన తిండి సదుపాయం, వసతి అన్నీ సమకూరుస్తారు. ఎందుకంటే దేవుని ఊరేగింపులో కీలక పాత్ర పోషించేది ఏనుగే. అలాంటి ఏనుగును దేవుని ఊరేగింపుకు వాడితే హింస ఎలా అవుతుందో అర్ధం కావడం లేదని హిందువులు అభిప్రాయపడుతున్నారు. తిరుపతిలో ఏనుగులు ఉంటాయి. వాటిని చాలా బాగా చూసుకుంటారు. వీటి కోసం సెపరేట్ గా మెయిన్టెనెన్స్ కింద కొంత డబ్బు పక్కన పెడతారు. ఎలాంటి లోటు రాదు. ఇలా దేశంలో మొత్తం మీద ప్రముఖ ఆలయాల్లో ఏనుగులకు ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతాయి. అడవిలో ఉన్నా కూడా వాటికి అంత తిండి దొరక్కపోవచ్చు. అయితే స్వేచ్ఛని హరిస్తున్నారు అని అంటే కనుక గొర్రెల నుంచి ఉన్ని తీయకూడదు, కోడి గుడ్డు తినకూడదు, ఆవు పాలు, గేదె పాలు తాగకూడదు, గాలి పీల్చకూడదు, అసలు మనిషి బతుకే బతకకూడదు. అవును.. ఈ సృష్టి అలా సృష్టించబడింది. ఒక జీవి మరో జీవి మీద ఆధారపడి బతకడమే సృష్టి.
ఈ నేపథ్యంలోనే పెటా సంస్థ ముందుగా.. జంతువులను తమ అత్యవసరాల కోసం వాడుకోవడానికి, పెద్ద అవసరం కానటువంటి అవసరాలకి వాడుకోవడానికి, అలానే తినడం కోసం చంపడానికి మధ్య ఉన్న వ్యత్యాసం తెలుసుకుంటే మంచిదని కొందరు సూచిస్తున్నారు.
అత్యవసరాలు అంటే ఆవు పాలు. ఆవు పాలులో పోషకాలు ఉంటాయి. కాబట్టి మనిషికి అత్యవసరం. పైగా పాలు పిండుకుని తాగడం వల్ల ఆవుకి బాధ ఉండదు. మనుషులకి రక్తదానం చేస్తే కొత్త రక్తం వచ్చి ఆరోగ్యం బాగుంటుంది, అలానే ఆవు కూడా పాలు మనకి దానం చేసి, తన అమృతతత్వాన్ని, మాధుర్యాన్ని పెంచుకుంటుంది. అలానే నెయ్యి, వెన్న, పెరుగు, గోమూత్రం ఇవన్నీ సహజంగా ఆవు నుంచి సంక్రమించిన దివ్యౌషధాలు… చిన్నతనంలో అమ్మ పాలు తాగి పెరుగుతాం. అమ్మ బాధపడుతుందని పాలు తాగడం మానేస్తే మనిషి మనుగడ ఉంటుందా? అయితే.. పాలు తాగి తల్లి రొమ్ము గుద్దే వాళ్ళకి, రొమ్ము పాలు తాగి.., ఆ తల్లి ఋణం తీర్చుకునే వాళ్ళకి, వ్యత్యాసం పెటా తెలుసుకుంటే మంచిదన్న టాక్ గట్టిగానే వినిపిస్తోంది.
బట్టలు, బ్యాగ్ లు, హ్యాండ్ బ్యాగ్ లు, బూట్లు, చెప్పులు, బెల్టులు ఇలా చాలా వస్తువులు రోజుకి కొన్ని కోట్లు తయారవుతున్నాయి మన దేశంలో. వీటి తయారి కోసం జంతువుల చర్మం వాడతారని మనకి తెలియంది కాదు. ఆ కంపెనీలన్నీ ఆ జంతువులు చనిపోయిన తర్వాత వాటి చర్మం ఒలుస్తున్నాయా? లేకపోతే బతికుండగానే చర్మం ఒలిచి హింసించి చంపుతున్నాయా? పెటా.. ఈ ఉత్పత్తులను ఆపగలదా? ఇప్పటి వరకు ఆ దిశగా ఎన్ని ప్రయత్నాలు చేసింది? ఎంతవరకు విజయం సాధించింది?
నిజానికి.. మన దేశ పరిస్థితుల నడుమ బీఫ్ పెద్ద ఆహార అవసరం కాదు. అయినా గాని ఆవుని చంపి తింటున్నారు. మరి ఇది తప్పు కాదా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇండియాలో ల్యాబ్స్ లలో ప్రయోగాల పేరుతో, సర్కస్ పేరుతో, మాంసం పేరుతో ప్రపంచం మొత్తం మీద ఒక రోజుకి 20 కోట్లకు పైగా జంతువులు బలవుతున్నాయి. మరి ఇవేమీ పెటా కంటికి కనబడవా అని ప్రశ్నిస్తున్నారు.
ఎప్పుడో ఒకరోజు హిందువులు ఆలయాల్లో ఏనుగుని దేవుని ఊరేగింపు కోసం వాడితే ఆ ఏనుగు హింసకు గురయినట్లయితే, మరి రోజుకు 20 కోట్లకు పైగా జంతువులు చంపబడుతున్నాయే మరి ఇది హింస కాదా? అని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో జంతువులని హింసించి వ్యాపారం చేసే వాళ్ళపై, పండుగ పేరుతో రక్తం ఏరులై పారేలా మూగ జీవాలని చంపుకు తినే వారిపై, ముఖ్యంగా హిందువులు గోమాతగా పూజించే ఆవుని చంపుకు తినే వారిపై పెటా ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చెప్పాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఈ దేశంలో హిందువులే కాదు, అనేక మతాల వాళ్ళు ఉన్నారు. జంతువులని ఘోరంగా ట్రీట్ చేసే వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్లందరినీ వదిలేసి కేవలం అమాయక హిందువుల నమ్మకాలను దెబ్బ తీసే విధంగా పెటా ప్రవర్తించడం ఎంత వరకూ న్యాయం అన్న ప్రశ్న.. ఇప్పుడు ప్రజల నుండే ఉత్పన్నం అవుతోంది. నిజానికి ఈ సంస్థ ముఖ్య ఉద్దేశం జంతువులని ప్రేమించడం కాదు, ఆ ముసుగులో హిందూ సంస్కృతి మీద, హిందూ జాతి మీద దాడి చేయడమే పెటా ఉద్దేశం అనే మాట బలంగా వినిపిస్తోంది. ఫారెన్ నుంచి ఫండ్స్ రావడం అనేది ఎప్పటి నుంచో జరుగుతున్నది. తమ మతం మాత్రమే ఉండాలి, మిగతా మతాలు ఉండకూడదు అనేది ఫారెనర్స్ కాన్సెప్ట్. అందుకే వాళ్ళు కొన్ని మిలియన్ డాలర్లు ఫండ్స్ రూపంలో ఇక్కడ సంస్కృతిని నాశనం చేయడానికి వెచ్చిస్తారు. ఈ సొమ్ము తినే ఇప్పటి వరకూ అనేక మత మార్పిడులు జరిగాయి. ఇది చాలదన్నట్టు, ఇప్పుడు యానిమల్ లవర్స్ అంటూ ఒక తోలు కప్పుకుని హిందూ జాతి మీదే దాడి మొదలుపెట్టారని పెద్ద ఎత్తున విమర్శలు వెలువెత్తుతున్నాయి. మరి దీనిపై హిందూ మత పెద్దలు ఎలా స్పందిస్తారో చూడాలి.