సినీ విశ్లేషకుడు కత్తి మహేష్ ను సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సామాజిక మాధ్యమాల్లో రాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసారని ఫిర్యాదులు అందడంతో సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా కత్తి మహేష్ ను శుక్రవారం ఉదయం అదుపు లోకి తీసుకొని విచారించారు. అనంతరం వైద్య పరీక్షల ఉస్మానియా, కరోనా పరీక్షల కోసం కింగ్ కోఠి ఆసుపత్రికి తరలించారు. కత్తి మహేష్ పై ఐపీసీ సెక్షన్ 153A కమ్యూనల్ యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు.