కరోనా గురించి ప్రస్తుత పరిస్థితుల గురించి నా విశ్లేషణ
కరోనా గురించి ప్రస్తుత పరిస్థితుల గురించి నా విశ్లేషణ - ఉపయోగపడు ఔషధ యోగాలు -
ప్రస్తుతం మనం అత్యంత భయానిక పరిస్థితుల్లో ఉన్నాం . కరోనా సమస్య సమస్త మానవాళికి ఒక మహమ్మారిలా దాపురించింది. ఇప్పుడు మనకి కావలసింది నివారణా మార్గాలతోపాటు మనం ఎదుర్కొనగలం అనే మనసిక బలం కూడా అత్యంత ప్రధానం . అంతకు ముందు పోస్టులలో మీకు కరోనా సమస్య , దాని లక్షణాల గురించి మీకు సంపూర్ణముగా వివరించాను. ఈ మధ్యకాలంలో నేను దాని గురించి మరికొంత పరిశోధన చేశాను . దానిలో అది కలిగించు సమస్యల గురించి ఇప్పుడు మీకు వివరిస్తాను.
కరోనా అనే వైరస్ భూత సంబంధ వ్యాది అని మీకు అంతకు ముందే చెప్పాను . ఇక్కడ భూత అంటే సమాజంలో వాడుకలో ఉండే దయ్యాలు లాంటివి కాదు. మన ప్రాచీనులు ఆయుర్వేదంలో వైరస్ మరియు బ్యాక్టీరియాలు కు ఈ భూతాలు అని పేరుపెట్టడానికి ప్రధాన కారణం ఇవి కంటికి కనిపించకుండా మనిషిలోకి ప్రవేశించి ప్రాణాలు తీయగలవు. అందుకే వీటిని భూతాలుగా , వీటికి చేయు చికిత్సలను భూత చికిత్సలుగా పేర్కొన్నారు . ఇది మనిషిలోకి నవరంధ్రాలు నుంచి ప్రవేశించడానికి ఆస్కారం ఉంది. ఇది ముందుగా శ్వాసవ్యవస్థ మీద దాడిచేసి మనిషిలో కఫవికృతిని కలిగించును. ఆ తరువాత ఇది మనిషిలోని ప్రతిభాగానికి వ్యాపించి ఆయా వ్యవస్థలను ధ్వంసం చేయును .
కరోనా సమస్యతో మరణించువారిని మీరు ప్రధానంగా గమనిస్తే ఒక్కటి అర్థం అవుతుంది. ఎవరైతే దీర్ఘకాల రోగాలతో చికిత్సలు తీసుకుంటూ శరీరపరంగా రోగనిరోధకశక్తి లేకుండా బలహీనంగా ఉంటారో వారిపైన తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది . మామూలుగా ఉన్నవ్యక్తులు కొంతవరకు బయటపడుతున్నారు. కాని నా అంచనా ప్రకారం అది కేవలం తాత్కాలికమే. ఏ రోజైతే మందుల సహయంతో పెరిగిన రోగనిరోధకశక్తి తగ్గునో ఆరోజు మరలా వారు ఆవ్యాధికి గురికాక తప్పదు. ఇప్పుడు మనం సహజ ఆహారాలు తీసుకుని మనలోని రోగనిరోధకశక్తిని పెంచుకోవటం ఒక్కటే మనకి దారి.
మనలో చాలామంది జ్వరం వచ్చిన వెంటనే టాబ్లెట్స్ వేసుకొంటున్నారు. అది చాలా తప్పు . జ్వరం వచ్చిన వెంటనే ముందు మీ శరీరానికి కొంత సమయం ఇవ్వండి. అది సహజసిద్ధంగా యాంటీబాడీస్ ని ఉత్పత్తి చేసుకుని సమస్యని నివారిస్తుంది. అదేవిధంగా మీరు తినే ఆహారంలో మార్పులు చేసుకోండి . వారానికి ఒకసారి ఉపవాసం చేయడం చాలా మంచిది . మీ జీర్ణవ్యవస్థకు కొంత విశ్రాంతి ఇవ్వండి. మరలా శక్తిని పుంజుకుంటుంది. మనకి భగవంతుడు ఇచ్చిన గొప్పవరం ఏమిటంటే మనశరీరానికి స్వతహాగా తనని తాను బాగుచేసుకునే గొప్పశక్తి ఉంది. ఇవన్ని మీకు వివరించడానికి ప్రధానకారణం ఏమిటంటే ఈ విషయాలు చాలమందికి తెలియదు. సమస్య రాగానే వెంటనే టాబ్లెట్స్ వేసుకోవడం అలవాటు చేసుకోవడమే . సమస్య తీవ్రత ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే ఔషధాలు వాడండి.
ఇప్పుడు మరలా కరోనా విషయానికి వద్దాం . ఇది శ్వాస వ్యవస్థమీద దాడిచేస్తుంది అని చెప్పాను కదా ! ఇది ఒకసారి మనిషి శరీరంలోకి ప్రవేశించి ఏ వ్యవస్థ మీద అయితే దాడి చేస్తుందో ఆ వ్యవస్థను సంపూర్ణంగా నాశనం చేయును . ఇది రక్తప్రసరణ వ్యవస్థలోకి చొరబడి మెదడుకు కూడా చేరును . అప్పుడు మెదడులో విపరీతమైన మంట , వేడిని పుట్టించును . దీనిని ప్రథమ దశలో గుర్తించి సరైన ఆయుర్వేద ఔషధాలు వాడిన శీఘ్రముగా సమస్య నివారించవచ్చు. నాడీమండలం మీద దాడిచేసిన మనిషికి తెలివికోల్పోయి కోమా లోకి వెళ్లును. ఈ స్థాయిలో చికిత్స వలన ప్రయోజనం లేదు .
అంతకు ముందు నేను కరోనా చికిత్సలో ఉపయోగపడే కొన్ని రకాల ఔషధాలు మీకు వివరించాను. ఈ పోస్టు నందు మీకు విడివిడిగా వాటి ఉపయోగాలు వివరిస్తాను.
దగ్గు నివారణ కొరకు -
* అల్లం రసములో తేనె కలుపుకుని తాగుచున్న గొంతులో శ్లేష్మం , దగ్గు , జలుబు తగ్గును.
* అడ్డసరం ఆకు రసం 20ml + 5gm తేనె కలిపి ఒక మోతాదుగా మూడుపూటలా తీసుకొన్న ఎంత మొండి దగ్గు అయినా తగ్గును.
* మిరియాలు , పిప్పళ్లు , శొంఠి , యాలకలు ఒక్కోటి 40 గ్రాముల చొప్పున తీసుకుని , మంచి బెల్లం 80 గ్రాములు కలిపి మెత్తగా నూరి ప్రతినిత్యం సూర్యోదయానికి ముందే 10 గ్రాముల చొప్పున తినుచున్న తీవ్రమైన దగ్గు హరించును .
ఆయాసం హరించుట కొరకు -
* అల్లంరసం 30 గ్రాములు , 20 గ్రాముల మంచి స్వచ్చమైన తేనె కలిపి రోజుకి రెండు నుంచి మూడు సార్లు పుచ్చుకొనిన ఆయాసం హరించును .
* శొంఠి కషాయం దగ్గు , ఆయాసాన్ని హరించును .
* తులసి ఆకురసము , అడ్డసరపు ఆకుల రసం కలిపి తీసుకొనుచున్న ఆయాసం తగ్గును.
సమస్య తీవ్రత అవుతున్న కొలది ఊపిరితిత్తులలో నొప్పి ప్రారంభం అగును. అప్పుడు వాడవలసిన ఔషధాలు -
* అర చెంచా శొంఠిపొడిని మజ్జిగలో కలిపి రోజుకి రెండుపూటలా తాగుచున్న రెండురోజుల్లో సమస్య నివారణ అగును.
* రోజూ ఉదయం , సాయంత్రం గుప్పెడు ఉలవ గుగ్గిళ్ళు తినుచున్న ఉపిరిత్తుల నొప్పి , మంట తగ్గును .
* మూడు గంటలకి ఒకసారి రెండు చెంచాల తేనె కప్పు నీటిలో కలిపి తాగాలి . రోజూ మూడు పూటలా తాగవలెను .
* దువ్వెనకాయ చెట్టు వేళ్ళ కషాయాన్ని ప్రతిపూటా పావుకప్పు తాగుచున్న చాలా త్వరగా ఛాతిలో నొప్పి తగ్గును. దువ్వెన చెట్టుని కొన్ని ప్రాంతాలలో పిచ్చి బెండ అని పిలుస్తారు . పసుపు రంగు పువ్వులు పూయును .
ఉపిరితిత్తులలో శ్లేష్మం నిండినప్పుడు శ్వాస పీల్చడం కష్టం అగును. అప్పుడు ప్రయోగించవలసిన ఔషధయోగాలు -
* కుప్పింట చెట్టు కాండం రసాన్ని మూడు గంటలకి ఒకసారి రెండుచెంచాలా మోతాదులో లోపలికి ఇవ్వవలెను . శ్లేష్మం బయటకి పోవును .
* పిప్పిళ్ల చూర్ణాన్ని కుంకుడు గింజ అంత ప్రతి ఆరుగంటలకు ఒక సారి కొంచం నీటితో కలిపి తగ్గేంతవరకు తాగాలి . శ్లేష్మం బయటకి పోవును .
* ఒక గిన్నెలో 10 తులసి ఆకులు వేసి కొంచం వేడిచేసి నలగగొట్టి బట్టలో వేసి పిండిన రసం వచ్చును . ఆ రసం 10ml చొప్పున గంటకి ఒకసారి ఇచ్చుచున్న లొపల కఫం కరిగి బయటకి వచ్చును.
* తమలపాకు రసం రెండుచెంచాల మోతాదుగా లోపలకి ఇచ్చుచున్న కఫం కరిగి బయటకి వచ్చును.
* ముక్కులలో వేపనూనె వేసుకొనుచున్న గొంతులో మరియు తలలో కఫం కరిగి బయటకి వచ్చును.
కరోనా సమయంలో రోగనిరొధక శక్తి పెంపొందుటకు మంచి పోషకాహారం తీసుకోవాలి . ఆకుకూరలు , డ్రై ఫ్రూట్స్ , తాజా పండ్లు , కూరగాయలు . ఆకుకూరలలో ముఖ్యముగా పొన్నగంటి కూర చాలా మంచిది . మరికొన్ని ఔషధాల గురించి కూడా మీకు తెలియచేస్తాను.
* కరక్కాయ
* అక్కలకర్ర
* అశ్వగంధ .
* చ్యవనప్రాస .
* అడ్డసరం .
* గోమూత్రం .
* మిరియాలు .
* పిప్పళ్లు .
* శొంఠి .
* లవంగాలు .
* వేపనూనె , వేపచెక్క కషాయం .
* వెల్లుల్లి , కుంకుమపువ్వు , ఉలవలు .
* తేనె , నిమ్మరసం , నీరుల్లిపాయ .
* మంజిష్ట , సన్నరాష్ట్రం , అల్లం.
* స్వర్ణభస్మం , రజత భస్మం .
* పచ్చకర్పూరం , చండ్ర కషాయం , శొంటి .
* తమలపాకు , తులసి .
పైన చెప్పినవన్నీ శరీరంలో రోగనిరొధక శక్తికి , శరీర బలాన్ని పెంచే ఔషధాలు . ఒక మనిషి శ్వాస పీల్చలేక ఆయాసంతో ఇబ్బంది పడుతుంటే ఉమ్మెత్త ఆకు ఎండినది నిప్పుల మీద వేసి ఆ పొగని లోపలికి పీల్పించిన గొంతులో నిండిన కఫం మొత్తం కరిగి బయటకి వచ్చి శ్వాస ఆడును .
గమనిక -
నాచే రచించబడిన "ఆయుర్వేద మూలికా రహస్యాలు " , " ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు " అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.
మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.
రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.
ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . కొరియర్ చార్జి 50 రూపాయలు అదనం .పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.
ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు .
కాళహస్తి వేంకటేశ్వరరావు
9885030034
అనువంశిక ఆయుర్వేద వైద్యులు