Online Puja Services

సమాజంలో నేటి పరిస్థితి

3.142.43.244

శక్తిని వదిలి వ్యక్తి పూజా చేయకండి పాదాభివందనం అనడం దేవత అనడం ఇలాంటి మాటలు వల్ల వ్యక్తుల ఆధ్యాత్మిక భావన కన్నా అహంకారం ఎక్కువ అయిపోయే అవకాశం ఉంది , మనుషులను దేవుడు అనడం దేవతలతో పోల్చడం ఇవన్నీ చేయకండి ఒక వ్యక్తి మీమల్ని ఆధ్యాత్మిక మార్గంలో నడిపిస్తున్నారు భగంతుడు గురించి నమ్మకం కలిగే విధంగా బోధిస్తున్నారు అంటే వారిని మనస్ఫూర్తిగా గురువుగా భావించి నమస్కారం చేయండి వారు చూపించే ఆధ్యాత్మిక మార్గంలో నడవండి వారిని ఆదర్శంగా తీసుకొండి ఆధ్యాత్మికంగా మీలోని శక్తిని పెంచుకోండి దానికి మార్గదర్శనం చేసే వారిని గురువుగా భావించండి వారినే దేవుడు అనేస్తే ఇంక దేవుడు ఎందుకు మీకు..

ఈ మధ్య కాలం లో చాలా మంది సాయిబాబా దేవుడు కాదు అని ప్రచారం చేస్తున్నారు బ్రహ్మ జ్ఞానం కలిగిన వ్యక్తి ని కూడా అతను ముస్లిం అని ఏవేవో ప్రచారాలు చేస్తున్నారు సరే సాయిబాబా దేవుడు కాదు అనుకుందాము ఆయన ఒక సద్గురువు అనే అనుకోండి, బాబా జీవితం రామాయణ కాలం నాటిది కాదు ఈ తరంలో జరిగినది వారి చిన్నతనం నుండిబాబా జీవన విధానం అందరికి తెలుసు వారు చేసిన బోధనలు, చూపిన మహిమలు, ఇప్పటికి ఎన్నో నిదర్శనాలు చూపిస్తున్న బాబా నే దేవుడు కాదు అనేస్తున్నారు మరి ఇప్పుడు కొత్తగా కొందరు మనుషులను దేవుళ్ళు దేవతలుగా ఎందుకు ప్రచారం చేస్తున్నారు అటువంటివి ఎలా నమ్ముతున్నారు. దేశంలో దొంగా స్వాములను మీ అమాయకత్వం తో తయారు చేస్తున్నారు. 

నేను పుట్టినప్పుడు నుండి నా కుటుంబ, స్నేహితులు, చుట్టుపక్కల వారు నేను ఎక్కడ ఉంటే అక్కడ నా జీవన విధానం అందరికి తెలుసు ఇప్పుడు కొత్తగా నాలుగు పుస్తకాలు కొనుక్కుని దేవుళ్ళు అయిన వాళ్ళము కాదు మేము అలాగే ఒక వ్యక్తి మాట్లాడే పద్దతి ఆధ్యాత్మిక విశ్లేషణ వింటే వారి ఉపాసన శక్తిని తెలుసుకోగలును. ఎందుకంటే అయస్కాంత శక్తి కి బంగారం విలువకు, వజ్రం గట్టి తనం, దీపం వెలుగుకు ప్రచారం అవసరం లేదు దాని యొక్క విలువ ప్రకాశిస్తూ తెలియ జేస్తుంది. ఒకరి అరహత నిర్ణయించడానికి మనము ఎవరు మహిమ అనేది ఉంటే అది వారి మార్గదర్శనం లోనే ప్రపంచానికి తెలుస్తుంది పబ్లిసిటీ చేసుకుంటున్నారు అంటే అది బంగారం కాదు గిల్టు అని తెలుసుకోండి. 

చాంగటి గారు, గరికపాటి గారు, వర్దపర్తి గారు, సామవేదం గారు, శ్రీధర్ స్వామి జి, అలాగే లలితా బాష్యాన్ని అద్భుతంగా రాసిన విజయవాడ వాస్తవ్యులు పార్థసారథి గారు ఇలాంటి ఎందరో మహానుభావులు ఆధ్యాత్మిక మార్గంలో సమాజాన్ని నడిపిస్తున్నారు సంప్రదాయానికి పట్టుకొమ్మలు గా సనాతన ధర్మాన్ని రక్షించే యోధులుగా నిరంతర ఉపాసనా శక్తితో ఋషులుగా కలుషితం అయిపోతున్న వ్యక్తి ఆలోచనని, సనాతన ధర్మాన్ని రక్షించు కోవడానికి శాయశక్తులా ప్రయత్నం చేస్తున్నారు. వీళ్లంతా దేవుళ్ళు కారు మానవ సమాజాన్ని ధర్మ మార్గంలో ఎలా జీవిచాలో నేర్పితూ వారు అలా జీవిసున్న గురువులు. సమాజానికి కావాల్సినది గురువులు వారు చూపే దారిలో అడుగడుగునా దైవాన్ని దర్శించ గలుగుతారు. అంతే కానీ మనుషులను దేవున్ని దేవతలను చేసి స్త్రోత్రలు రాయకండి. 

మహానుభావులు అయిన శంకరాచార్యులు, రాఘవేంద్ర స్వామి, రామానుజులు వారు, రమణ మహర్షి, పరమాచార్యులు వారు, రామకృష్ణ పరమహంస, వివేకానంద స్వామి వీళ్లంతా గురువులు గా మనము పూజిస్తున్నాము కానీ ఇంత మహిమ ఉన్నా వీళ్ళను దేవుళ్ళు అనలేదు కదా వెంకయ్యస్వామి, మోగిలి చర్ల అవధూత వీరంతా చూపిన మహిమలు అందరికి తెలుసు వీళ్ళు జీవితం ఎలా ఉండేది వస్త్ర ధారణ ఎలా ఉండేది వీళ్ళ ఆహారపు అలవాట్లు ఎలా ఉండేది అందరికి తెలుసు ఆచరించిన పద్దతులు ఎంత నిరాడంబరంగా ఉండేది. మొహానికి మెడ చుట్టూ పావు kg పౌడర్ సేంట్ మెడలో నగలు చేతికి ఉంగరాలు ఫారిన్ కి వెళ్తే మోడరన్ డ్రెస్ లు వేసుకుని, రాముడిని, హనుమంతుడు ని, సాయిబాబా ని అందరిని దూషిస్తూ, శివుడు కి చేసిన విధంగా వారికి పూజ చేయించు కుంటూ ఒక నికృష్టుడు అయితే శివ లింగం పైన కాళ్ళు పెట్టి పాద పూజ చేయించుకున్నాడు ఇక్కడ ఎవరిని తన్నాలి అలా పాద పూజ చేసిన వారిన చేయించుకున్న వాడిన ఇటువంటి వాళ్ళ దగ్గర కొందరు అవకాశవాదులు ఉంటారు అక్కడ ఏవో అమ్మునుకి సొమ్ము చేసుకునే వారు హోమాలు కోసం వచ్చే వారికి హోమాలు చేసి సంపాదించుకునే వాళ్ళు, వాళ్ళు అపూటకు వాళ్ళ జోబులు నిండితే చాలు అనుకుంటారు కానీ హిందూ ధర్మాన్ని అడ్డం పెట్టుకుని సమాజాన్ని ఎంత మోసం చేస్తున్నది వాళ్లకు అవసరం లేదు.

ఒక అడ్డ గాడిద అన్నాడు నాలాంటి వారు స్వయం ప్రకటిత గురువులు అని నేను గురువు అని ఎక్కడా ప్రచారం చేసుకోలేదు నా అడ్రెస్స్ నా వివరాలు ఎవరికీ తెలియదు, నేను తాయత్తుల, యంత్రాలు, మంత్రాలు అమ్ముకోవడం లేదు పరిహారాలు చెప్తూ ఫండ్స్ తీసుకోవడం లేదు. ఇలా స్వయం ప్రకటిత గురువులు అన్నారు అనే నా చిన్న తనం నుండి జరిగిన కొన్ని సంఘటనలు ఆధారంగా ఇక్కడ చెప్పాను కానీ పబ్లిసిటీ కోసం కాదు. అందరినీ ఆధ్యాత్మికంగా ఎంతో పద్దతిగా సాగే మార్గంలో మీమల్ని తయారు చేసి వీళ్లంతా ఎందరికో గురువై ధర్మరక్షణ చేసే దేవీ సైన్యం లాగా తయారు చేస్తాను.

ఎవరైనా ప్రయోగాలు చేస్తాము ప్రాణాలు తిస్తాము అంటే పళ్ళు రాలగొట్టి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి. మారణ మంత్రాలు మనకు తెలియదా అటువంటి శక్తి ఉన్న వాడు అలా ఎవరితో అనడు గుర్తు పెట్టుకోండి, అలాంటి మెసేజ్ లు కానీ వీడియోలు గాని ఎక్కడైనా మీరు చూసిన బెదిరించి నట్టు మీకు అర్తం అయితే అవన్నీ సేవ్ చేసి బ్లాక్మెయిల్ కేస్ పెట్టండి అదేమీ చిన్న కేస్ కాదు పోలీస్ లు కిళ్ళు విరగోడతారు. బుద్దిలేని వాళ్లకు బుద్దిలేని మాటలకు దూరంగా ఉండండి. ఆపూట కడుపు నిండితే చాలు అనుకునే అమాయకులను పక్కన పెట్టుకుని వాళ్ళ తో ప్రచారం చేసుకునే వారిని నమ్మకండి. నేనే శివుడు అంటూ నేనే దేవుడు అంటూ శివ లింగం పైన కాళ్ళు పెట్టె అంత ధైర్యం చేశారు అంటే వాళ్లకు దేవుడు అంటే భక్తి గౌరవం ఎక్కడ ఉంది అలాంటి వాళ్ళను మీ అమాయకత్వం తో తయారు చేస్తున్నారు. మార్పు మీలో రావాలి. 

ఆశ్రమాలకు సాధువులకు కోట్ల రూపాయలు ఫండ్స్ తో పని లేదు అవన్నీ త్యజించి వారు సన్యాసధర్మంలో ఉంటారు, మీరు ఆ ధనాన్ని పేదలకు వైద్యానికి ఆపదలో ఉన్న వారికి సహాయం చేస్తే ఆ దైవం కచ్చితంగా అనుగ్రహిస్తారు మీ ముందు తరాలు ఆనందంగా ఆరోగ్యంగా ఉంటారు అంతే కాని ఏకభుక్తం చేసే సాధువులు ఆశ్రమాలకు ఎందుకు ఆస్తులు రాస్తున్నారు. 

నిన్న ఒక విదేశీ భక్తుడు దేవి ఉపాసకుడు దేవీ పురంలో బట్టలు లెకుండా ఉన్న అమ్మవారి ఫోటో పెట్టి అతని భాషలో ఎవరుకుడా తప్పు ఉద్దేశంతో అమ్మవారిని భావించకూడదు ఇలా బట్టలు లేని అమ్మవారి శరీర భాగాలు చూసి నప్పుడు మన అమ్మ అక్క చెల్లి కూతురు భార్య అందరూ ఇలానే ఉంటారు అనుకోవాలి కానీ తప్పుగా భావించకూడదు అని రాసారు అతనికి అర్తం అయ్యింది అలా దానికి ఇంకో భక్తుడి మా అమ్మను అక్క చెల్లిని ఇలా చూడాలని నేను అనుకోవడం లేదు నేను తల్లిగా భబించే దేవతను బట్టలు లేకుండా చూడలేని అని కామెంట్ చేస్తే ఇంకో భక్తుడు ప్రాన్ సైట్స్ లో ఆడవాళ్లు ఇదే భంగిమలో ఉంటారు మరి వాళ్ళు కూడా దేవతా స్వరూపాలేన అని అడుగుతున్నాడు అవును ప్రతి స్త్రీ దేవతా స్వరూపమే సమాజంలో వస్తున్న మార్పు ఆలోచన విధానం వల్ల దిగజారి పోతున్నారు దేవీపురం గురువు గారు ఇంద్రియాలను జయించిన మహానుభావులు వారు నగ్నంగా స్త్రీలను చూసి అమ్మవారుగా భావించే అంత ఆధ్యాత్మిక శక్తి వారికి ఉండి ఉండవచ్చు, కానీ సమాజంలో ఒంటినిండా బట్టలు కట్టుకున్న ఆడవాళ్లకు కూడా ఎక్కడజారితే చూద్దామా అని వెతికే కళ్ళు ఉన్న సమాజంలో నగ్నంగా ఉన్న అమ్మవారి విగ్రహాలు చూసి అమ్మవారు గా భావించండి అంటే అక్కడ చూసిన ఆకారాన్ని పక్కన ఉన్న అడవాళ్ళతో పోల్చుతారు కానీ భక్తి భావం కలగదు ఎందుకంటే అందరూ ఇంద్రియాలను జయించిన వారు కాదు అలా జాయిస్తే అందరూ స్వామి జీలు అయిపోయేవారు కదా సమాజంలో స్త్రీలు పట్ల గౌరవం అభిమానం పెంచే విధంగా ఆధ్యాత్మిక బోధనలు కూడా ఉంటే మనిషికి ఏకాగ్రత కుదిరే అవకాశం స్త్రీలను సాటమనిషిగా చూసే గుణం ఏర్పడుతుంది.. ఇది వరకు దొంగచాటుగా ఆడవాళ్లకు ఫోటోలు దాచుకుని చూసే బాధ లేకుండా అక్కడికి వెళ్లి చూసి వచేస్తారు ఇవి మనము వింటున్న కామెంట్స్.

నేను తరచుగా అందరికీ ఉపదేశం కోసం కుర్తాళం స్వామి గారిని కలవమని చెప్తూ ఉంటాను వారి గురించి కూడా ఎన్నో మంచి పోస్ట్లు ఇది వరకు పెట్టాను ఈమధ్య వారి వీడియో బాక్ గ్రౌండ్ లో పెడుతున్న ఫోటోలు గురించి చాలా రకాలుగా నాకు ఫార్వర్డ్ చేస్తూ వాటి గురించి నన్ను అడుగుతున్నారు ఈ రోజు కూడా కొన్ని స్క్రీంషాట్ లు పంపారు అవివరాలు వారిని కలిసి అడగండి స్వామి జినే సమాధానం ఇస్తారు ఆ ఫోటో అనిమేషన్ స్వామి జి గారు కాదు కదా చేసింది వారిని కలిసి సిద్ధాశ్రమం ఫొటోలో జీసస్ ఉనట్టు అన్నిటిలో చూపిస్తున్నారు అని వారి దృష్టుకి తీసుకుని వెళ్ళండి. ఎందుకంటే స్పీచ్ రికార్డ్ చేసాక బాక్ గ్రౌండ్ గ్రాఫిక్స్ అనేది సభ్యులు ఎడిట్ చేసి పోస్ట్ చేస్తారు వారి వీడియోలు వారే చూసే అవసరం వారికి ఉండదు కదా చెప్పింది తనే కాబట్టి చూసుకోరు, కానీ ఈ విషయం వారి దృష్టికి తీసుకుని వెళ్తే కచ్చితంగా కండిస్తారు.. అంతే కాని నాకు చెప్తే మిలాగా నేను బాధపడతాను కానీ ప్రయోజనం ఏముంది. వారి దృష్టికి తీసుకెళ్లండి ఆ వీడియోలు వారు కూడా చూసి తగిన నిర్ణయం తీసుకుంటారు.

బయట జరుగుతున్న ప్రతిదీ అందరితో పాటి నాకు తెలుస్తూనే ఉంటుంది ప్రత్యేకంగా నాతో ఆ విషయాలు చెప్పే అవసరం లేదు ఇంత సమయం ఈ పోస్ట్ రాసిన సమయంలో మీకు ఉపయోగపడే ఏ ఉపాసన గురించో రాయవచ్చు అందుకే చెప్తున్నాను ఉపయోగం లేని చర్చలు విషయాలు నావరకు తీసుకుని రాకండి. ఆధ్యాత్మిక మార్గంలో మీ సమయాన్ని నా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే చాలు.

శ్రీ మాత్రే నమః

భానుమతి అక్కిశెట్టి 

 

Quote of the day

I slept and dreamt that life was joy. I awoke and saw that life was service. I acted and behold, service was joy.…

__________Rabindranath Tagore