Online Puja Services

పుదీనా ఉపయోగాలేమిటో తెలుసా?

3.147.75.46
ఆయుర్వేదం నందు పుదీనా కు ప్రత్యేక స్థానం ఉన్నది. 100 గ్రాముల పుదీనా ఆకు 56 క్యాలరీల శక్తిని ఇస్తుంది.  ఇవే కాకుండా మరెన్నొ పోషకాలు ఉన్నాయి . వాటి గురించి ఇప్పుడు మీకు వివరిస్తాను .
 
 100 గ్రాముల పుదీనా ఆకులో ఉండే పోషకాలు - 
 
 పిండిపదార్దాలు  - 8 .40 గ్రా , ప్రొటీన్స్ - 5 .90 గ్రా , 0 .70 గ్రా ఫ్యాట్స్ , క్యాల్షియం - 440 మి.గ్రా ,  ఫాస్ఫరస్ - 70 మి.గ్రా , ఐరన్ - 19 .2 మి.గ్రా , విటమిన్లు - A , B1 , B2 , నియాసిన్ , ఆక్సాలిక్ ఆసిడ్ ఉన్నాయి.  
 
పుదీనా ఆకు ఎక్కువుగా మాంసాహార వంటకాలలో వాడతారు . పచ్చడిగా మనవారు చాలాకాలం నుంచి ఉపయోగిస్తున్నారు. పుదీనా ఆకు నుంచి " పిప్పర్మెంట్ " నూనె తయారగును. దీనితో కూడా అనేక వైద్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ నూనెని ఘనీభవింపచేసిన మనము కిళ్ళీలలో వాడే " పిప్పరమెంట్ " తయారగును. పిప్పర్మెంట్ నోట్లో వేసుకొనిన వేడిగా ఉండి బయట గాలి కొద్దిగా సోకగానే చల్లగా ఉన్నట్లు అనిపిస్తుంది. 
 
  పుదీనా ఆకుతో చికిత్సలు  - 
 
  *  పుదీనా ఆకు రసములో 1 స్పూన్ నిమ్మరసం , కొద్దిగా తేనె కలిపి ప్రతిరోజూ 3 సార్లు చొప్పున తీసుకొనుచున్న అజీర్తి , కడుపునొప్పి , పొట్ట ఉబ్బరం , పొట్టలో గ్యాస్ , విరేచనాలు , విరేచనములో నులిపురుగులు , రక్తహీనత సమస్యల నుండి విముక్తి లభించును. 
 
 *  పుదీనాకు కషాయం రోజుకి 2 లేక 3 పర్యాయాలు సేవిస్తున్న ఎక్కిళ్లు , దగ్గు , జలుబు , అజీర్తి తగ్గును. 
 
 *  బహిష్టులో నొప్పికి పుదీనాకు కషాయం బహిష్టుకు 3 నుంచి 4 రోజుల ముందుగా సేవించటం మొదలుపెట్టిన బహిష్టునొప్పి రాదు . 
 
 *  పుదీనాకు కషాయం నందు కొంచం ఉప్పు కలిపి గొంతులో పోసుకొని గార్గిలింగ్ ( గుడగుడ ) చేయుచున్న గొంతునొప్పి తగ్గును. 
 
 *   క్షయ , ఉబ్బసం , కొన్ని ఊపిరితిత్తుల వ్యాధులకు ఆయా మందులతో పాటు ఒకస్పూను పుదీనాకు రసములో 2 స్పూనుల వెనిగార్ , తేనె , కేరట్ రసము కలిపి రోజుకి 2 సార్లు సేవించిన మంచి టానిక్ లా పనిచేస్తుంది . 
 
 *  నోటి దుర్వాసన గలవారు ప్రతిరోజు పుదీనాకు కొంచం నములుతున్న దుర్వాసన నిర్మూలమగును . ఇంకా దంతాలు పుచ్చుట తగ్గిపోయి దంతాలు గట్టిపడును. 
 
 *  దంతాల నుండి చీముకారు సమస్య ఉన్నవారు పుదీనాకు నములుతున్న చీము కారుట తగ్గును. దంతాలు ఊడుట తగ్గును. 
 
 *  ప్రతిరోజూ నిద్రించుటకు ముందు పుదీనాకు ముఖమునకు రాసుకొనుచున్న ముఖంపైన మొటిమలు తగ్గిపోయి ముఖచర్మం మృదువుగా , అందముగా తయారగును. 
 
 *  గజ్జి , దురద వంటి చర్మవ్యాదులలో పుదీనాకు రసం పైపూతగా వాడుచున్న చర్మవ్యాధులు అంతరించును. నొప్పులు తగ్గును. 
 
 *  పిప్పరమెంట్ తైలములో కొద్దిగా పంచదారను కలిపి 2 నుంచి 3 చుక్కలు కడుపులోకి తీసుకొనుచున్న కడుపుబ్బరం , ఆహారం అరగకుండా ఉండటం , అజీర్తి తగ్గును. 
 
 *  కొబ్బరినూనెలో కొద్దిగా పిప్పరమెంట్ తైలం కలిపి కీళ్ళనొప్పులకు పైపూతగా రాయుచున్న గుణం కనిపించును. 
 
 *  గొంతునొప్పికి , గొంతులోని టాన్సిల్స్ కు పైపూతగా పిప్పరమెంట్ తైలాన్ని రాయుచున్న తగ్గును. 
 
 *  పిప్పరమెంట్ నూనెలో కొద్దిగా లవంగ నూనె కలిపి పుచ్చుపళ్ళలో పెడుతున్న నొప్పి తగ్గుటయే కాక క్రమక్రమంగా పుచ్చు అంతరించును. 
 
 *  నిమ్మరసములో కొద్దిగా పిప్పరమెంట్ తైలము కలిపి రాత్రిపూట ఒంటికి పట్టించుకుని పడుకున్న దోమలు దరిచేరవు . 
 
        పైన చెప్పిన యోగాలే కాకుండా విరేచనాలు , జిగటవిరేచనాలు యందు పనిచేయును . హృదయమునకు మంచిది . గర్భాశయ దోషాలను పోగొట్టి రుతుస్రావం సరిగ్గా అగునట్లు చేయును . బాలింతలకు వచ్చు జ్వరం నందు పుదీనాకుల రసం తీసి రెండు చెంచాలు చొప్పున తాగించుట మంచిది . జలుబు నందు పుదీనాకు ముద్దగా చేసి నుదురుకు పట్టించి జలుబు , తలనొప్పి తగ్గును. 
 
                  
 
   గమనిక  -
 
నాచే రచించబడిన "ఆయుర్వేద మూలికా రహస్యాలు " , " ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు "  అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.
మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.
 రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.
 
ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . కొరియర్ చార్జి 50 రూపాయలు అదనం .పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.
 
            ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు .
 
                  కాళహస్తి వేంకటేశ్వరరావు 
                         9885030034 
               అనువంశిక ఆయుర్వేద వైద్యులు

Quote of the day

I slept and dreamt that life was joy. I awoke and saw that life was service. I acted and behold, service was joy.…

__________Rabindranath Tagore