ఆవుపాల ఉపయోగాలు
అంతకు ముందు పోస్టులలో ఆవుపాల ఉపయోగాలు మరియు ఔషధ చికిత్సల గురించి వివరించాను. ఇప్పుడు మీకు ఆవుపాలతో మరికొన్ని ఔషధయోగాలు వివరిస్తాను.
* చిన్నపిల్లలకు ప్రమాదవశాత్తు గాయాలు , కాలిన గాయాలు అయిన సందర్భాలలో ఆ భాగము పైన " ప్రథమచికిత్స" గా పాలుపోసి పాలతో తడిపిన వస్త్రాన్ని కట్టు కట్టిన బాధ ఉపశమిస్తుంది. వీలైనంత త్వరలో వైద్యసహాయాన్ని పొందుట మంచిది .
* బాగా మరగకాచిన పాలలో ఒక నిమ్మకాయ రసమును పిండి 10 నిమిషములు కదలకుండా ఉంచాలి. తరువాత ఆ మిశ్రమాన్ని శరీరానికి పట్టించుకోని రాత్రంతా ఉంచుకుని ఉదయము నులివెచ్చని నీటితో పరిశుభ్రముగా స్నానం చేయాలి . ఈ ప్రకారముగా కొంతకాలం పాటు ప్రతిరోజూ రాత్రిపూట చేస్తూ ఉంటే శరీరం మృదువుగా , తేజోవంతముగా ఉంటుంది.
* ప్రతిరోజూ రాత్రిపూట పాలలో గుడ్డులోని పచ్చసొన కలిపి తలకు మర్దన చేస్తూ ఉంటే శిరోజములు నల్లగా నిగనిగలాడుతూ పట్టువలె మెత్తగా ఆరోగ్యముగా ఎదుగుతాయి. ఇంకా తలలోని గజ్జి , చుండ్రులాంటి కొన్ని వ్యాధులకు మందుగా కూడా పనిచేస్తుంది .
* రాత్రివేళ యందు గ్లాసు పాలలో కొద్దిగా తేనె కలిపి త్రాగుతూ ఉంటే హాయిగా నిద్రపడుతుంది. గర్భిణీ స్త్రీలు చివరి మాసములో ఈ విధముగా ప్రతిరోజూ త్రాగుతూ ఉంటే వీరు మంచి పోషక విలువలు కలిగిన ఆహారం తీసుకున్నట్లే .
* పాలమీద మీగడలో చిటికెడు పసుపు , కొద్దిగా వెనిగర్ కలిపి చిన్నచిన్న గాయాలకు , గజ్జి లాంటి చర్మవ్యాధులకు పైపూత మందుగా ఉపయోగించవచ్చు .
* నెఫ్రైటిస్ , పెలైటీస్ లాంటి మూత్రపిండాల వ్యాధుల వారు పాలలో లేత కొబ్బరినీరు కలిపి సేవిస్తున్న మూత్రం సాఫీగా వస్తుంది.
* తరచుగా నిద్రలేమితో బాధపడేవారు రోజుకి 1 నుంచి 2 సార్లు పాలతో పాదాలను మర్దిస్తూ ఉంటే క్రమక్రమముగా నిద్రలేమి తగ్గును.
* గ్లాసు పాలలో కొద్దిగా పసుపు , మిరియాలపొడి కలిపి 4 రొజుల పాటు రాత్రివేళలో తాగుతుంటే గొంతునొప్పి , దగ్గులాంటివి తగ్గును.
* కంజెక్టివైటిస్ లాంటి కంటి వ్యాధులకు 1 నుంచి 2 చుక్కల పాలను కంటి మందుగా వినియోగించవచ్చు.
* పాల నుండి మీగడ , పెరుగు , వెన్న , మజ్జిగ , జున్ను వంటివి లభించును. ఇవన్నీ కూడా అనేక వైద్యప్రక్రియలలో ఉపయోగించవచ్చు .
గమనిక -
నాచే రచించబడిన "ఆయుర్వేద మూలికా రహస్యాలు " , " ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు " అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.
మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.
రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.
ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . కొరియర్ చార్జి 50 రూపాయలు అదనం .పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.
ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు .
కాళహస్తి వేంకటేశ్వరరావు
9885030034
అనువంశిక ఆయుర్వేద వైద్యులు