కాలికి మెట్టెలు ఎందుకు?
భారతీయ మహిళలు కాలికి మెట్టెలు పెట్టుకోవడమనే సాంప్రదాయం ఏర్పడడానికి వెనకున్న అంతరార్థం
పతంజలి మహర్షి మనకు ఇచ్చిన ఒక యోగ ప్రక్రియ- పాదమర్దనం-Reflexology
జాగ్రత్తగా గమనించండి...
మన పాదాలు మన శరీరాకృతినే తలపిస్తాయి...
1. బొటన వేలు తలను..
2. మిగిలిన వేళ్ళు కళ్ళు, ముక్కు , గొంతు, వరుసగా సూచిస్తాయి...
3. కాలివ్రేళ్ళ క్రింది భాగం... అంటే పాదాలకు వ్రేళ్ళకు మధ్య కలిసి ఉండే భాగం గొంతును సూచిస్తాయి
4. అరి కాలిపై ఉన్న ఉబ్బెత్తు భాగం చాతీని సూచిస్తుంది...
5. అరికాలి లోని గుంట భాగం నడుమును
6. కాలి మడమ భాగం కాళ్ళను
7. కాలి చివరి భాగం అరికాళ్ళను/మడమలు/పాదాలను సూచిస్తాయి...
బొటన వేలిని ఉబ్బెత్తు భాగాలను మర్దించటం ద్వారా తలలోని పిట్యుటరీ గ్రంధి చేతనమయి..
తలకు మేలు చేకూరుతుంది...
రెండవ మూడవ, మిగిలిన వేళ్ళ ఉబ్బెత్తు భాగాలు మర్దించటం ద్వారా కళ్ళు, ముక్కు, గొంతుకు సంబంధించిన అవయవాలు చేతనమయి...
ఆయా భాగాల సమస్యలు తగ్గుతాయి...ఫోటో గమనించండి..
గతంలో మన భారతీయ స్త్రీలు ఎక్కువగా నీటిలోనే పని చేయవలసి వచ్చేది..
అందువల్ల ఎక్కువగా జలుబు, కాలి వ్రేళ్ళు పాయటం వంటి ఋగ్మతలకు లోనయ్యేవారు...దీనికి విరుగుడుగా మెట్టెలు ధరించడం వలన కన్ను, ముక్కు, గొంతుకు సంబంధించిన సమస్యలు నివారించబడేవి...