Online Puja Services

కట్టెదుర వైకుంఠము కాణాచయిన కొండ

3.144.93.34

కట్టెదుర వైకుంఠము కాణాచయిన కొండ | తెట్టలాయ మహిమలే తిరుమలకొండ ..♫

ఇదిగో మన యెట్టయెదుటనున్న కొండలను గమనించారా! ఇదే ఏడుకొండలని ప్రసిద్ధి చెందిన తిరుమలకొండ. శ్రీహరి చిరకాల నివాసం (కాణాచి) అయిన వైకుంఠమే ఈ కొండ అని గ్రహించండి. దీని మహమలన్నీ రాసులుగా పోగయి (తెట్టైలై) ఒకే చోటకుప్పగావున్న మహిమాన్వితమైన కొండ ఇది.
వేదములే శిలలై వెలసినది కొండ |

యేదెస బుణ్యరాసులే యేరులైనది కొండ |
గాదిలి బ్రహ్మాదిలోకముల కొనల కొండ |
 శ్రీదేవుడుండేటి శేషాద్రి కొండ ..♪

వేదములన్నీ శిలలుగా వెలసినదే ఈ తిరుమల. ఎటుచూసినా, దీనిపై పారే
వరులన్నీ మహానుభావులు చేసిన పుణ్యముల యొక్కరాసులే. దీని శిఖరములన్నీ ప్రేమతో బ్రహ్మాదిలోకములు రూపం దాల్చినవే. ఈ శేషాద్రి వుంది చూశారా, ఇది సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు వుండే కొండ.

సర్వదేవతలు మృగజాతులై చరించేకొండ | 
నిర్వహించి జలధులే నిట్టచరులైన కొండ |
వుర్విదపసులే తరువులై నిలచిన కొండ | 
పూర్వటంజనాద్రి యీ పొడవాటి కొండ ..♫

ఈ కొండపైనున్న మృగములు మృగజాతులు అన్నీ కూడా కిన్నెర, కింపురుష,
గంధర్వాది దేవతలే. సమస్త సముద్రములు పూనుకొని ఈ కొండపై నిట్టచరులై
(సెలయేళ్ళుగా) పారుతున్నాయి. మహర్షులందరు ఈ కొండపైనున్న వృక్షములే సుమా!! ఇదిగో ఎత్తయిన ఈ కొండవున్నది చూశారా, ఇదే తూర్చువైపునన్న అంజనాద్రి.

వరములు కొటారుగా వక్కాణించి పెంచే కొండ | 
పరగు లక్ష్మీకాంతుసోబనపు గొండ |
కురిసి సంపదలెల్ల గుహల నిండిన కొండ | 
విరివైన దదివో శ్రీవేంకటపు గొండ ..♫

పరమాత్ముడొసగిన వరములన్నీ గిడ్డంగులు (కొటారుల) గా వచించబడినదీ
సమ్మద్ధినిచ్చే కొండే. (ఆయన వరములే పెద్దపెద్ద నిలువలు) చూడగా శ్రీనాధుని మంగళప్రదమైన కొండ ఈ తిరుమలయే. సర్వసంపదలు కురిసి రాసులుగా గుహలలో నిండి పోయిన కొండ ఇదే. ఓ ప్రజలార! ఇదిగో ఈ శ్రీవేంకటాద్రి గొప్ప విస్తృతమైన
కొండ.

రచన: శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య -Annamacharya

Quote of the day

I slept and dreamt that life was joy. I awoke and saw that life was service. I acted and behold, service was joy.…

__________Rabindranath Tagore