ఆడరానిమాటది గుఱుతు వేడుకతోనే విచ్చేయమనవే కాయజకేలికిఁ గడుఁ దమకించగ ఆయములంటిన దది గుఱుతు పాయపు పతికినిఁ బరిణాముచెప్పి మోయుచు తనకిటు మొక్కితిననవే దప్పిమోవితో తా ననుఁ దిట్టగ - నప్పుడు నవ్విన దది గుఱుతు యిప్పుడు దనరూ పిటు దలచి బయలు చిప్పిల గాగిటఁ జేర్చితిననవే పరిపరివిధముల పలుకులుఁ గులుకగ అరమరచి చొక్కినదది గుఱుతు పరగ శ్రీవేంకటపతి కడపలోన సరవిగూడె నిక సమ్మతియనవే
__________Rabindranath Tagore