ఆతడితడా వెన్న లంతట
వీడటే రక్కసి విగతజీవగ జన్ను - బాలుద్రావిన మేటి బాలకుండువీడటే నందుని వెలదికి జగమెల్ల - ముఖమందు జూపిన ముద్దులాడు
వీడటే మందలో వెన్నలు దొంగిలి - దర్పించి మెక్కిన దావరీడు
వీడటే యెలయించి వ్రేతల మానంబు - సూరలాడిన లోకసుందరుండు
(పోతన భాగవత పద్యం)
ఆతడితడా వెన్న లంతట దొంగిలినాడు
యేతులకు మద్దులు రెండిలఁ దోసినాడు
యీతడా దేవకిఁగన్న యింద్రనీలమాణికము
పూతకిచన్ను దాగి పొదలినాడు
యీతడా వసుదేవుని యింటిలో నిధానము
చేతనే కంసునిఁ బుట్టచెండుసేసినాడు
మేటియైన గొంతి(కుంతి?)దేవి మేనల్లు డీతడా
కోటికిఁ బడెగెగాను కొండ యెత్తెను
పాటించి పెంచేయశోదపాలి భాగ్య మీతడా
వాటమై గొల్లెతలను వలపించినాడు
ముగురు వేలుపులకు మూలభూతి యీతడా
జిగినావుల పేయలఁ జేరి కాచెను
మిగుల శ్రీవేంకటాద్రిమీదిదైవమీతడా
తగి రామకృష్ణావతార మందె నిప్పుడు
వీడటే మందలో వెన్నలు దొంగిలి - దర్పించి మెక్కిన దావరీడు
వీడటే యెలయించి వ్రేతల మానంబు - సూరలాడిన లోకసుందరుండు
(పోతన భాగవత పద్యం)
ఆతడితడా వెన్న లంతట దొంగిలినాడు
యేతులకు మద్దులు రెండిలఁ దోసినాడు
యీతడా దేవకిఁగన్న యింద్రనీలమాణికము
పూతకిచన్ను దాగి పొదలినాడు
యీతడా వసుదేవుని యింటిలో నిధానము
చేతనే కంసునిఁ బుట్టచెండుసేసినాడు
మేటియైన గొంతి(కుంతి?)దేవి మేనల్లు డీతడా
కోటికిఁ బడెగెగాను కొండ యెత్తెను
పాటించి పెంచేయశోదపాలి భాగ్య మీతడా
వాటమై గొల్లెతలను వలపించినాడు
ముగురు వేలుపులకు మూలభూతి యీతడా
జిగినావుల పేయలఁ జేరి కాచెను
మిగుల శ్రీవేంకటాద్రిమీదిదైవమీతడా
తగి రామకృష్ణావతార మందె నిప్పుడు