అదెవచ్చె నిదెవచ్చె అచ్యుతుసేనాపతిపదిదిక్కులకు నిట్టె పారరో యసురులు గరుడధ్వజంబదె ఘనశంఖరవమదె సరుసనే విష్ణుదేవుచక్రమదె మురవైరిపంపులవె ముందరిసేనలవె పరచి గగ్గుల కాడై(ఱై) పారరో దానవులు తెల్లని గొడుగులవె దేవదుందుభులు నవె యెల్లదేవతరథా లింతటా నవె కెల్లురేగీ నిక్కి హరికీర్తి భుజములవె పల్లపు పాతాళానఁ బడరో దనుజులు వెండిపైడిగుదె లవె వెంజామరములవె మెండగు కైవారాలు మించిన వవె దండి శ్రీవేంకటపతి దాడిముట్టె నదెయిదె బడుబండై జజ్జరించి పారరో దైతేయులు
__________Gautam Buddha