అభయదాయకుడ వదె నీవేగతి ఇభరక్షక నన్నిపుడు కావవే భయహారదైత్యేయ భంజనకేశవ జయజయ నృసింహ సర్వేశ్వరా నియతము మాకిదె నీపాదములే గతి క్రియగా మమ్మేలి కింకలుడుపవే బంధవిమోచన పాపవినాశన సింధురవరదా శ్రితరక్షక కంధర వర్ణుడ గతి నీనామమె అంధకారముల నణచి మనుపవే దైవశిఖామణి తతచక్రాయుధ శ్రీవేంకటగిరి శ్రీరమణా సావధాన నీశరణ్యమే గతి వేవేలకు నా విన్నపమిది
__________Gautam Buddha