ఇందులోన గల సుఖము ఇంతే చాలు మాకు ఇందు వెలియైన సిరులేమియూ నొల్లము || ఆది దేవునచ్యుతు సర్వాంతరాత్ముకుని వేదవేద్యు కమలాక్షు విశ్వపూర్ణుని | శ్రీదేవు హరిని ఆశ్రిత పారిజాతుని అదిగొని శరణంటిమి అన్యము మేమొల్లము || పరమాత్ము పరిపూర్ణు భవ రోగవైద్యుని మురహరు గోవిందుని ముకుందుని | హరి పుండరీకాక్షు అనంతుని అభవుని పరగ నుతించితిమి పరులనేమొల్లము || అనుపమ గుణ దేహుని అణురేణు పరిపూర్ణు ఘనుని చిరంతనుని కలిభంజనుని | దనుజాంతకుని సర్వ ధరు శ్రీవేంకటపతిని కని కొలిచితిమి యేగతులు నేమొల్లము ||
__________Swamy Vivekananda