ఎంత చదివి చూచిన నీతడే ఘనము గాక| యింతయు నేలేటి దైవమిక వేరే కలరా|| మొదల జగములకు మూలమైన వాడు| తుద ప్రళయము నాడు తోచేవాడు|| కదిసి నడుమనిండి కలిగి వుండెడి వాడు| మదన గురుడే కాక మరి వేరే కలరా|| పరమాణువైనవాడు బ్రహ్మాండమైనవాడు| సురలకు నరులకు జోటయిన వాడు|| పరమైన వాడు ప్రపంచమైనవాడు| హరి యొక్కడే కాక అవ్వలను గలరా|| పుట్టుగులయినవాడు భోగ మోక్షాలయినవాడు| యెట్టనెదురలోనను యిన్నిటివాడే|| గట్టిగా శ్రీవేంకటాద్రి కమలాదేవితోడి| పట్టపు దేవుడే కాక పరులిక గలరా||