Online Puja Services

శ్రీరామ చంద్రుని పూజించేందుకు ఏవారం అనుకూలమైనది ?

3.133.129.8

శ్రీరామ చంద్రుని పూజించేందుకు ఏవారం అనుకూలమైనది ? 
- లక్ష్మి రమణ 

రామాయణం మహా కావ్యం మాత్రమే కాదు . అది మనం ఎలా మెలగాలి అని చెప్పే ఒక గొప్ప వేదం . అందుకే యుగాలు మారినా ఆ కావ్యం అజరామరం . తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడనైతిని శ్రీరామా అని పాడతారు రామదాసు . అటువంటి తారకనామము రామ నామము . ఆ నామాన్ని తలుచుకుంటే చాలు భవబంధాలు తొలగిపోతాయి . శ్రీరామ రక్షా సర్వజగద్రక్ష అనే మాట మన సనాతన ధర్మంలో ప్రతి ఒక్కరూ విశ్వశించే మాట . ఆ రాముని ఆరాధిస్తే, ప్రత్యేకించి పిల్లలకి ఆరోగ్యం సమకూరుతుంది . దుష్ట శక్తుల ప్రభావం నుండీ రక్షణ లభిస్తుంది . 

రామకథ రమ్యమైన రామాయణం. వ్యాస కృతమైన ఈ కావ్యమంతా  కూడా మనకి సూర్యారాధనని బోధిస్తుంది . రాముడు సూర్యవంశ సంజాతుడు. ఆయన సూర్యుని ఆదిత్యహృదయం ఉపదేశంగా అగస్త్యముని నుండీ పొంది, సూర్యోపాసన వలన రావణ సంహారం చేశారు. హనుమంతుడు సూర్యుని శిష్యుడు. ఈ విధంగా సూర్యోపాసనా మహిమ రామాయణంలోని అడుగడుగునా కనిపిస్తుంది . సూర్యోపాసనకి ఆదివారాన్ని ప్రధానంగా పేర్కొంటారు . నిజానికి రాముని కూడా ఆదివారం నాడు అర్చించడం ఉత్తమమైన ఫలితాలని అనుగ్రహిస్తుంది . 

రామ రామ రామేతి , రమే రామే మనోరమే , సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే !! అని ఒక్క సారి స్మరిస్తే చాలు విష్ణుసహస్రనామం చదివిన ఫలితం లభిస్తుంది . దీని వలన అన్ని రకాలైన ఆరోగ్య, కుటుంబ సమస్యలు తీరిపోతాయి . ధనుద్దారి అయిన సూర్యవంశ సంజాతుడైన రాముడే మనకి రక్షకుడై నిత్యమూ మనకి రక్షణగా ఉంటారు .

ఆదివారం శలవు అనే సంప్రదాయం మనకి బ్రిటీషు పరిపాలకులు ఇచ్చిన వరంగా ఇక్కడ మనం భావించాలి . సెలవురోజాని బద్దకించకుండా, ఆ రోజు శ్రీ రామ చంద్రుని పూజించడం గొప్ప అనుకూల్యతలని ఇంట్లో పెంపొందిస్తుంది . సూర్యుని ( సూర్య నారాయణుడు) అనుగ్రహాన్ని కూడా ఈ విధంగా మనం పొందినట్టవుతుంది . ఓంకార స్వరూపమైన పరంధాముడు శ్రీరాముడు . కనుక ఆయన అనుగ్రహం ఉంటె సర్వమూ ఉన్నట్టే . ఇంట్లో కలతలు లేకుండా ఉండేందుకు,  శ్రీ రామ పట్టాభిషేకం రూపాన్ని అర్చించడం శ్రేయోదాయకం. 

శ్రీరామకటాక్ష సిద్ధిరస్తు !! శుభం .   

Quote of the day

The weak can never forgive. Forgiveness is the attribute of the strong.…

__________Mahatma Gandhi