Online Puja Services

భద్రాద్రి రామ గోవింద గోవిందా!

3.139.234.124

భద్రాద్రి రామ గోవింద గోవిందా!!!!!!!!!!!!!

భద్రాచలం శ్రీసీతారామస్వామి ఆలయానికి ఉన్న చరిత్ర. 

ఇక్కడ స్వామి వారు సీతాలక్ష్మణ సమేతుడై చతుర్భుజుడుగా వెలిసారు. ఇంకొ ప్రత్యేకత ఏమిటంటే స్వామి పశ్చిమానికి అభిముఖంగా ఉండి దక్షిణ ప్రవాహి అయిన గోదావరి నదిని వీక్షిస్తుండటంతో , ఈ క్షేత్రం ఎంతో ప్రాచినమైనది. దీని గురించి బ్రహ్మండపురాణంలోనూ, గైతమీ మహత్స్యంలోనూ ప్రస్తావన ఉంది. ఈ ప్రాంతంలోనే త్రేతాయుగం నందలి శ్రీరామచంద్రుడు సీతాలక్షణ సమేతుడై వనవాసం చేసాడని ప్రతిది. ఒకసారి స్థల పురాణం పరిశీలిస్తే.... 

భద్రాచలం శ్రీసీతారామస్వామి ఆలయానికి ఉన్న చరిత్ర స్థల పురాణం: ::శ్రీరాముడు వనవాస సమయంలో ఈ ప్రాంతంలో ఒక బండరాయి మీద సేద తీరాడట. సేద తీరిన తర్వాత ఆ బండరాయిని అనుగ్రహించి మరుజన్మలో నువ్వు మేరుపర్వత పుత్రుడు భద్రుడుగా జన్మిస్తావని అప్పుడు నీ కొండపైనే శాశ్వత నివాసం ఉంటానని వరమిచ్చాడట. దీనితో భద్రునిగా జన్మించి శ్రీరామునికై తపస్సు చేయసాగాడు. దీనితో బద్రున్ని అనుగ్రహించి భద్రగిరిపై వెలసి ఒక పుట్టలో ఉన్నాడట. కాలక్రమంలో శబరి శ్రీరాముడి అనుగ్రహంతో పోకల దమ్మక్కగా జన్మించి భద్రాచల సమీపంలోని భద్రారెడ్డి పాలెంలో రామునికి పరమ భక్తురాలుగా ఉంటూ ఎప్పుడూ రామనామ స్మరణం చేస్తుండేది. ఒక రోజు కలలో రాముడు నేను భద్రగిరిపై ఎండకు ఎండి వానకు తడిసి ఉంటున్నాను నాకు ఎదైనా నీడ నిర్మంచమని ఆదేశించాడట. దమ్మక్క తెల్లవారగానే స్వామి చెప్పిన ప్రాంతంలో వెళ్ళి చూడగా పుట్టలో వెంచెసి ఉన్నాడట. పుట్టను శుభ్రం చేసి తాటాకులతో తనకు చేతనయినట్టు ఒక పందిరి వేసి విగ్రహాలను ఉంచి పూజలు చేస్తుండెదట. భద్రాచలం శ్రీసీతారామస్వామి ఆలయానికి ఉన్న చరిత్ర భద్రారెడ్డి పాలెంకు కూత వేటు దూరంలో గల నేలకొండపల్లి గ్రామంలో కంచర్ల లింగన్న కామమ్మ దంపతుల ఒక్కగానొక్క కుమారుడు కంచర్ల గోపన్న, చిన్నతనం నుండి శ్రీరామ భక్తుడు. యవ్వనం రాగానే గోపన్నకు దగ్గర బందువు అయిన అక్కన్న తానిషా ప్రభువు దగ్గర మంత్రిగా ఉండటంతో గోపన్నకు పాల్వంచ ప్రాంతానికి తహసీర్ధారుగా నియమించాడు. ఆ పరగణాలోనే ఉన్న భద్రగిరి ప్రాంతంను దర్శించిన గోపన్న స్వామికి సరైన ఆలయం లేకపోవడంతో చలించి, పన్నులుగా వసూలయిన ధనంతో రామాలయంను సర్వాంగ సుందరంగా నిర్మించాడట. భద్రాచలం శ్రీసీతారామస్వామి ఆలయానికి ఉన్న చరిత్ర దీనితో కోపోద్రిక్తుడైన తానిషా గోపన్నను చరసాలలో భందించి చిత్రహింసలకు గురిచేస్తాడు. తానిషాకు రామచంద్రుడు కరుణించి లక్ష్మణ సమేతుడై కలలో కనిపించి తన కాలం నాటి రామమాడలను చెల్లించాడట. తానిషా ఒక్కసారిగా మేలుకుని చూడగా ఆలయానికి గోపన్న ఎంతయితే వాడాడో అంత సొమ్ము రాశిగా పోసి ఉందట. దీనితో గోపన్న భక్తికి తన తప్పును తెలుసుకుని ఖైదు నుండి విడుదల చేసాడట. గోపన్న ఎప్పుడూ రామకీర్తనలు పాడటంతో రామదాసుగా ప్రసిద్దికెక్కాడు. అదీ ఆలయానికి ఉన్న చరిత్ర. భద్రాచలం శ్రీసీతారామస్వామి ఆలయానికి ఉన్న చరిత్ర 

భద్రాచలంలో జరిగే ముఖ్యమైన ఉత్సవాలు,పండుగలు- శ్రీరామనవమి - స్వామివారి ఆలయంలో ఎంతో కన్నులపండుగగా నిర్వహించేది సీతారాముల కళ్యాణ మహోత్సవం.చైత్రశుద్ద నవమినాడు స్వామివారి కళ్యాణం జరిపిస్తారు.కళ్యాణంలో స్వామివారు కట్టే తాళిబొట్టును రామదాసు చేయించాడు.ఇప్పటికి ఆ మంగళసూత్రాన్నే వినియోగిస్తున్నారు.కళ్యాణం నిమిత్తం అప్పటి తానిషా ప్రభుత్వ సాంప్రదాయం ప్రకారం మన రాష్ట్ర ప్రభుత్వం ముత్యాల తలంబ్రాలు అందజేస్తుంది.సీతారాముల కళ్యాణమహౌత్సవం చూసి తరించడానికి రాష్ట్రం నలుమూలల నుండే కాక వివిధరాష్ట్రాల నుండి కూడా భక్తులు తరలి వస్తారు. భద్రాచలం శ్రీసీతారామస్వామి ఆలయానికి ఉన్న చరిత్ర వైకుంఠ ఏకాదశి- శ్రీమహవిష్ణువుకు ఎంతో ప్రీతిపాత్రమైన వైకుంఠ ఏకాదశిని ఎంతో వైభవంగా ఇక్కడ నిర్వహిస్తారు.ఏకాదశికి గోదావరి నదిలో నిర్వహించే తెప్పోత్సవం,ఉదయం 5గంటలకు జరిగే వైకుంఠద్వార దర్శనం చూసేవారికి ఎంతో నయనానందకరంగా ఉంటాయి. వాగ్యేయకార మహౌత్సవం - భక్తరామదాసు పేర 1972నుండి వాగ్యేయకార మహౌత్సవాలు
నిర్వహించబడౌతున్నాయి.

Quote of the day

The will is not free - it is a phenomenon bound by cause and effect - but there is something behind the will which is free.…

__________Swamy Vivekananda