రాముడు వదిలేస్తే

రాముడు లంక కు వెళ్ళటానికి రామసేతువు నిర్మాణం జరుగుతోంది. వానరులు సముద్రంలో రాళ్లు వేస్తున్నారు. అవి తెలుతున్నాయి. ఇదంతా చూస్తూ..
శ్రీరాముడు కూడా కొన్ని రాళ్లు వేద్దామని సముద్రంలో రాయిని వదిలాడు. విచిత్రంగా ఆ రాయి మునిగి పోయింది. సరే అని మరొకటి వేశాడు. అది కూడా మునిగి పోయింది.
ఇదేంటి! వానరులు వేస్తే తేలుతున్నాయి. నేను వేస్తే మునిగి పోతున్నాయి. అయినా చూద్దాం అని మరో రాయి విడిచాడు. అది కూడా మునిగి పోయిందట.
ఇదేంటని శ్రీరాముడు హనుమను మరి కొందరిని అడిగాడు.
*స్వామి!*
*మేము వేసే రాళ్ళ మీద మీ నామం రాస్తున్నాం. మీరు రాయలేదు కదా* అన్నారు.
*అదేంటి. నేను స్వయంగా వేస్తున్నాను కదా. నా నామం రాస్తేనే తేలితే నేను వేస్తే మునిగి పోవటం ఏమిటి? ఎందుకలా?* అన్నారు స్వామి.
అందుకు హనుమ ఇలా సమాధానం చెప్పారు.
*స్వామి!*
*మీరు ఆ రాయిని విడిచి పెట్టేశారు. రాముడిని వదిలేసినా, రాముడు వదిలేసినా మునిగి పోక తప్పదు. అదే జరుగుతోంది స్వామి* అని.
అందుకే.......
రామ నామాన్ని జపించండి. ధర్మంగా జీవించండి.
జై శ్రీరాం.
శ్రీ రామ శ్రీ రామ జయ జయ రామ.