విష్ణు సహస్రనామం ఒక్కటి చాలు
విష్ణు సహస్రనామం ఒక్కటి చాలు జన్మ తరించిపోవడానికి !!
సేకరణ
భారతీయ సంస్కృతికి ఇతిహాసాలు రెండు.వాల్మీకి మహర్షి ప్రణీతమైన రామాయణము. శ్రీవేదవ్యాస భగవానుడు అనుగ్రహించిన శ్రీమద్భారతము. శ్రీమద్భారతానికి రెండింటి వల్లనే గౌరవం అని పెద్దల యొక్క సూక్తి. అందులో మొదటిది శ్రీ కృష్ణ భగవానుడు అనుగ్రహించిన శ్రీమద్భగవద్గీత రెండవది. భీష్మ పితామహుడు లోకానికి ప్రసాదించిన విష్ణు సహస్రనామ స్తోత్రము. ఈ రెండింటిలో మొదటి దానిని శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశం చేసి సంజయుని ద్వారా లోకానికి అందించాండు.రెండవ దానిని భారత సంగ్రామానంతరం అంపశయ్యపై ఉన్న భీష్మపితామహుని ద్వారా శ్రీకృష్ణ పరమాత్మ పాండవులకు ఉపదేశం చేయిస్తూ లోకాన్ని తరింపచేసాడు. వీటిల్లో భగవద్గీత కంటే విష్ణు సహస్ర నామ స్తోత్రం వల్లనే సులభంగా తరించవచ్చన్నది శ్రీ కృష్ణుని మాట .
విష్ణు సహస్రనామంలో 108 శ్లోకాలున్నాయి. భారతీయ జ్యోతిష శాస్త్ర ప్రకారం మనకు ఉన్న నక్షత్రాలు 27. ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయి.అంటే 27 నక్షత్రాలు 4 చే భాగిస్తే వచ్చేది 108 ఒక్కొక్క నక్షత్రానికి 4 శ్లోకాలు చొప్పున కేటాయిస్తే 108 పాదాలకు 108 శ్లోకాలు అవుతాయి.
సమస్త మానవాళిని ఉద్ధరించడానికి పుట్టిందే విష్ణు సహస్రనామం. దీనిని అందరూ పారాయణం చేయవచ్చు. విష్ణు సహస్రనామ పారాయణానికి ఎలాంటి నియమాలు లేవు. విష్ణు సహస్రనామాలను భీష్మపితామహుడు పాండవులకు చేసిన మహోపదేశం. కురుక్షేత మహాసంగ్రామం ముగిసిన తర్వాత భీష్ముడు అంపశయ్యపై ఉన్నాడు. సుమారు నెల రోజులు గడిచిపోయిన తర్వాత ఒకనాడు పాండవులతో మాట్లాడుతూ శ్రీకృష్ణుడి హఠాత్తుగా మధ్యలో ఆపేశాడు. పాండవులు కంగారుపడి ఏమైంది అని శ్రీకృష్ణుడిని అడిగారు.
దీనికి కృష్ణుడు ‘మాంధ్యాతి భగవాన్ భీష్మః తపోమే తద్గతం మనః’కురుక్షేత్రంలో అంపశయ్యపై పవళించి ఉన్న భీష్ముడు నన్ను స్మరించుకుంటున్నాడు.. అందుకే నామనస్సు అక్కడికి మళ్లింది. పాండవులారా బయలుదేరండి అక్కడకు మనం వెళ్దాం.. భీష్ముడు ఆస్తికాగ్రేసరుడు, ధర్మాలను అవపోశణం పట్టినవాడు అని చెప్పి వారిని వెంటబెట్టుకుని వెళ్లాడు. ఈ సమయంలోనే శ్రీకృష్ణుని భీష్ముడు స్తుతిస్తూ విష్ణు సహస్రనామాలను ఉపదేశం చేశాడు.
ఈ స్తోత్ర పారాయణం సకల వాంఛితార్థ ఫలదాయకమని నమ్మకం. స్తోత్రం ఉత్తర పీఠిక (ఫలశ్రుతి) లో ఈ శ్లోకం ‘ధర్మార్థులకు ధర్మం, అర్థార్థులకు అర్థం, కామార్థులకు కామం, ప్రజార్థులకు ప్రజను ప్రసాదించును’ అని పేర్కొన్నారు.
దివ్య కేశవ కీర్తనను వినేవారికి, చదివే వారికి ఏవిధమైన అశుభాలు ఉండవు. వర్ణాశ్రమ ధర్మాలని అనుసరించి ఆయా వర్ణాల వారికి వేదవిద్య, గోవులు, విజయం, ధనం, సుఖం లభిస్తుంది. ధర్మం కోరుకువారికి ధర్మం, ధనం కోరుకున్నవారికి ధనం లభిస్తుంది. భక్తితో వాసుదేవుని నామాలను కీర్తించేవారికి కీర్తి, శ్రేయస్సు దక్కి వారి రోగాలను హరిస్తుంది.
నామం అందరూ చెప్పవచ్చు. మంత్రజపం చేసేవారు స్థాణువులాగా ఉండి చేయాలి. కానీ నామం మాత్రం అటూ ఇటూ తిరుగుతూ, నిలబడి, కూర్చొని, పనిచేసుకుంటూ చేయవచ్చు. స్వప్న, సుషుప్తులకు అధిదేవత పరమశివుడు. కాబట్టి రాత్రి నిద్రపోయే ముందు పదకొండుసార్లు శివనామం స్మరించాలి. జాగృతికి అధిదేవత శ్రీ మహావిష్ణువు. అందువల్ల ఉదయం లేస్తూనే శ్రీహరీ శ్రీహరీ శ్రీహరీ అంటూ పదకొండుసార్లు స్మరించాలని పండితులు ఉవాచ.
శాస్త్రంలో మంచం మీద పడుకొని ఏది చేయడాన్నీ అంగీకరించదు. విష్ణు సహస్రనామానికి ఆ నిబంధన లేదు. ఏకవస్త్రగా ఉన్న ద్రౌపదికి రక్షణ కల్పించింది శ్రీమహావిష్ణువు ప్రార్థన. అనారోగ్యంతో ఉన్న వ్యక్తి మంచం మీద ఔషధం కూడా సేవించకూడదు. గజేంద్ర మోక్షం ఉదయం లేవగానే ఎవరు భావన చేస్తారో దుస్స్వప్న ఫలితాలు తొలగిపోతాయి. కానీ మంచంమీద నుంచి లేస్తూనే విష్ణు సహస్రనామం చదవాలని ఉంటే చక్కగా చదువుకోవచ్చు. నిబంధనలు లేవు.
‘దుఃస్వప్నే స్మర గోవిందం సంకటే మధుసూదనమ్! కాననే నారసింహం చ పావకే జల శాయినమ్!!’ బుధ గ్రహం బలహీనంగా ఉండి నీచ క్షేత్రం ఉంటే సమస్యలు ఎదురైనప్పుడు విష్ణు సహస్రనామాలు పటించడం వల్ల ఉత్తమ ఫలితాలు పొందుతారని శాస్త్ర వచనం
జయవర్థన్ జగన్నాటి గారి పోస్టు నుండీ ధన్యవాదాలతో .