Online Puja Services

విష్ణు సహస్రనామం విశిష్టత - Part 2

18.118.140.120

విష్ణు సహస్రనామం విశిష్టత

ఆర్ధిక ఇబ్బందులను దూరం చేయాలన్నా..
పిల్లలు మనమాట వినాలన్నా..(ఎంతవయసు వచ్చినా సరే) ఈ స్తోత్రం పఠించాల్సిందే..!

సమస్త మానవాళి ఉద్ధరింపబడడానికి వచ్చినది విష్ణు సహస్రనామము. 
ఇది అందరూ చేయవచ్చు. 

ఏదైనా కామ్యము కొరకు పారాయణగా చేసేవారు పూర్వోత్తర పీఠికలు చదవాలి. 

కాసేపు కూర్చొని విష్ణు సహస్రనామం చదువుకుందాం, 
భగవంతుని నామం చెప్పుకుంటాను అనుకునే వారికి అవి అవసరం లేదు. 

ఆనంద భారతీ తీర్థ స్వామిగా పిలువబడే మల్లాది దక్షిణామూర్తిగారు వారే ఈ విషయాన్ని తెలియజేశారు. 

నామము అందరూ చెప్పవచ్చు. 
మంత్రజపం చేసేవారు స్థాణువులాగా ఉండి చేయాలి. కానీ నామం మాత్రం అటూ ఇటూ తిరుగుతూ, నిలబడి, కూర్చొని, పనిచేసుకుంటూ చేయవచ్చు. 

స్వప్న, సుషుప్తులకు అధిదేవత పరమశివుడు. అందుకని రాత్రి నిద్రపోయేముందు మూడు మార్లు శివనామం చెప్పి పడుకోవాలి. 

జాగృతికి అధిదేవత శ్రీ మహావిష్ణువు. 
అందువల్ల ఉదయం లేస్తూనే శ్రీహరీ శ్రీహరీ శ్రీహరీ అంటూ లేవాలి. 

శాస్త్రంలో మంచంమీద పడుకొని ఏది చేయడాన్నీ అంగీకరించదు. 
విష్ణు సహస్రనామానికి ఆ నిబంధన లేదు. 

ఏకవస్త్రగా ఉన్న ద్రౌపదికి రక్షణ కల్పించింది శ్రీమహావిష్ణువు ప్రార్థన. 
అనారోగ్యంతో ఉన్న వ్యక్తి మంచంమీద ఔషధం కూడా సేవించకూడదు. 
గజేంద్ర మోక్షం ఉదయం లేవగానే ఎవరు భావన చేస్తారో దుస్స్వప్న ఫలితాలు తొలగిపోతాయి. 
కానీ మంచంమీద నుంచి లేస్తూనే విష్ణు సహస్రనామం చదవాలని ఉంటే చక్కగా చదువుకోవచ్చు. నిబంధనలు లేవు.

దుఃస్వప్నే స్మర గోవిందం సంకటే మధుసూదనమ్!
కాననే నారసింహం చ పావకే జల శాయినమ్!!

విష్ణు సహస్ర నామాన్ని ఎవరు పట్టుకుంటారో ఇహమునందు రక్షణ.
పరమునందు పరమేశ్వరుని చేరుకొనే మార్గము సుగమం అవుతుంది. 

శంకరులకు ఒకసారి సరస్వతీదేవి సాక్షాత్కరించి
కలి ఉద్ధతి పెరిగిపోయిన రోజులలో లోకాన్ని రక్షించగలిగిన అద్భుతమైన సహస్రనామ స్తోత్రం విష్ణు సహస్రనామ స్తోత్రమే. 
అది సంజీవనీ ఓషధి వంటిది. 
కాబట్టి నీవు దీనికి భాష్యం వ్రాయాలి. అని పలికింది. విష్ణు సహస్రనామానికి శంకరులు భాష్యం చెప్పారు. ఆతరువాత ఉత్తరభారతదేశంలో దానిని రామస్వామి వారు వ్రాశారు.

భీష్మాచార్యుల అనుశాసనమే విష్ణు సహస్ర 
నామ స్తోత్రం. 

ఆచార్యుడైన భీష్ముడు చెప్తుండగా ఆచార్యులకే ఆచార్యుడైన శ్రీకృష్ణు పరమాత్మ వింటూండగా వచ్చి, మరొక గురువైన శంకర భగవత్పాదులచే భాష్యాన్ని పొంది విష్ణు సహస్రనామం త్రివేణీ సంగమం అయింది. 

విష్ణు సహస్రనామం చదవడం అంటే పరమేశ్వరుని చేరుకొనే మార్గంలో ప్రయాణం చేయడం. 

భగవంతునికి సహస్ర నామాలతో పూజ చేయాలి. కుదరని పక్షంలో 108 నామాలతో చేయాలి. 
108 రక్షణ హేతువు. 
గురువుకు 116 పేర్లతో పూజ చేయాలి. 

లోకంలో ఏప్రాణియైనా 27 నక్షత్రములలో పుడుతుంది. 
ఒక్కొక్క దానికి నాలుగు పాదాలు. 27 X 4 = 108. 

పూజకు సమయంలేనప్పుడు..
కేశవ, 
మాధవ, 
నారాయణ, 
గోవింద, 
మధుసూదన, 
విష్ణు, 
త్రివిక్రమ. 
వామన, 
శ్రీధర, 
హృషీకేశ, 
పద్మనాభ, 
దామోదర 
అనే ఈ పన్నెండు నామాలతో చేస్తే పూర్తి అవుతుంది. 

అలా అని ఆలస్యంగా లేవమని కాదు. 

ఈనామాలు చెప్తూ విష్ణు భక్తులు ఊర్ధ్వపుండ్రములను ధరిస్తారు. 

- సేకరణ 
సబ్బినేని నాగ మల్లేశ్వర రావు 

విష్ణుసహస్ర నామ స్తోత్రం విశిష్టత - Part 1 కోసం క్లిక్ చేయండి. 

Quote of the day

Beauty is truth's smile when she beholds her own face in a perfect mirror.…

__________Rabindranath Tagore