Online Puja Services

కల్కి అవతారం ఎప్పుడు వస్తుంది

18.222.132.108

కల్కి అవతారం ఎప్పుడు వస్తుంది ............!!

కృతయుగం నుండి ఇప్పటివరకు శ్రీమహావిష్ణువు తొమ్మిది అవతారాలు ఎత్తడం జరిగినది. 
కృష్ణావతారం తరువాత కావలసిన రావలసిన అవతారం కల్కి అవతారం దశావతారములలో ఇది ఒకటి. కల్కిఅవతారం రాలేదు కానీ వ్యాస వాక్కు ప్రమాణం.వ్యాసుడు చెప్పాడు కాబట్టి ప్రమాణం. 

పదవ అవతారమైన కల్కి అవతారం ఎప్పుడు వస్తుందో వ్యాసభగవానుడు చెప్పాడు.

1. అసలు ఎక్కడా స్వాహాకారము శత్కారము ఇవి రెండూ కనబడవు అంటే ఇక యజ్ఞ యాగములు ఉండవు.

2. గోవులు విశేషంగా వదింపబడి గో మాంసం తినడం లోకం లో ప్రారంభం అవుతుంది. 

3. వివాహ వ్యవస్థ నిలబడదు

4. తల్లిదండ్రులను చూసే బిడ్డలు ఉండరు

5. భర్తను గౌరవించే భార్య భార్యను గౌరవించే భర్తను చూసే వాళ్లు లోకంలో ఉండరు

6. పురుషుల యొక్క ఆయుర్దాయం 18 సంవత్సర
ములకే పడిపోతుంది

7.స్త్రీలు కేశపాశము లు విరబోసుకుని తిరగడం లోకంలో పెద్ద విశేషం అయిపోయి జడ వేసుకునే సంప్రదాయం విచ్ఛిన్నమవుతుంది

8. పురుషులు 18 సంవత్సరముల కే మరణించడం ప్రారంభం అయిపోయి ఆయుర్థాలు క్షీణించిన తరువాత ఆ సమయంలో " శంభాలా " అనేటువంటి గ్రామంలో విష్ణు యేశుడు అనే బ్రాహ్మణ కడుపున కల్కి పేరుతో శ్రీ మహావిష్ణువు 10 వ అవతారంగా వస్తాడు

9. అది ఎప్పుడూ అంటే కలియుగం చివర్లో కృతయుగానికి ప్రారంభానికి మధ్యలో ఆయన అవతరించడానికి గుర్తు పాపుల అందరికీ భంగకర వ్యాధి వస్తుంది

10. ఆసనము నందు పుండ్లు పుట్టి నెత్తురు కారిపోతుంది .కారిపోయి వాళ్లకు వాళ్లే పురుగులు రాలినట్టు రాలి పోతారు

11. ఎక్కడ చూసినా వ్యాధులు ప్రబలుతాయి

12. పరమ పుణ్యాత్ములు అయినటువంటి వారు ఎవరున్నారో వాళ్లు మాత్రమే శరీరాలతో ఉంటారు

13. ఆయన "శ్వేతాశ్వాన్ని " ఎక్కి కాషాయ పతాకాన్ని చేతిలో పట్టుకుని అధర్మంతో మిగిలిపోయినటువంటి బలవంతులైన రాజులు ఆక్రమించినటువంటి వాళ్ళు అధికారానికి తగినటువంటి వాళ్ళు అర్హత లేకపోయినా సింహాసనం మీద కూర్చున్న పరిపాలన చేసే వాళ్లందరినీ దునుమాడుతాడు

14. తరువాత కలియుగం పూర్తి అవుతుంది తరువాత కృత యుగం ప్రారంభం అవ్వడానికి జల ప్రళయం సంభవించి నీళ్లతో భూమండలాన్ని ముంచెత్తుతుంది 

15.ప్రతి కలియుగం చిట్టచివర్లో వచ్చే అవతారం కల్కి అవతారం.

16. కానీ కల్కి అవతారాన్ని ఒక్కసారి స్మరించిన నమస్కరించిన పాపబుద్ధి పోతుంది

17 అంత గొప్ప అవతారం కల్కి అవతారం

ఓం నమో నారాయణాయ నమః ....

Quote of the day

The life ahead can only be glorious if you learn to live in total harmony with the Lord.…

__________Sai Baba