కల్కి పురుషుడు
కల్కి పురుషుడు
శంభాల నగరం నుండి కల్కి రావడం గురించి మీరు విన్నారా అసలు శంభాల ఎలా వెళ్ళగలం
కల్కి కలియుగం అంతమయ్యే సమయంలో సుమతి అనే ఒకావిడ గర్భంలో జన్మిస్తాడు.కల్కి పుట్టడానికి కొన్ని గంటల ముందే సుమతి భర్త మరణిస్తాడు.కల్కి పుట్టిన కొన్ని గంటలకే తల్లి సుమతి కూడా చనిపోతుంది.అప్పుడు పరుశురాముడు కల్కిని ఒక గృహంలోకి తీసుకెళ్ళి తనకి అక్కడే వేదాలు, విద్యలు నేర్పిస్తాడు.తరువాత శంభాల పంపిస్తాడు. ఎప్పుడైతే కలియుగ అంతంలో ఎవ్వరైతే ధర్మాన్ని పూర్తిగా వొదిలేస్తారో అప్పుడు తన అద్భుత ఖడ్గంతో తన వీరుల సైన్యంతో తెల్లని గుర్రంపై కల్కి శంభాల నుండి వచ్చి ధర్మం వైపు లేనివారందరిని చంపి ధర్మసంస్థాపన చేస్తాడు.ఈ విషయం గురించి భాగవతంలోని 12వ కాండం 2వ అధ్యాయం 18వ వచనంలో ఉంది,కల్కిపురానంలోని 2వ అధ్యాయం 12వ వచనంలోనూ ఉంది.
అసలు శంభాల నగరం ఎక్కడుంది
శంభాల అనేది నగరం కాదు అది ఒక ముల్టి డైమెన్షనల్ కింగ్ డమ్ .అక్కడ ఉండేవారందరు శారీరకంగా మరియు మానసికంగా పరిపూర్ణతను కలిగి ఉంటారు.ఎలాంటి రోగాలు రావు. అందంగా ఉంటారు.వాళ్ళు 3500 సంవత్సారాలు జీవిస్తారు.మన పురాణాలలో చిరంజీవులు ఇంకా అక్కడే ఉన్నారు.అక్కడ ఉండే వారు అత్యంత మేధా సంపన్నులు వారు కాల ప్రయాణం(time travel) చేయగలరు.వాళ్ళకి సాధ్యం కానిది లేనేలేదు.
ఈ అద్భుత సామ్రాజ్యానికి ఎలా వెళ్ళడం
శంభాల సాధారణ మానవులకి కనబడదు. ఎవ్వరైతె వాళ్ళ చక్రాలను ఆక్టివేట్ చేసి వేరే డైమెన్షన్స్ వెళ్లగలరో వాళ్ళు శంభాల సామ్రాజ్యాన్ని చూడగలరు.మన బాడీలో శత్చక్రాలు అని ఏడు చక్రాలు ఉంటాయి.మన బాడీలోని చక్రాలను మనం ఆక్టివేట్ చేయగలిగితే మనం వేరే డైమెన్షన్స్ వెళ్ళగలము.ఒకేసారి మనం రెండు అంతకంటే ఎక్కువ ప్రాంతాల్లో ఉండగలం భూమి చుట్టూ నిమిషంలో తిరిగి రాగలం ,కాలంతో ప్రయాణం చేయగలం.దీని కోసమే చాలా మంది ఋషులు ,బాబాలు హిమాలయాలకి వెళ్లి సాధన చేస్తుంటారు.
శంభాల వెళ్ళడానికి ఎవ్వరూ ప్రయత్నించలేదు
వేల సంవత్సరాల నుండి కొని లక్షల మంది ప్రయత్నించారు.వారిలో హిట్లర్,alexander లు కూడా ఉనారు.ఎంతో మంది శంభాల చూసి తిరిగి వచ్చామని చెప్పారు.ఇది కేవలం వాళ్ళ సత్ఛక్రాలు ఆక్టివేట్ చేసి మాత్రమే వెళ్ళగలిగారు.
ప్రతీ మతంలోనూ ప్రపంచం అంతమయ్యే సమయానికి ఒకరు వచ్చి ధర్మాన్ని కాపాడి శాంతి స్థాపన చేస్తారు అని ఉంది.అలాగే హిందువుల్లో కల్కి వస్తాడు అని ఉంది.మనుషుల్లో ఎప్పుడైతే మంచితనం,దయా గుణం,ధర్మం కనుమరుగు అవుతాయో అప్పుడు కల్కి వచ్చి అధర్మం వైపు ఉన్న వారందరినీ భూమి మీద లేకుండా చేసి ధర్మాన్ని ప్రసాదిస్తాడు.అప్పటి నుండి సత్యయుగం మొదలవుతుంది.