Online Puja Services

లక్ష్య సిద్ధి కోసం హనుమంతునికి ప్రదక్షిణాలు చేయండి .

3.139.236.93

లక్ష్య సిద్ధి కోసం హనుమంతునికి ప్రదక్షిణాలు చేయండి .
- లక్ష్మి రమణ  

హనుమంతునికి ప్రదక్షిణాలు చేస్తే, గ్రహదోషాలు నివృత్తి అవుతాయి . శనిదోషం ప్రభావం నుండీ ఉపశమనం కలుగుతుంది . దుష్టగ్రహాల పీడ నుండీ విముక్తి లభిస్తుంది . ఆరోగ్యం చేకూరుతుంది .  ఆ స్వామికిప్రదక్షిణాలు చేసేందుకు ఒక విధానం ఉంది .  దానిని పాటించడం అవసరం . అదేవిధంగా  మంగళవారం నాడు , శనివారం నాడు ఆ స్వామిని అర్చించడం వలన కూడా ఇటువంటి సమస్యలు తొలగిపోతాయి .  ఆ విధానం ఇక్కడ తెలుసుకుందాం .

హనుమంతుడు పంచముఖాలతో పంచముఖ ఆంజనేయునిగా ఉన్నప్పుడు ఆయన రూపాన్ని పరిశీలించారా ? పంచభూతాలనూ తనలో నిక్షిప్తం చేసుకున్న దివ్య స్వరూపం ఇది . మహా శక్తి సమన్వితం .  ఈ ఐదు స్వరూపాలలో ఆంజనేయుని - వానరవదనంతో పాటు , ఉగ్రనారసింహుని - సింహవదనం , గరుక్మంతుని - గరుడవదనం , వరాహుని - వరాహవదనం, హయగ్రీవుని - హయవదనం  ఉంటాయి. ఈ ఐదు ముఖములతోటీ ఒకేసారి అగ్నిజ్వాలలని వదులుతూ దుష్ట సంహారం చేస్తారు రుద్రాంశ సంభూతులైన హనుమంతులవారు .  ఆయనకీ పంచ సంఖ్య ప్రీతికరం . ఐదు ప్రదక్షిణాలు చేస్తే, ఈ అపరావతారంలో మన వెంటే ఉండి  రక్షణ కల్పిస్తారు హనుమ . 

'ప్రదక్షిణనమస్కారాన్ సాష్టాంగాన్ పంచ సంఖ్యాయా' అని ఆర్షవాక్యం. అందువల్ల ఆయనకీ పంచ సంఖ్యలో ప్రదక్షణలు చేయాలి . ముందుగానే చెప్పుకున్నట్టు , సకల రోగ, భూత,ప్రేత, పిశాచాది భాధలు తొలగిపోయి అభీష్టాలు సిద్ధించడానికి ఈ ప్రదక్షిణాలు చేయవచ్చు . సంతానం లేనివారికి ఆంజనేయస్వామి అనుగ్రహంతో పిల్లలు కలుగుతారు . అటువంటి అభిలాష ఉన్నవారు కూడా ప్రదక్షిణాలు చేయొచ్చు .  

ప్రదక్షిణాలు చేసేప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయాలు  : 

ప్రతి ప్రదక్షిణ మొదలుపెట్టేప్పుడు 

‘ఆంజనేయం మహావీరం ! బ్రహ్మ విష్ణు శివాత్మకం !
తరుణార్క ప్రభం శాంతం రామదూతం నమామ్యహం !'

అని నమస్కారం చేసుకొని అడుగు సాగించాలి. ప్రతి ప్రదక్షిణానికీ మొదట ఇలా చెప్పుకోవాలి . 

 మనం అనుకుకొంటున్న లక్ష్య సిద్ధికి ఇలా హనుమంతునికి ఒకే రోజు 108 ప్రదక్షిణాలు చేయవచ్చు . లేదా 54 చేయవచ్చు . 
27 ప్రదక్షిణములు చేయాలి. అది కూడా చేయలేము  అనుకుంటే, 15 లేదా ఐదు ప్రదక్షిణాలు కూడా చేయవచ్చు . 

ఇలా ఒక అదే సంఖ్యలో రోజులను కూడా లెక్కించుకొని ఆప్రకారం చేయవచ్చు . ఉదాహరణకి రోజుకి ఐదు ప్రదక్షిణాలు పదిహేను రోజులపాటు చేస్తానని స్వామికి ముందుగానే చెప్పుకొని , ఆ విధంగా చేయవచ్చు . 

ప్రదక్షిణాలని లెక్కించడానికి పుష్పములు, వక్కలు, పసుపు కొమ్ములు వంటి వాటిని వాడటం మంచిది.

ప్రదక్షిణాలు చేసేప్పుడు చేసే సంఖ్య మీద దృష్టి పెట్టడం మంచిది కాదు .  అందువల్ల పైన చెప్పిన వస్తువుల సాయంతో లెక్క పెట్టుకొంటూ, మనసుని హనుమ మీద నిలపండి . 

ప్రదక్షిణలు త్వరగా అయిపోవాలనే ఆత్రంతో పరిగెత్తినట్టు చేయకూడదు.   నెమ్మదిగా,నమ్రతగా, అంజలి ఘటించి చేయాలి . 

‘ మర్కటేశ మహోత్సాహ సర్వాపద నివారణా 
శత్రూన్ సంహారమాం రక్షయం దాపయమే  ప్రభో’
 అని  ప్రదక్షణ సమయంలో చదువుకోవడం మరింత మంచిది . 

అ ఆంజనేయుని కృపతో మీ లక్ష్యము సిద్దిన్చుగాక !! శుభం . 

#hanuman #pradakshina

Tags: hanuman, anjaneya, pradakshina,

Quote of the day

The weak can never forgive. Forgiveness is the attribute of the strong.…

__________Mahatma Gandhi