హనుమంతుడి కోసం 41 రోజుల దీక్ష

వివిధ సమస్యలకు హనుమత్ ఆరాధన విధి విధానాలు.......!!
హనుమంతుని 9 అవతారాలు.....
ఏ దైవమైనా ముఖ్యంగా రెండు ప్రయోజనాల కోసం అవతారా లెత్తడం జరుగుతుంది.
అదే విషయం భగవద్గీతలో కృష్ణ భగవానుడు
‘పరిత్రాణాయ సాధూనాం – వినాశాయ చ దుష్కృతాం |
ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగేయుగే ||’
అని చెప్పాడు.
అలాగే హనుమంతుడు కూడా ఆ దుష్టశిక్షణ, శిష్టరక్షణ అనే రెండు ముఖ్య ప్రయోజనాలకోసమే తొమ్మిది అవతారాలెత్తాడు.
వానినే హనుమన్నవావతారాలంటారు......
1.ప్రసన్నాంజనేయస్వామి అవతారం, 2.వీరాంజనేయస్వామి,
3.వింశతి భుజానేంజనేయస్వామి, 4.పంచముఖాంజనేయస్వామి, 5.అష్టాదశభుజాంజనేయస్వామి, 6.సువర్చలాంజనేయస్వామి, 7.చతుర్భుజాంజనేయస్వామి, 8.ద్వాత్రింశద్భుజాంజనేయస్వామి,
9.వానరాకార ఆంజనేయస్వామిఅవతారం.
అలాగే హనుమంతునకు సంబంధించిన పుణ్య స్థావరాలు కూడా పదమూడు ఉన్నాయి...
వాటినే హనుమత్పీఠాలంటారు...
అవి 1. కుండినగరం, 2. శ్రీ భద్రము, 3. కుశతర్పణము, 4. పంపాతీరం, 5. చంద్రకోణం, 6. కాంభోజం, 7. గంధమాదనం, 8. బ్రహ్మావర్తపురం, 9. బార్హస్పత్యపురం, 10. మాహిష్మతీపురం, 11. నైమిశారణ్యం, 12. సుందరీనగరం, 13. శ్రీ హనుమత్పురము – అనేవి.
ఆంజనేయస్వామికి 41 రోజులు నియమంగా చేయాలి....
1. అనారోగ్య సమస్యలు బాధిస్తున్నప్పుడు
ఆవనూనెతో దీపారాధన – ఆరోగ్యం.
2. ఉపద్రవాలు ఆటంకాలు తొలగడానికి
గోధుమలు, తెల్ల నువ్వులు, మినుములు, పెసలు, బియ్యం – ఈ ఐదింటిని పిండి చేసి, దీపప్రమిదగా చేసి, అందులో నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి.
3. పెళ్ళి చూపుల్లో ఆకర్షణ ఏర్పడి వివాహం కావడానికి
బియ్యపు పిండి ప్రమిదలో నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి.
4. శని వల్ల వచ్చే దోషాలు, తీవ్రమైన కష్టాలు, గాలిధూళి దోషాలు తొలగడానికి, నల్ల నువ్వుల పిండి ప్రమిదలో నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి.
5. కోరికలు నెరవేరేందుకు బియ్యపు పిండి, గోధుమ పిండి సమపాళ్ళలో కలిపిన ప్రమిదలో దీపారాధన చేయాలి.
6. భార్యాభర్తల మధ్య అన్యోన్యత నిలవడానికి
కందిపిండితో చేసిన ప్రమిదలో దీపారాధన చేయాలి.
7. దృష్టి దోషాలు పోయి, శత్రువుల మీద విజయం సాధించడానికి పొట్టు తీయని మినుముల పిండి ప్రమిదలో దీపారాధన చేయాలి.
8. వివాహం కాని వారికి వివాహం అయ్యేందుకు
ఏలకులు, లవంగాలు, పచ్చకర్పూరం, కస్తూరి, నువ్వుల నూనెలో కలిపి, దాంతో దీపారాధన చేయాలి.
గమనిక : – ఈ పరిహారాల్లో దేన్నైనా.......
ఆంజనేయస్వామికి 41 రోజులు నియమంగా చేయాలి. స్త్రీలు మధ్యలో విరామం ఇచ్చి తిరిగి ప్రారంభించి 41 రోజులు పూర్తి చేయవచ్చు.
హనుమంతుడిని పూజించేవారికి శనీశ్వరునిచే ఏర్పడే ఈతిబాధలు పూర్తిగా తొలగిపోతాయని పురోహితులు చెబుతున్నారు. కాబట్టి శనివారం నాడు, లేదా అమావాస్య తిథిల్లో హనుమంతునికి నేతితో దీపమెలిగించే వారికి సకల సంపదలు చేకూరుతాయని విశ్వాసం.
ఇంకా రావణుడి చెరలో ఉన్న నవగ్రహాలను తప్పించిన కారణంగా హనుమంతునికి శనీశ్వరుడు ఓ వరం ఇచ్చాడని, ఆ వర ప్రభావంతో ఏలినాటి శని ప్రభావంలో ఉన్న జాతకులు హనుమంతుని స్తుతిస్తే.. వారికి శనిగ్రహంచే ఏర్పడాల్సిన ఈతిబాధలు, సమస్యలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి.