పూనుగు పిల్లి ప్రత్యేకత
తిరుమల లో శుక్రవారం అభిషేకం విశేషం పూనుగు పిల్లి ప్రత్యేకత...
ఓం నమో వేంకటేశాయ
అత్యంత అరుదుగా లభించే సుగంధ ద్రవ్యాలకు కారకుడు శుక్రగ్రహం.
1) పునుగు, 2) జవ్వాది, 3) కస్తూరి
4) గోరోచనం
మొదలగు సుగంధద్రవ్యాలు శుక్రగ్రహ కారకత్వాన్ని తెలియజేస్తాయి.
జాతకంలో శుక్రగ్రహ దోషాలు ఉన్నవారు పునుగుపిల్లితైలం తో అభిషేకం చేస్తే శుక్రగ్రహ దోష నివారణ జరుగుతుంది.
శ్రీవారిసేవలో:- తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి ప్రతి శుక్రవారం అభిషేకం తరువాత కాస్తంత పునుగు తైలాన్ని విగ్రహానికి పులుముతారు.
" అత్తరు పన్నీరు పునుగు జవాదీ తోడ ముడుపు తెస్తున్నారు మేలుకో " అంటాడు శ్రీఅన్నమాచార్య.
పదకవితా పితామహుడు తాళ్ళపాక శ్రీ అన్నమాచార్యులు , తరిగొండ శ్రీవెంగమాంబ
కలియుగప్రత్యక్షదైవం శ్రీవేంకటేశ్వరస్వామి వారి పై వేలు, వందలు సంకీర్తనలు రచించి " శ్రీవారి " అనుగ్రహం పొందగలిగారు.
అయితే ఏ కళలూ తెలియని నోరులేని మూగజీవి " పునుగుపిల్లి " ఏ అదృష్టం చేసుకుందో......
.ఎన్ని జన్మల పూజా ఫలమో తెలియదు కాని ఈ అరుదైన జీవికి మరొకరికి సాధ్యం కాని అరుదైన సేవాభావం కలిగింది.
శ్రీ ఏడుకొండలస్వామివారి మూలవిగ్రహానికి ఈ " పునుగుపిల్లి " శరీరం నుంచి స్రవించే ద్రవాన్ని పూస్తేనే శుక్రవారపు అభిషేకం పూర్తవుతుంది.
శ్రీస్వామివారి విగ్రహం శతాబ్దాలుగా నల్లగా నిగనిగలాడుతుండడానికి, ఏ మాత్రం చెక్కు చెదరకుండా ఉండడానికి ఈ పునుగుతైలమే ప్రధాన కారణమని అర్చకుల నమ్మకం.
ఇంతటి విశిష్టతను సంతరించుకున్న ఈ పునుగుపిల్లి అత్యంత అరుదైనది.
పునుగుపిల్లితైలం తీసే విధానంలో ప్రత్యేకత ఉంది.
ఇనుప జల్లెడలోని గదిలో పిల్లిని ఉంచుతారు. ఇనుపజల్లెడ గది పై భాగంలో రంథ్రం ఏర్పాటు చేస్తారు. రంథ్రం ద్వారా చందనపుకర్రను గదిలోకి నిలబెడతారు. 2సంవత్సరాల వయస్సు అనంతరం ప్రతి 10రోజులకు ఒకసారి హావభావాలను ప్రదర్శిస్తూ చందనపుకర్రకు చర్మాన్ని పిల్లి రుద్దుతుంది.
ఆ సమయంలో చర్మం ద్వారా వెలువడే పదార్థమే పునుగుతైలం.
తైలాన్ని సుగంధ పరిమళాలతో చూర్ణం చేసి మూలవర్లుకు అభిషేకం చేస్తారు.
ఇలా చేయడం ద్వారా " శ్రీవారు " శాంతపడుతారని అర్చకులు చెబుతున్నారు.
నిదర్శనం:- పునుగుపిల్లి అంతరించి పోయింది అని అర్చకులు బాధపడుతున్న సమయంలో ఎక్కడ నుండో శ్రీగరడురాజు తన కాళ్ళతో తీసుకుని వచ్చి వేంకటాద్రికొండ పై వదిలాడు. అది చూసిన అర్చకులు ఆ దేవదేవుడు నిత్యం తిరుమలగిరిపై కొలువై ఉన్నారని నమ్మి, దేవదేవుని సహస్రనామాలతో అర్చిస్తున్నారు.
శుక్రవారఅభిషేక ప్రియ.. గోవిందా
మార్జాల కిశోర న్యాయ సంవిధాత.. గోవిందా
ఓం నమో వేంకటేశాయ.
- Sri Rama Charitha Manas