Online Puja Services

శ్రీవారు మూడునామాల వాడిగా ప్రసిద్ధి చెందడానికి కారణమేంటి!

3.136.19.203

శ్రీవారిని తలచుకోగానే ముందుగా అందరికీ గుర్తొచ్చేది ఏడుకొండలు, మూడు నామాలు. మూడునామాలు శ్రీవారి రూపుకే ప్రత్యేకంగా కనిపిస్తాయి...

ఈ మూడునామాలను తిరుమల కొండపై పెద్దగా కనిపించేలా ఏర్పరచారు. ఏడుకొండలకు నడక దారిన వెళ్లేటప్పుడు కూడా మూడు నామాల కొండ ఉంటుంది. అది దిగువనున్న తిరుపతికి కూడా కనబడుతుంది..

శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతి ఫోటోలోనూ మూడు నామాలే ప్రత్యేకంగా కనిపిస్తాయి.

అసలు శ్రీవారికి ఈ మూడు నామాలు ఎందుకు ప్రత్యేకం ?
మూడు నామాలే ఎందుకు అలంకరిస్తారు ?
మూడునామాల వాడిగా ప్రసిద్ధ చెందడానికి కారణమేంటి ?

సాక్షాత్తూ ఆ శ్రీ మహావిష్ణువు ధరించి, మనుషులు కూడా ధరించాలని చెప్పినవే మూడు నామాలు. ఈ నామాలు అజ్ఙానాన్ని, కర్మను ఖండిస్తాయని వివరిస్తాయి. మొదటిసారి రామానుజాచార్యులు స్వయంగా తన స్వహస్తాలతో శ్రీవారికి మూడు నామాలు అలంకరించారట.

అలా....

శ్రీనివాసుడికి తిరునామాలు అలంకరించడం ఆనవాయితీగా మారింది. శ్రీవారికి ప్రతి శుక్రవారం అభిషేకం తర్వాత 16 తులాల పచ్చ కర్పూరం, ఒకటిన్నర తులం కస్తూరితో మూడు నామాలు అలంకరిస్తారు. అవి మళ్లీ గురువారం వరకూ అలానే ఉంటాయి. గురువారం స్వామివారి నేత్రాలు కనిపించేలా నామాన్ని కొంతవరకు తగ్గిస్తారు. అంటే ఎప్పుడూ శ్రీవారు కళ్లు నామాలతో మూసి ఉంటారు. శుక్రవారం ఉదయం మాత్రమే అభిషేక సేవ సమయంలో శ్రీవారు మూడు నామాలు లేకుండా భక్తులకు దర్శనమిస్తారు...

ఈ సమయంలో నేత్ర దర్శనం, నిజపాద దర్శనం చేసుకునే అరుదైన, మహత్తరమైన అవకాశం భక్తులకు లభిస్తుంది. శుక్రవారం అభిషేకం తర్వాత మూడు నామాలు అలంకరిస్తే మరలా శుక్రవారం అభిషేకం సమయం వరకు ఈ నామం అలాగే ఉంటుంది. అంటే వారానికి ఒకసారి మాత్రమే శ్రీవారికి మూడు నామాలు దిద్దుతారు. శ్రీవారి మూడు నామాలకు ఉపయోగించే తెలుపు, ఎరుపు బొట్టు వెనక చాలా పరమార్థం ఉంది. తెలుపు నామాలు సత్వగుణాన్ని తెలియజేస్తాయి. సత్వగుణం మనల్ని ఉన్నత స్థితికి తీసుకెళ్తుందని సూచించేది నిలువు బొట్టు. ఇక ఎరుపు రంగు అనురాగానికి ప్రతీక. అంటే ఎరుపు లక్ష్మీ స్వరూపం, శుభసూచకం, మంగళకరమైనది. కాబట్టి తెలుపు నామాల మధ్యలో ఎరుపు చూర్ణం ఉపయోగిస్తారు...

శ్రీవారి మూడు నామాలకు మరో అర్థం కూడా ఉంది. వైష్ణవుల్లో వడగలై, తెంగలై అనే రెండు తెగలున్నాయి. వడగలై అనే వాళ్లు యు ఆకారంలో నామం దిద్దుకుంటారు. తెంగలైవారు ఆంగ్ల అక్షరం వై ఆకారంలో తిరునామం దిద్దుకుంటారు. అయితే ఈ రెండు ఆకారాలకు మధ్యస్థంగా తమిళ అక్షరం ప ను పోలి ఉంటుంది. దీన్నే తిరుమణి కావుగా పిలుస్తారు. అలా శ్రీవారికి మూడు నామాలు ప్రత్యేకమైయ్యాయి.

- రాజారెడ్డి వేడిచర్ల 

Quote of the day

A man is born alone and dies alone; and he experiences the good and bad consequences of his karma alone; and he goes alone to hell or the Supreme abode.…

__________Chanakya