ఉసిరికాయల సమర్పణ
ఉసిరికాయల సమర్పణ
వేదాలపైన మంచి పట్టు ఉన్న కృష్ణమూర్తి ఘనాపాటి గారు పరమాచార్య స్వామివారి పరమ భక్తులు. వారు మహాస్వామివారికి కొద్ది దూరములో కూర్చుని వేదం చేదివేవారు. చాలా పెద్దవారు, బహుశా ఇప్పుడు ఎనభై ఐదేళ్ల వయస్సు అయిఉంటుంది. చాలా సంవత్సరాల క్రితం మహాస్వామి సన్నిధిలో వారు సామవేదం చెబుతున్నారు. మహాస్వామి వారు దర్శనానికి వచ్చిన భక్తులను ఆశీర్వదించి ప్రసాదం ఇచ్చి పంపుతున్నారు. స్వామి వారి దర్శనం కోసం చాలా మంది భక్తులు వచ్చారు. వరుసగా కదులుతున్నారు.
ఆ వరుసలో ఒక భక్తుడు చేతిలో ఒక చిన్న సంచితో నిలబడ్డాడు. అతను వంతు రాగానే స్వామికి నమస్కరించి ప్రసాదం తీసుకున్నాడు. అతను ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించగా స్వామివారు ఆపారు. తనకోసం తెచ్చినదాన్ని అక్కడ పెట్టాల్సిందిగా మహాస్వామివారు ఆదేశించారు. అతను ఆశ్చర్యపోయాడు. అతని తోటలోని మొదటి కాపుగా వచ్చిన ఉసిరికాయలను చేతి సంచిలో తీసుకుని వచ్చాడు. అతను కొద్దిగా తడబడుతూ అక్కడున్న ఆపిల్, దానిమ్మ వంటి పళ్ళను చూసి వీటిని మీకు సమర్పించడానికి సిగ్గుపడ్డాను అని చెప్పాడు.
స్వామివారు ఆ ఉసిరికాయలన్నిటిని ఒక వెదురు పళ్ళెంలో పెట్టమన్నారు. వాటిని ఏంతో ఆనందంగా స్వీకరించారు.
ఈ సంఘటనను చూసిన కృష్ణమూర్తి ఘనాపాటి గారు నిశ్చేష్టులయ్యారు. ఆ భక్తుని దగ్గర ఉసిరికాయలు ఉన్నాయని స్వామివారికి ఎలా తెలుసు?
అంతే కాడు ఆరోజు ద్వాదశి కాబట్టి ఆ సమర్పణని ఆనందంగా స్వీకరించారు. బాల శంకరులకి ఒక ఎండిపోయిన ఉసిరికాయను భిక్షగా వేస్తె ఆ పేద బ్రాహ్మణికోసం వారు కనకధార చేసి బంగారు ఉసిరికాయలను కురిపించారు. మరి ఒక పళ్ళెం నిండుగా ఉసిరికాయలను స్వామివారికి సమర్పించిన ఈ భక్తుని అదృష్టం ఎంతటిదో కదా!
--- శ్రీ గణేశ శర్మ, ‘శ్రీ మహాపెరియవ సప్తాహం’
అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।
#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం