Online Puja Services

పిలకలేని కొబ్బరికాయ కొడితే దోషమా?

3.136.23.132

పిలకలేని కొబ్బరికాయ కొడితే దోషమా?

శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాదసేవనం
అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మ నివేదనం॥

అనేవి తొమ్మిది విధాలైన భక్తి మార్గాలు. దీంట్లో చివరిది ఆత్మ నివేదనం. అంటే భగవంతునికి భక్తుడు తనను తాను సమర్పించుకోవడం. పూజ చేసిన తర్వాత కొబ్బరికాయను మన ఆత్మ స్వరూపంగా భావించి, దైవానికి నైవేద్యంగా సమర్పించాలి. 

ఇక్కడ కొబ్బరికాయ మానవ శరీరానికి ప్రతీక. కాయ పైనుండే పొర - చర్మం. పీచు - మాంసం. దృఢంగా ఉండే చిప్ప- ఎముకలు. అందులో ఉండే కొబ్బరి -మనిషిలోని ధాతువు. కాయలోని నీళ్లు - ప్రాణాధారం. పైన ఉండే మూడు కన్నులే - ఇడ, పింగళ, సుషుమ్న నాడులు. జుట్టు- అఖండమైన జ్ఞానానికీ, అహంకారానికీ ప్రతీక.

 అందుకే మన శరీరాన్ని ఆత్మతో నివేదించుకుంటున్న భక్తి భావంతో కొబ్బరికాయను కొట్టి భగవంతునికి సమర్పించు కోవాలి. ఇందులోని పరమార్థమిదే. అందుకే పిలక లేని కొబ్బరికాయను దేవునికి కొట్టడం దోషమే అవుతుంది. 

త్రిపురాసుర సంహారానికి వెళ్లే ముందు పరమశివుడు గణపతిని పూజించి, అతని కోరిక మేరకు తన తేజస్సుకు ప్రతిరూపంగా మూడు కండ్లు, జుట్టుతో తన శిరస్సులా ఉన్న కొబ్బరికాయను సృష్టించి నివేదనగా వినాయకుడికి సమర్పించాడని పురాణగాథ.

- లక్ష్మి రమణ 

Quote of the day

The weak can never forgive. Forgiveness is the attribute of the strong.…

__________Mahatma Gandhi