Online Puja Services

దీపారాధన ఎలా చేయాలంటే

18.191.93.18

దీపారాధన ఎలా చేయాలంటే .. 

దీపారాధన చేయడం అంటే ఆత్మ జ్యోతిని దర్శించడమే ! చమురున్నంతసేపూ దీపం దేదీప్యమానమై వెలుగుతుంది . ప్రాణం ఉన్నంతసేపూ శరీరం తనపాత్ర పోషిస్తూ ఉంటుంది .  చమురు అయిపోగానే , దీపం ఎలా కొండెక్కి ఆ పరమాత్మలో లీనమవుతోందో , అదే విధంగా మన ఆత్మఅనెదీపం , ప్రాణమనే చమురు నిండుకున్నప్పుడు ఆ పరమాత్మలో సంలీనమవ్వాలి . మరుజన్మ లేకుండా , బంధముక్తమై ముక్తికాంతని వారించాలి . అదేగా మనం రోజూ చేసే దీపారాధనలోని  పరమార్థం ! 

అయితే, ఐహికజగతిలో అనునిత్యం మనకి ఎదురయ్యే సమస్యల నుండీ గట్టెక్కేందుకు ఈ దీపారాధన విధి ఉపయోగిస్తుందంటున్నారు పెద్దలు . ఒక్కో దైవానికి ఒక్కో రకమైన వత్తులతో దీపారాధన చేయడం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి అని తెలియజేస్తున్నారు . 

ఏయే వత్తులు మంచివి?

- మంచిపత్తితో చేసిన వత్తులతో దేవునికి దీపారాధన చేసినట్లయితే పితృదేవతలకు గల దోషాలు పోతాయి.
- తామరతూడులతో వత్తులు చేసి స్వామివారికి దీపారాధన చేస్తే శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కలిగి అప్పులబాధ తగ్గిపోతుంది.
- అరటినార వత్తులతో దీపారాధన చేయడం వల్ల ఆ ఇంట్లో మంచి సంతానం కలుగుతుంది.
- జిల్లేడు వత్తులతో దీపారాధన వల్ల శ్రీ గణపతి అనుగ్రహం కలుగుతుంది. అధిక సంపదలు కలిగి దుష్టశక్తుల పీడ తొలగిపోతుంది.
- పసుపురంగు బట్టతో దీపారాధన చేయడం వలన జఠర, ఉదర వ్యాధులు, కామెర్లరోగం తగ్గుతాయి.
- కుంకుమనీటితో దానితో తడిపిన బట్టలతో చేసిన వత్తులతో దీపారాధన చేయడం వలన వైవాహిక చింతలు తొలగిపోతాయి. ఇంటిపై మాంత్రిక    శక్తులు ఏమీ పనిచేయలేవు.             - సంతానగోపాల స్వామి వారికి దీపారాధన చేస్తే అనుగ్రహంతో సంతానం కలుగుతుంది.
- వత్తులను పన్నీటితో అద్ది దీపారాధన చేస్తే శ్రీమహాలక్ష్మి అనుగ్రహం ఉంటుంది.

కానీ, దీపారాధన ఎలాచేసినా అందులో మన మనసు  భగవదార్పణ కావడం ముఖ్యమని గుర్తుంచుకోండి .  ఆయన దృష్టిలో , ఎంతటి సుగంధాన్ని నింపే పుష్పాన్ని ఆ స్వామీ పాదాలకి అర్పించినా అది మన మానస పుష్పంకన్నా మిన్న కాదు మరి. 

- లక్ష్మి రమణ 

Quote of the day

I slept and dreamt that life was joy. I awoke and saw that life was service. I acted and behold, service was joy.…

__________Rabindranath Tagore