Online Puja Services

భూమికి ఎందుకు నమస్కరించాలి?

216.73.216.68

భూమికి ఎందుకు నమస్కరించాలి?

మనము ఎన్ని తప్పులు చేసినా, చేయకూడని పనులు చేసినా, చిన్నతనంలో తల్లి ( జన్మనిచ్చిన తల్లి ) గోరు ముద్దలు తినిపించి, ఎత్తుకొని, ముద్దాడి, ప్రేమతో బిడ్డే తన లోకంగా జీవిస్తుంది తల్లి..

అలాగే భూమాత మన ఆకలి తీరుస్తోంది, దాహం తీరుస్తోంది..

సకల జీవరాసులకు 84 కోట్ల జీవరాసుల ఆకలి దప్పులు తీర్చుతున్న తల్లి భూమాత, అలాగే 84 కోట్ల జీవరాసుల మల మూత్రములను భరించి స్వీకరిస్తున్న మాత భూమాత, మనకు 10 సం:ల వయసు వచ్చిన తర్వాత మన తల్లి మన మల మూత్రములను తీసి శుభ్రం చేస్తుందా??
మనకు ఎంత వయసు వచ్చినా, మన యొక్క మల మూత్రములను, తన మీద భరించడమే కాక, వాటి వలన దుర్గంథము రాకుండా, తద్వారా వ్యాధులు ప్రబలకుండా, దానిని తనలో ఐక్యం చేసుకొని, ఈ జీవ కోటిని అనంత ప్రేమానురాగములతో కాపాడుచున్న మాత భూమాత.. 

చివరికి మనము మరణించిన తర్వాత మనతో పాటు అమ్మ (కన్నతల్లి), నా వారు నా వారు అని కౌగలించుకొని మనతో సహజీవనము చేసిన భార్య/ భర్త, బిడ్డలు, స్నేహితులు, బంధువులు మనతో రాకుండా శ్మశానములో ఆగిపోతే, నా బిడ్డ ఇంతకాలం (మరణిచిన మృతదేహము ఎలాంటి జీవనమును కలిగి ఉండినా సరే) జీవించి తనువు చాలించాడు., అని అవ్యాజమైన ప్రేమతో, తన కడుపులో దాచుకునే తల్లి భూమాత..

కేవలం మనలనే కాదు 84 కోట్ల జీవరాసులను ఆదరించే తల్లి భూమాత, ఇక్కడ ఒక్క క్షణం ఆలోచించండి..,

భూమాత అలా తన కడుపులో దాచుకోక వదిలేస్తే, ఆ శరీరాలు కృళ్లి, కృశించి, దుర్గంధ భూయిష్టమై రకరకాల వ్యాధులు ( కలరా, ప్లేగు, మలేరియా ) ప్రబలితే, ఎంత జన నష్టం జరుగుతుందో ఆలోచించండి, ఏ ఒక్కరు మరణించిన మృతదేహమును ఆ తల్లి కరుణించక, తనలో కలుపుకొనక పోతే ఈ జనారణ్యములో ఆ మృతదేహమును వదిలేస్తే కలరా/ ప్లేగు/ మలేరియా ప్రబలితే, మిగిలిన జీవరాసులు కూడా భూమి మీద అంతరించి పోవా..?

అందుకే భూమిపై కాలు మోపే ముందు ఆ తల్లిని క్షమాభిక్ష కోరుతూ ప్రార్థించాలి.

అలా ప్రార్థించ లేకపోతే మనంత కృతఘ్నులు ఈ ప్రపంచములో మరొకరు ఉండరు.

మిగిలిన జీవరాసుల విషయంలో వాటికి జ్ఞానం లేదు., ఆలోచించే శక్తి లేదు, ఆ శక్తి కేవలం ఈ మానవ మాత్రులకు మాత్రమే ఉంది..

- ఫణి రాఘవేంద్ర PRV 

Quote of the day

If you shut the door to all errors, truth will be shut out.…

__________Rabindranath Tagore