అవమ తిధిన ముగింపు
కొన్ని వేల ఏళ్ళ క్రితం, కార్తిక బహుల త్రయొదశీ-చతుర్దశీ-అమావాస్య రోజున కురుక్షేత్రం లో 18అక్షౌహిణుల సైన్యం ప్రాణాలు కొల్పోయింది.
అజ్ఞాతవాసం తరవాత కృష్ణుడు రాయబారానికి వచ్చాడు.
"అర్థ రాజ్యం పాండవులకి ఇమ్మన్నాడు" కృష్ణుడు.
"వీలు కాదు" అన్నాడు దుర్యోధనుడు.
"పోనీ 5 ఊళ్ళు" ఇమ్మన్నాడు.
"కుదరదు." సరికదా "సూదిమొన మొపిన భూమి కూడ ఇవ్వన"న్నాడు దుర్యోధనుడు.
కృష్ణుడు, "సింహం, అడవి కలిసుంటేనే వాటికి రక్షణ. అడవి దాటిన సింహానికి రక్షణ లేదు. సింహం లేని అడవికీ రక్షణ లేదు. కలిసి ఉండండి." అని చెప్పాడు. వినలేదు.
"యుద్థం వద్దు"అన్నడు. వినిపించుకోలేదు.
విశ్వరూపం చూపించాడు. ఇనా అర్థంకాలేదు.
పోనీ రక్తసంబంధం చెప్పి కర్ణుడినైనా తప్పిద్దాం అని చూసాడు. కుదరలేదు. 'అధర్మానికి నాలుగు పాదాలు' అన్నట్టుగా దుష్టచతుష్టయం కనిపించారు.
ఎందుకని? అవమ తిధిన ముగింపుకోసమే...
యుద్థం నిశ్చయం.
పైనుంచి సర్వ దేవతాగణం కన్నీటితో చూస్తూ ఉన్నారు. అసత్యాలతో, అధర్మాలతో, వెన్నుపోట్లతో, మోసలతో, కుట్ర-కుతంత్రాలతో 'ధర్మ'యుద్థం 18 రోజులూ నడిచింది.
ఫలితం:
1,870 రథాలు,
21,870 ఏనుగులు,
65,610 గుర్రాలు,
109,350 కాల్బలం - 1 అక్షౌహిణైతే,
కౌరవుల పక్షం 11 అక్షౌహిణులు, పాండవుల పక్షం 7 అక్షౌహిణులు.
వెరసి 18 అక్షౌహిణులు.
ఆ అవమతిథికి, అక్షరాలా 39 లక్షల 36 వేల 600 ప్రాణాలు గాలిలో కలిసిపొయాయి.
ఎవరికోసం?
చచ్చి దుర్యోధనుడు సాధించింది ఏమీ లేదు.
రాజ్యంలో మిగిలిఉన్న ప్రజలకోసమా? ఇంకెక్కడి ప్రజలు? కనిపించిన తలకి మొండం ఎక్కడుందో తెలియదు. తెగిపడిన చెయ్యి, కాలు ఎవరివో తెలియదు. మంసపు ముద్దలు అసలు సైనికులవా, గుర్రాలవా, ఎనుగులవా?
భర్తలు పొయి విధవరాండ్రై కొందరు, తండ్రిని, బాబాయిని, తాత ని పొగొట్టుకొన్న పిల్లలు. వీరా ఎలబడవలసిన ప్రజ? వీరికోసమా ఈ గెలుపు?
"నాకు ఈ రాజ్యం వద్దు" అన్నాడు ధర్మరాజు. గెలిచి ధర్మరాజు సాధించిందీ ఏమీ లేదు.
ఎటు చూసినా గుండెలుపిండేసేంత శోకం. అవసరమా?
తప్పుడు పెంపకాలు, చెడుస్నేహాలు, ఈర్ష్యా-ద్వేషాలు, కక్షలు, కుట్రలు, అవినీతి, అధర్మాల ఫలితం ఇదే!
కాబట్టి, ఈ రోజున వాగ్వివాదం, విరోధం, వైరం, దెబ్బలాటలు అంటే... మరణమే! మనకి వద్దు! భారత యుథ్దమే సాక్ష్యం కదా!!
అసలు పిల్లా-పాపలతో, సుఖ-సంతోషాలతో, ఆనందంగా కలిసి-మెలసి ఉండటం కుదరదా? అది అంత కష్టమా? కుదురుతుంది. ఎలాగో ఒక్క సారి ఆలోచించండి.
సర్వే జనా: సుఖినో భవంతు!
- మైలవరపు శ్రీనివాసరావు.