పంచముఖ పాంచజన్యం
పంచముఖ పాంచజన్యం
శ్రీకృష్ణుడు ధరించే శంఖం పాంచజన్యం.
ఈ పాంచజన్యం విశిష్టత ఏమిటంటే , ఒక శంఖంలో మరో నాలుగు శంఖాలు వుంటాయి.
సాధారణంగా వేయి శంఖాలలో ఒకటి మాత్రమే దక్షిణావర్త శంఖం ఉద్భవిస్తుంది. వాటిలో ఒక శంఖం గోమడి శంఖం. నూరు లక్షల గోమడి శంఖాలలో ఒక శంఖం పాంచజన్య శంఖంగా ఆవిర్భవిస్తుంది. అటువంటి పవిత్రమైన శంఖాన్ని దర్శించడమే పరమపవిత్రమని పురాణాలు తెలుపుతున్నాయి.
అటువంటి శంఖం మీరు ఇక్కడే దర్శించండి. ఆ పాంచజన్యము యొక్క అద్భుతమేమంటే ఒక పెద్ద శంఖంలో నాలుగు చిన్న శంఖాలు కనిపిస్తాయి.
ఈ రకమైన మహిమాన్వితమైన పాంచజన్య శంఖం మైసూరు లోని చాముండేశ్వరి దేవి ఆలయంలో వున్నది. ఈ శంఖాన్ని మైసూరు సంస్ధానాధీశులు చాముండేశ్వరీదేవికి కానుకగా సమర్పించారు. అమ్మవారి ఆరాధనోత్సవాలలో యీ విశేష శంఖాన్ని ఉపయోగిస్తారు
జై శ్రీ కృష్ణ
- సేకరణ