Online Puja Services

భగవంతుని కి కృతజ్ఞత ఎందుకు తెలపాలి???

3.144.8.79
మనం అనుభవిస్తున్న అదృష్టానికి - భగవంతుని కి కృతజ్ఞత ఎందుకు తెలపాలి???
 
నీకున్న ఉద్యోగ అర్హతలే ఇతరులకూ ఉన్నాయి, అయితే నీకు ఉద్యోగము వచ్చింది....!
ఇతరులకు రాలేదు....! కృతజ్ఞత కలిగి ఉండు.
 
నీవు చేసిన ఏ ప్రార్థనకైతే దేవుడు జవాబిచ్చాడో...
అదే ప్రార్థన అనేకులు ఇంకా చేస్తూనే ఉన్నారు.....!
జవాబు రాలేదు....! కృతజ్ఞత కలిగి ఉండు
 
ఏ దారిలో అయితే నీవు ప్రతిరోజూ క్షేమంగా ప్రయాణం చేస్తున్నావో.... అదే దారిలో...అనేకులు మరణించారు...!
కృతజ్ఞత కలిగి ఉండు.
 
 ఏ స్థలంలో అయితే దేవుడు 
నిన్ను దీవించాడో, అక్కడే... అనేకులు దేవున్ని పూజిస్తూనే ఉన్నారు, ఇంకా దీవెన రాలేదు..!
కృతజ్ఞత కలిగి ఉండు
 
ఆసుపత్రిలో  ఏ పడక  మీద ఉండి నీవు బాగుపడి ఇంటికెళ్ళావో......
అదే పడకపై ఉండి అనేకులు మరణించారు....!
కృతజ్ఞత కలిగి ఉండు
 
ఏ వర్షమైతే నీ పొలానికి మంచి 
పంటలనిచ్చిందో...అదే వర్షం, ఇతరుల  పొలాలను నాశనం చేసింది...
కృతజ్ఞత కలిగి ఉండు.
 
కృతజ్ఞత  కలిగి ఉండు...
ఎందుకంటే నీవేదైతే కలిగి ఉన్నావో
 అది నీ శక్తి కాదు,
నీ బలం కాదు,
నీ అర్హతలు కాదు....
కేవలం దేవుని అనుగ్రహం అని గుర్తుంచుకో...
 
నీకు కలిగిన ప్రతీది ఇచ్చేవాడు ఆయనే.
ప్రతీ విషయంలో దేవునికి కృతజ్ఞత కలిగి ఉండండి...
 
నీకు ఏదైనా సమయం లో సాయం చేసిన వారికి కృతజ్ఞతలు చెప్పడం మరిచిపోకు...
 
కృతజ్ఞత ఆశించడం వాళ్ళ తప్పు అవునో కాదో తెలియదు కానీ చెప్పడం మాత్రం నీ బాధ్యత విజ్ఞత... 
 
ఒక్కసారి ఆలోచించు...
కోట్లు సంపాదించే వాళ్లు మన వాళ్ళు ఎక్కడ ఉన్నా , నీకు నెలకు ఎన్ని పైసలు పంపినా, పక్కన (గంజి) నీళ్లు అందించే వాడే గొప్పోడు....
 
అందుకనే అప్పుడప్పుడు "మనీ"తో కాకుండా "మనిషి"తో కూడా మాట్లాడుతుండడం మంచిది...
చెప్పలేం ఏ అవసరం ఎలా వస్తుందో.! 
 
ఎన్ని కోట్లు ఉన్నా ఎప్పుడు ఎవరి సాయం తీసుకోవలసి వస్తుందో ఎవరికీ తెలియదు..
 
- సేకరణ 
 
 

Quote of the day

I slept and dreamt that life was joy. I awoke and saw that life was service. I acted and behold, service was joy.…

__________Rabindranath Tagore